డామినర్ నాన్-ఏబిఎస్ వేరియంట్‌ను మార్కెట్ నుండి తొలగించిన బజాజ్

Written By:

బజాజ్ ఆటో విపణిలో ఉన్న తమ నాన్ ఏబిఎస్ వేరియంట్ డామినర్ 400 మోటార్ సైకిల్‌ను మార్కెట్ నుండి తొలగించింది. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ లేనటువంటి -డామినర్ 400 ఆశించిన ఫలితాలు సాధించకపోవడంతో సరసమైన డామినర్ బైకును మార్కెట్‌కు శాశ్వతంగా దూరం చేసింది.

Recommended Video - Watch Now!
హోండా ఎక్స్-బ్లేడ్ 160సీసీ బైక్ రివీల్ | Honda X-Blade - Details & Full Specifications - DriveSpark
బజాజ్ డామినర్ నాన్ ఏబిఎస్ వేరియంట్

బజాజ్ డామినర్ నాన్-ఏబిఎస్ వేరియంట్(ధర రూ. 1.42 లక్షలు) తొలగించడంతో ప్రస్తుతం డామినర్ శ్రేణి ధర రూ. 1.56 లక్షలతో ప్రారంభమవుతుంది. బజాజ్ డామినర్ 80 శాతం సేల్స్ ఏబిఎస్ వేరియంట్ల నుండే లభిస్తుండటంతో బజాజ్ ఈ నిర్ణయంతో పెద్దగా నష్టపోయేదేమీ లేదు.

బజాజ్ డామినర్ నాన్ ఏబిఎస్ వేరియంట్

బజాజ్ సరికొత్త డామినర్ 400 మోటార్ సైకిల్ విడుదలతో 400సీసీ కెటగిరీ బైకుల విభాగంలోకి డిసెంబర్ 2016లో ప్రవేశించింది. ప్రారంభంలోనే నాన్-ఏబిఎస్ మరియు ఏబిఎస్ వేరియంట్లలో డామినర్‌ను పరిచయం చేసింది.

బజాజ్ డామినర్ నాన్ ఏబిఎస్ వేరియంట్

బజాజ్ ఇండియా లైనప్‌లో డామినర్ 400 మోటార్ సైకిల్ అత్యంత శక్తివంతమైన మరియు ఖరీదైన మోడల్. కెటిమ్‌ నుండి సేకరిచిన 373సీసీ గల సింగల్ సిలిండర్ ఇంజన్‌ను రీట్యూన్ చేసి బజాజ్ తమ డామినర్‌లో అందించింది.

బజాజ్ డామినర్ నాన్ ఏబిఎస్ వేరియంట్

ట్రిపుల్ స్పార్క్ ప్లగ్ ఇగ్నిషన్, ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్, లిక్విడ్ కూలింగ్ మరియు 4-వాల్వ్స్ గల ఈ ఇంజన్ 35బిహెచ్‌పి పవర్ మరియు 35ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి స్లిప్పర్ క్లచ్ టెక్నాలజీ గల 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధాం కలదు.

బజాజ్ డామినర్ నాన్ ఏబిఎస్ వేరియంట్

స్పెన్షన్ కోసం ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్ కలదు. బ్రేకింగ్ డ్యూటీ కోసం రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు ఉన్నాయి. భద్రత పరంగా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కలదు.

బజాజ్ డామినర్ నాన్ ఏబిఎస్ వేరియంట్

బజాజ్ డామినర్‌లో ఆకర్షణీయమైన అల్లాయ్ వీల్స్ ట్యూబ్ లెస్ టైర్లతో వచ్చాయి. డామినర్ 400 బరువు 182కిలోలుగా ఉంది. కెటిఎమ్ 390 డ్యూక్ బైకుతో పోల్చుకుంటే దీని బరువు చాలా ఎక్కువగా ఉంది.

బజాజ్ డామినర్ నాన్ ఏబిఎస్ వేరియంట్

ఏబిఎస్ అనగా, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అని అర్థం. అధిక వేగంలో సడెన్ బ్రేకులు వేసినపుడు వీల్ స్కిడ్ మరియు వీల్ లాక్‌ను నివారించడంలో ఏబిఎస్ చక్కగా పనిచేస్తుంది. ఇందులో వీల్ స్పీడ్ సెన్స్ మైక్రోప్రాసెసర్ ఉంటుంది.

బజాజ్ డామినర్ నాన్ ఏబిఎస్ వేరియంట్

తిరుగుతున్న చక్రం సడెన్ బ్రేక్ వలన ఆగిపోతే స్కిడ్ అవుతుంది. అంటే చక్రం వేగం తగ్గిపోవడాన్ని గుర్తించి బ్రేకులను ఆటోమేటిక్‌గా తొలగిస్తుంది. మళ్లీ వెంటనే బ్రేకులను అప్లె చేస్తుంది. అంటే కొన్ని క్షణాల్లోనే లెక్కలేనన్ని సార్లు బ్రేక్ ప్రెజర్‌ను అప్లె చేసి, తొలగిస్తుంది. దీంతో ఎంత వేగమైనా క్షణాల్లోనే అదుపులోకి వస్తుంది.

Source: CarandBike

Read more on: #bajaj #బజాజ్
English summary
Read In Telugu: Bajaj Dominar non-ABS variant discontinued in India

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark