ఇప్పటికీ విక్రయాల్లో ఉన్న బజాజ్ పల్సర్ 135 ఎల్ఎస్

బజాజ్ ఆటో పల్సర్ శ్రేణిలో ఉన్న అతి చిన్న మోడల్ పల్సర్ 135 ఎల్ఎస్ బైకును ఆశించిన ఫలితాలు లేని కారణంగా మార్కెట్ నుండి తొలగించినట్లు ఇదే వరకే ఓ కథనంలో ప్రకటించాము. అయితే, బజాజ్ పల్సర్ 135 ఎల్ఎస్ ఇప్పటికీ

By Anil Kumar

బజాజ్ ఆటో పల్సర్ శ్రేణిలో ఉన్న అతి చిన్న మోడల్ పల్సర్ 135 ఎల్ఎస్ బైకును ఆశించిన ఫలితాలు లేని కారణంగా మార్కెట్ నుండి తొలగించినట్లు ఇదే వరకే ఓ కథనంలో ప్రకటించాము. అయితే, బజాజ్ పల్సర్ 135 ఎల్ఎస్ ఇప్పటికీ బజాజ్ అధికారిక వెబ్‌సైట్లో ఉంది. అంటే అతి చిన్న పల్సర్ మోడల్ ఇప్పటికీ ఇండియన్ మార్కెట్లో విక్రయాల్లో ఉందన్నమాట.

బజాజ్ పల్సర్ 135 ఎల్ఎస్

2018 బజాజ్ పల్సర్ 150 విడుదలతో, బజాజ్ పల్సర్ 135 ఎల్ఎస్ భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ పల్సర్ బైకుగా రాణించలేకపోయింది. దీంతో బజాజ్ పల్సర్ 135 ఎల్ఎస్ మార్కెట్ నుండి నిష్క్రమిస్తుందనే వదంతులు కూడా వచ్చాయి.

బజాజ్ పల్సర్ 135 ఎల్ఎస్

తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, ఇండియాలోని పలు ప్రాంతాల్లో పల్సర్ 135 ఎల్ఎస్ మోడల్‌కు మంచి గిరాకీ ఉన్నట్లు తెలిసింది. అంతే కాకుండా, కంపెనీ ఆశించిన మేరకు పల్సర్ 135 ఎల్ఎస్ మంచి ఫలితాలనే సాధిస్తున్నట్లు తెలిసింది.

బజాజ్ పల్సర్ 135 ఎల్ఎస్

అదే విధంగా బజాజ్ వెబ్‌సైట్లో జరిగిన మెయింటెనెన్స్ వర్క్ కారణంగా పల్సర్ 135 ఎల్ఎస్ మోడల్ కొన్నాళ్లపాటు వెబ్‌సైట్ నుండి మిస్సయ్యింది. దీంతో దీనిని మార్కెట్ నుండి తొలగించినట్లు భావించారు. ఎక్కువ డిమాండ్ ఉన్న విదేశీ మార్కెట్ల కోసం దీనిని దేశీయంగా తయారు చేసి ఎగుమతి చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ, దేశీ విపణిలో ఆశించిన సేల్స్ సాధించలేకపోతోంది.

బజాజ్ పల్సర్ 135 ఎల్ఎస్

బజాజ్ ఆటో 2018లో బజాజ్ పల్సర్ 135 ఎల్ఎస్ బైకును అప్‌డేట్ చేసి కస్టమర్లను ఆకట్టుకునేందుకు కమ్యూటర్ లుక్ తీసుకొచ్చారు. ఇందులో సరికొత్త సింగల్ సీటు ఉంది. అయితే, స్పోర్టివ్ టోయ్ గేర్ షిఫ్టర్ మరియు రెండుగా విడిపోయి ఉన్న రియర్ హ్యాండిల్ మిస్సయ్యాయి. అంతే కాకుండా, ఇందులో నూతన కలర్ అప్‌డేట్స్ మరియు పెద్ద పరిమాణంలో ఉన్న విండ్‌స్క్రీన్ వచ్చాయి.

బజాజ్ పల్సర్ 135 ఎల్ఎస్

భారత్‌లో 4-వాల్వ్ టెక్నాలజీతో వచ్చిన మొట్టమొదటి మోటార్‌సైకిల్ బజాజ్ పల్సర్ 135 ఎల్ఎస్. సాంకేతికంగా ఇందులో 134.6సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ 4-వాల్వ్, ట్విన్ స్పార్క్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 13.3బిహెచ్‌పి పవర్ మరియు 11.4ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

బజాజ్ పల్సర్ 135 ఎల్ఎస్

ప్రస్తుతం, బజాజ్ లైనప్‌లో ఉన్న డిస్కవర్ 125 పై స్థానాన్ని మరియు బెస్ట్ సెల్లింగ్ పల్సర్ 150 క్రింది స్థానాన్ని భర్తీ చేస్తోంది. అంతే కాకుండా, బజాజ్ ఇటీవల సరికొత్త 2018 బజాజ్ పల్సర్ 150 బైకును డ్యూయల్ డిస్క్ బ్రేకులతో ‌పాటు పలు అప్‌డేట్స్ నిర్వహించి లాంచ్ చేసింది. బజాజ్ పల్సర్ 135 ఎల్ఎస్ ప్రారంభ ధర రూ. 62,144 ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

బజాజ్ పల్సర్ 135 ఎల్ఎస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బజాజ్ ఆటో తమ అధికారిక వెబ్‌సైట్లో పల్సర్ 135 ఎల్ఎస్ బైకును చేర్చడంతో, మార్కెట్ నుండి పల్సర్ 135 ఎల్ఎస్ నిష్క్రమించిందని వ్యాపిస్తున్న వదంతులకు పుల్‌స్టాప్ పడింది. అయితే, పల్సర్ 135 ఎల్ఎస్‌లో ఎలాంటి అప్‌డేట్స్ పొందలేదు. ఏదేమైనప్పటికీ, ఈ మోడల్ మార్కెట్ నుండి వైదొలగిందని నిరుత్సాహపడిన యువకులకు ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

Source: Autocar India

Most Read Articles

Read more on: #బజాజ్
English summary
Read In Telugu: Bajaj Pulsar 135 LS Is Still On Sale — Listed On The Official Website
Story first published: Wednesday, April 25, 2018, 6:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X