110సీసీ డిస్కవర్ బైక్ తీసుకొస్తున్న బజాజ్

Written By:

దేశీయంగా దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తమ డిస్కవర్ శ్రేణి నుండి విపణిలోకి సరికొత్త డిస్కవర్ 110సీసీ బైకును లాంచ్ చేయడానికి ఏర్పాట్లు సిద్దం చేసుకుంది.

బజాజ్ డిస్కవర్ 110

తాజాగా అందిన రిపోర్ట్స్ ప్రకారం, ఈ ఏడాది విపణిలోకి విడుదల చేయనున్న 2018 డామినర్ 400 మరియు అవెంజర్ సిరీస్ బైకులతో పాటు డిస్కవర్ సిరీస్ నుండి సరికొత్త 110సీసీ కెపాసిటి గల బైకును విడుదల చేయనుంది.

Recommended Video - Watch Now!
Watch Now | Indian Navy's MiG-29K Crashed In Goa Airport | Full Details - DriveSpark
బజాజ్ డిస్కవర్ 110

డిస్కవర్ 110 బైకు పూర్తి స్థాయిలో విడుదలయితే డిస్కవర్ సిరీస్‌లో రెండవ బైకుగా, కంపెనీ కమ్యూటర్ మోటార్ సైకిళ్ల జాబితాలో ఆరవ మోడల్‌గా నిలవనుంది. ఈ సరికొత్త డిస్కవర్ 110 బైకు డిస్కవర్ 125 మరియు ప్లాటినా 100 మధ్య స్థానాన్ని భర్తీ చేస్తుంది. డిస్కవర్ 110 చూడటానికి అచ్చం 125 బైకునే పోలి ఉంటుంది.

బజాజ్ డిస్కవర్ 110

2018 వెర్షన్‌లో వచ్చే అవకాశం ఉన్న డిస్కవర్ 125 మరియు నూతన డిస్కవర్ 110 రెండింటిలో మ్యాట్ బ్లాక్ అల్లాయ్ వీల్స్, డిజిటల్ అనలాగ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, బ్లాక్ కలర్ ఫినిషింగ్ గల ఇంజన్, సిల్వర్ సైడ్ ప్యానల్స్, క్రోమ్ మఫ్లర్ మరియు సరికొత్త బాడీ గ్రాఫిక్స్‌తో రానున్నాయి.

బజాజ్ డిస్కవర్ 110

తక్కువ ఇంజన్ కెపాసిటీతో వస్తున్న డిస్కవర్ 110 బైకు కమ్యూటర్ మోటార్ సైకిల్ కాబట్టి. బజాజ్ ఇందులో ఎలాంటి అదనపు ఫీచర్లను అందివ్వడం లేదు. అయినప్పటికీ, ఎలక్ట్రిక్ ఇంజన్ స్టార్, హ్యాండిల్ బార్ చివర్లో అదనపు బరువులు ఉన్నాయి.

Trending On DriveSpark Telugu:

ఎప్పటికీ మరచిపోలేని టైటానిక్ విషాదం గురించి చరిత్ర మిగిల్చిన నిజాలు

2018లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం విడుదలయ్యే కార్లు

మారుతి 800 ఇంజన్‌తో బైక్ నిర్మించిన 20 ఏళ్ల కుర్రాడు

బజాజ్ డిస్కవర్ 110

ముందు మరియు వెనుక రెండు చక్రాలకు డ్రమ్ బ్రేకులే రానున్నాయి. సస్పెన్షన్ కోసం డ్యూయల్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున గ్యాస్‌తో నింపబడిన డ్యూయల్ షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి. అయితే, 2018 డిస్కవర్ 125లో మాత్రం ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వస్తోంది.

బజాజ్ డిస్కవర్ 110

బజాజ్ డిస్కవర్ 110 బైకులో సాంకేతికంగా 110సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే డిటిఎస్-ఐ ఇంజన్ కలదు. 4-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానంతో వచ్చే ఇది గరిష్టంగా 8.5బిహెచ్‌పి పవర్ మరియు 9.5ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

బజాజ్ డిస్కవర్ 110

బజాజ్ డిస్కవర్ 110 కమ్యూటర్ మోటార్ సైకిల్ రూ. 50,500 ల ఎక్స్-షోరూమ్ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది. డిస్కవర్ 125 బైకులోనే 125సీసీ ఇంజన్ స్థానంలో 110సీసీ ఇంజన్ మరియు పెద్ద టైర్ల స్థానంలో కాస్త చిన్న టైర్లను అందివ్వడం మినహాయిస్తే ఎలాంటి మార్పులు ఉండవు.

బజాజ్ డిస్కవర్ 110

సరికొత్త డిస్కవర్ 110 బైకుతో పాటు కొత్త తరం డామినర్ 400 మరియు అవెంజర్ సిరీస్ బైకులను ప్రవేశపెట్టనుంది. 2018 డామినర్ 400 నూతన కలర్ ఆప్షన్స్‌తో వస్తుంటే, అవెంజర్ సిరీస్‌లో 220 మరియు 150 బైకుల్లో డిజైన్ మరియు ఫీచర్ల పరంగా అప్‌డేట్స్ చోటు చేసుకోనున్నాయి.

బజాజ్ డిస్కవర్ 110

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బజాజ్ డిస్కవర్ 110 ఎంట్రీ లెవల్ కమ్యూటర్ మోటార్ సైకిల్, అయినప్పటికీ ఇందులో డిజిటల్ అనలాగ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఎలక్ట్రిక్ పవర్ స్టార్ట్ వంటి ఫీచర్లను అందిస్తోంది. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే, హీరో ప్యాసన్, ప్యాసన్ ఎక్స్‌ప్రో మరియు టీవీఎస్ విక్టర్ 110 మోడళ్లకు పోటీనివ్వనుంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Source: Autocar India

Read more on: #bajaj #బజాజ్
English summary
Read In Telugu: Bajaj To Introduce Discover 110 In India — Launch Details And Price Revealed

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark