బజాజ్ డామినర్ 400 మీద మళ్లీ పెరిగిన ధరలు

Written By:

దేశీయ దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థ బజాజ్ ఆటో 2018 బజాజ్ డామినర్ 400 ధరలను పెంచింది. బజాజ్ డామినర్ 400 నాన్ ఏబిఎస్ మరియు ఏబిఎస్ వేరింయట్ల మీద రూ. 2,000 లవరకు ధరలు పెంచింది.

బజాజ్ డామినర్ ధరలు

2018 బజాజ్ డామినర్ 400 నాన్-ఏబిఎస్ వేరియంట్ ధర రూ. 1,44,113 లు, దీని పాత ధర రూ. 1,42,109 లు. అదే విధంగా డ్యూయల్ ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వేరియంట్ పాత ధర రూ. 1,56,270 లు ఉండగా, ధరల పెంపు అనంతరం దీని ధర రూ. 1,58,275 లుగా ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

బజాజ్ డామినర్ ధరలు

బజాజ్ ఆటో 2018 ఎడిషన్ డామినర్ 400 బైకు విడుదలైన రెండు నెలల అనంతరం ధరల పెంపు చేపట్టింది. విడుదలైనప్పుడు, పాత ధరలతోనే కొత్త తరం డామినర్‌ను లాంచ్ చేసింది. వీటి ధరల పెంపు ఎప్పుడైనా ఉండవచ్చునని బజాజ్ ఇది వరకే పేర్కొంది.

బజాజ్ డామినర్ ధరలు

మునుపటి వెర్షన్‌తో పోల్చితే 2018 డామినర్ 400 బైకులో సాంకేతికంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఎక్ట్సీరియర్ కలర్ ఆప్షన్స్, కాస్మొటిక్ అప్‌డేట్స్ మరియు గోల్డ్ కలర్ ఫినిషింగ్ వంటి ఎక్ట్సీరియర్ డిజైన్ అంశాల్లో పరిమితమైన మార్పులు జరిగాయి. 2018 ఎడిషన్ డామినర్ 400 మూడు విభిన్న రంగుల్లో లభిస్తుంది. అవి, రాక్ మ్యాట్ బ్లాక్, గ్లేజియర్ బ్లూ మరియు కెనాన్ రెడ్.

బజాజ్ డామినర్ ధరలు

2018 బజాజ్ డామినర్ 400లో కెటిఎమ్ నుండి సేకరించిన అదే 373.3సీసీ కెపాసిటి గల ల్విక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజన్ కలదు. స్లిప్పర్ క్లచ్ సహాయంతో అనుసంధానించిన 6-స్పీడ్ గేర్‌బాక్స్ కలదు.

బజాజ్ డామినర్ ధరలు

ప్రస్తుతం, బజాజ్ డామినర్ విక్రయాలు ఆశించినమేర రావడం లేదు. ఈ నేపథ్యంలో ధరల పెంపు బజాజ్‌కు ఏ మాత్రం కలిసొస్తే అవకాశం లేదు. ఏదేమైనప్పటికీ, విదేశీ మార్కెట్లో డామినర్ 400కు డిమాండ్ అధికంగా ఎక్కువగా ఉంది.

బజాజ్ డామినర్ ధరలు

ఇటీవల అందిన రిపోర్ట్స్ మేరకు, బజాజ్ ఆటో డామినర్ 400 బైకును రెండు వేరియంట్లను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. రెట్రో స్టైల్ కస్టమర్ల కోసం క్లాసిక్ వేరియంట్ మరియు ఆఫ్ రోడింగ్ కస్టమర్ల కోసం స్క్రాంబ్లర్ వేరియంట్లను సిద్దం చేస్తోంది.

బజాజ్ డామినర్ ధరలు

1. అర్జున్ రెడ్డి మూవీలో ఉపయోగించిన బైకు గురించి తెలుసా...?

2.ఇండియన్ సెలబ్రిటీలు కార్లను ఇలా కస్టమైజ్ చేయించుకుంటారా ?

3.లక్షల కోట్లకు అధిపతి కాని ఆటోల్లో ప్రయాణిస్తాడు

4.మోడీ విమాన ప్రయాణం, మరియు ఎవరికి తెలియని ఆసక్తికర నిజాలు

5.లక్షద్వీప్ దీవుల్లో అద్భుతాన్ని నిర్మిస్తున్న భారత్

Read more on: #bajaj #బజాజ్
English summary
Read In Telugu: 2018 Bajaj Dominar 400 Prices Increased By Rs 2,000
Story first published: Saturday, March 31, 2018, 15:32 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark