బజాజ్ డామినర్ 400లో స్క్రాంబ్లర్ మరియు క్లాసిక్ వేరియంట్లు: విడుదల మరియు పూర్తి వివరాలు

Written By:

ఇండియన్ టూ వీలర్ మార్కెట్లో బజాజ్ ఆటో విక్రయిస్తోన్న అత్యంత శక్తివంతమైన మరియు ఖరీదైన మోటార్ సైకిల్‍ డామినర్ 400. స్పోర్టివ్ ప్రీమియమ్ క్రూయిజర్ డామినర్ 400 ఎన్నో ప్రీమియమ్ ఫీచర్లతో అందుబాటులో ఉంది. దేశీయ విక్రయాలతో పాటు విదేశీ మార్కెట్లలో కూడా డామినర్ 400కు విపరీతమైన ఆదరణ లభిస్తోంది.

బజాజ్ డామినర్ 400 స్క్రాంబ్లర్ మరియు క్లాసిక్ వేరియంట్లు

తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, బజాజ్ ఆటో డామినర్ 400 ఆధారిత రెండు విభిన్న వేరియంట్లను అభివృద్ది చేసే పనిలో ఉన్నట్లు తెలిసింది. విసృత శ్రేణి కస్టమర్లను ఆకట్టుకోవడానికి డామినర్ 400 బైకును స్క్రాంబ్లర్ మరియు క్లాసిక్ అనే రెండు వేరియంట్లను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది.

బజాజ్ డామినర్ 400 స్క్రాంబ్లర్ మరియు క్లాసిక్ వేరియంట్లు

పెద్ద మొత్తంలో మార్కెట్ వాటాను సొంతం చేసుకోవడానికి డామినర్ 400 బైకులో పలు మార్పులు చేర్పులు నిర్వహించి స్క్రాంబ్లర్ మరియు క్లాసిక్ అనే రెండు వేరియంట్లతో అన్ని రకాల కస్టమర్లను ఆకట్టుకోవాలని చూస్తోంది.

బజాజ్ డామినర్ 400 స్క్రాంబ్లర్ మరియు క్లాసిక్ వేరియంట్లు

ప్రస్తుతం, ఖరీదైన మరియు శక్తివంతమైన 350సీసీ మోటార్ సైకిళ్ల సెగ్మెంట్లో పాత కాలం నాటి డిజైన్ లక్షణాలున్న రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోటార్ సైకిల్ హాట్ కేకులా అమ్ముడవుతోంది. ఈ సెగ్మెంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఆధిపత్యమే ఎక్కువగా ఉంది.

బజాజ్ డామినర్ 400 స్క్రాంబ్లర్ మరియు క్లాసిక్ వేరియంట్లు

ఇప్పుడు డామినర్ స్క్రాంబ్లర్ మరియు క్లాసిక్ వేరియంట్ల పరిచయంతో రాయల్ ఎన్ఫీల్డ్ సేల్స్‌ను కొల్లగొట్టడానికి సిద్దమవుతోంది. ప్రస్తుతం, రెట్రో స్టైల్ మోటార్ సైకిళ్లకు డిమాండ్ అధికంగా ఉంది. అత్యుత్తమ టెక్నాలజీ మరియు శక్తివంతమైన ఇంజన్ గల డామినర్ 400 ఆ శైలిలో వస్తే భారీ సక్సెస్ ఖచ్చితంగా ఖాయం.

బజాజ్ డామినర్ 400 స్క్రాంబ్లర్ మరియు క్లాసిక్ వేరియంట్లు

డామినర్ 400 స్క్రాంబ్లర్ అనేక ఆఫ్ రోడింగ్ సామర్థ్యాలతో మరియు టూరింగ్ ఫీచర్లతో రానుంది. రెగ్యులర్ వెర్షన్‌ డామినర్ 400తో పోల్చుకుంటే స్క్రాంబ్లర్ వేరియంట్లో పొడవాటి విండ్ స్క్రీన్, ప్యానియర్స్, అదనపు లైట్లు, ఇంజన్ బాష్ ప్లేట్ మరియు అదనపు క్రాష్ గార్డ్స్ వంటి ఫీచర్ల జోడింపుతో రానుంది.

బజాజ్ డామినర్ 400 స్క్రాంబ్లర్ మరియు క్లాసిక్ వేరియంట్లు

అదే విధంగా, డామినర్ 400 క్లాసిక్ ఎడిషన్‌ పలు రెట్రో స్టైలింగ్ ఎలిమెంట్లతో రానుంది. గుండ్రటి ఆకారంలో ఉన్న ఎల్ఇడి హెడ్ ల్యాంప్ మరియు రెట్రో స్టైల్ ఫీచర్లతో రానుంది. ఏదేమైనప్పటికీ, బజాజ్ ఆటో ఇప్పటి వరకు క్లాసిక్ మరియు స్క్రాంబ్లర్ మోడళ్లను పరీక్షించిన దాఖలాలు లేవు.

బజాజ్ డామినర్ 400 స్క్రాంబ్లర్ మరియు క్లాసిక్ వేరియంట్లు

సాంకేతికంగా రెండు కొత్త వేరియంట్లు కూడా డామినర్ 400 లోని అదే శక్తివంతమైన 373సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో రానున్నాయి. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇంజన్ 35బిహెచ్‌పి పవర్ మరియు 35ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంతే కాకుండా, ఆఫ్ రోడ్ టైర్లు మరియు స్విచ్చబుల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు రానున్నాయి.

బజాజ్ డామినర్ 400 స్క్రాంబ్లర్ మరియు క్లాసిక్ వేరియంట్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బజాజ్ ఆటో భారీ అంచనాలతో తమ ఫ్లాగ్‌షిప్ డామినర్ 400 ఆశించిన మేర ఫలితాలివ్వడం లేదు. దీంతో రాయల్ బైకుల కంటే డామినర్ 400 బైకులు మెరుగైనవని సూచిస్తూ రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకు వ్యతిరేకంగా హాతీ మత్ పాలో అనే పలు రకాల యాడ్ వీడియోలను విడుదల చేస్తోంది. ఇప్పుడు నూతన వేరియంట్లను ప్రవేశపెడుతుండటంతో డామినర్ 400 విక్రయాలు మెరుగయ్యే అవకాశం ఉంది.

 బజాజ్ డామినర్ 400 స్క్రాంబ్లర్ మరియు క్లాసిక్ వేరియంట్లు

1. ప్రాణాలతో బయటపడాతా అనుకోలేదు!! సేప్టీలో ఈ కారును మించి తోపు లేదు

2.ఇండియాలో రోడ్డుకు ఎడమవైపు డ్రైవ్ చేయడం వెనకున్న సీక్రెట్స్

3.కనీవిని ఎరుగని సేల్స్‌తో హోండాకు చుక్కలు చూపిస్తున్న డబ్ల్యూఆర్-వి

4.రాంగ్ సైడ్ డ్రైవింగ్ నివారించడానికి టైర్ కిల్లర్స్ ఏర్పాటు చేసిన పోలీసులు

5.హ్యుందాయ్ ఐ20 మరియు మారుతి బాలెనో లక్ష్యంగా వస్తోన్న నిస్సాన్ కొత్త కారు

Read more on: #bajaj #బజాజ్
English summary
Read In Telugu: Bajaj Dominar 400 Scrambler And Classic Variants In The Works; Expected Launch & More Details
Story first published: Friday, March 30, 2018, 20:04 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark