రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు ఏనుగుల కంటే దారుణం: బజాజ్

Written By:
Recommended Video - Watch Now!
Auto Rickshaw Explodes In Broad Daylight

బజాజ్ ఆటో తమ సరికొత్త డామినర్ సిరీస్ యాడ్‌లను రివీల్ చేసింది. బజాజ్ మరోసారి రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను టార్గెట్ చేసింది. బజాజ్ డామినర్ బైకులు మరియు ఏనుగులతో మూడు కొత్త యాడ్‌లను విడుదల చేసింది.

 బజాజ్ డామినర్ యాడ్

బజాజ్ బైకుల్లో ఉన్న మూడు ప్రధాన బలాలను రాయల్ ఎన్ఫీల్డ్ బైకులతో పోల్చుతూ(రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను వీడియోలో ఏనుగులతో పోల్చారు) యాడ్ వీడియోలో చూపించింది.

 బజాజ్ డామినర్ యాడ్

బజాజ్ ఆటో ఇప్పుడే కాదు, గతంలో కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకు వ్యతిరేకంగా యాడ్ వీడియోలను విడుదల చేసింది. అప్పట్లో బజాజ్ యాడ్ అంగీకరించని రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాన్స్ బజాజ్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈసారి కూడా రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాన్స్ బజాజ్ యాడ్ మీద స్పందించే అవకాశం ఉంది.

మొదటి యాడ్- ఈ యాడ్‌లో బజాజ్ తమ డామినర్‌లో అందించిన డ్యూయల్ ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ హైలైట్ చేసింది. వాలుగా ఉన్న జారుడు తలం మీద డామినర్ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నిలిచింది. కానీ, ఏనుగులు జారిపోయి నీటిలోకి పడిపోయాయి.

 బజాజ్ డామినర్ యాడ్

మొదటి యాడ్ ప్రకారం, రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ లేదు. కానీ, బజాజ్ డామినర్‌లో ఉంది. డామినర్ స్థానంలో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు ఉంటే ఏనుగులకు జరిగిన పరిస్థితే రాయల్ ఎన్ఫీల్డ్ ఓనర్లకు అదే జరుగుతుందని పరోక్షంగా వివరించింది.

 బజాజ్ డామినర్ యాడ్

రెండవ యాడ్- రెండవ యాడ్‌లో కోల్డ్ స్టార్ట్స్ అంశం మీద టార్గెట్ చేసింది. రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను ఏనుగుల రూపంలో చూపించి తెల్లవారుజామున రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు స్టార్ట్ అవ్వాలంటే మొరాయిస్తుంది.

కానీ, బజాజ్ డామినర్ ఎలక్ట్రిక్ స్టార్టర్ ద్వారా క్షణాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా స్టార్ట్ అవుతుందని చూపించింది. హిమాలయాల్లోని ఎత్తైన ప్రదేశాల్లో కూడా బజాజ్ డామనిర్ బైకుల్లోని ఎలక్ట్రిక్ స్టార్టర్ బటన్ ద్వారా సజావుగా ప్రాణం పోసుకుందని వీడియోలో వెల్లడించింది.

 బజాజ్ డామినర్ యాడ్

మూడవ యాడ్- ఏనుగుల గుంపు ఘాట్ సెక్షన్‌లో నిటారుగా ఎక్కడానికి మొరాయించడాన్ని బజాజ్ డామినర్ బైకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దూసుకెళ్లడాన్ని పోల్చి చూపించారు.

ఈ మూడవ యాడ్ ద్వారా తక్కువ టార్క్ ఉత్పత్తి చేసే రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను పరోక్షంగా చూపించింది. ఈ మూడు వీడియోలను చూసిన ప్రతి ఒక్కరికీ ఖచ్చితంగా అవగతం అయ్యే విషయం రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను దారుణంగా చిత్రీకరించడం.

 బజాజ్ డామినర్ యాడ్

నిజానికి, బజాజ్ ఆటో 400సీసీ ఇంజన్ సెగ్మెంట్లో అద్భుతమైన మోడల్‌నే ప్రవేశపెట్టింది. ఏదేమైనప్పటికీ రాయల్ ఎన్ఫీల్డ్ సేల్స్ పరంగా డామినర్‌ను వెనక్కి నెట్టేసింది. కేవలం రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ బైకులే బజాజ్ డామినర్ సేల్స్‌ను అధిగమించింది.

 బజాజ్ డామినర్ యాడ్

మార్కెట్‌లో అగ్రెసివ్‌గా ఉన్న బజాజ్ అంతర్జాతీయ విపణిలో డామినర్ బైకుతో మంచి సక్సెస్ అందుకుంది. బజాజ్ డామినర్ బైకులో 373సీసీ కెపాసిటి గల ఫోర్-స్ట్రోక్ లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలదు.

 బజాజ్ డామినర్ యాడ్

6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ 35బిహెచ్‌పి పవర్ మరియు 35ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. బజాజ్ డామినర్ నాన్-ఏబిఎస్ మరియు ఏబిఎస్ వేరియంట్లో లభ్యమవుతోంది.

 బజాజ్ డామినర్ యాడ్

6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ 35బిహెచ్‌పి పవర్ మరియు 35ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. బజాజ్ డామినర్ నాన్-ఏబిఎస్ మరియు ఏబిఎస్ వేరియంట్లో లభ్యమవుతోంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Bajaj Dominar 'Haathi Mat Paalo' Part 2 Ads Takes A Sly Dig At Royal Enfield

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark