మార్కెట్ నుండి పల్సర్ ఎల్ఎస్ 135 బైకును తొలగించిన బజాజ్

Written By:

బజాజ్ ఆటో ఈ ఏడాది జనవరిలో తమ అన్ని ఉత్పత్తులను కాస్మొటిక్ మార్పులు మరియు నూతన రంగుల జోడింపుతో అప్‌డేటెడ్ వెర్షన్‌లో లాంచ్ చేసింది. కానీ, పల్సర్ శ్రేణిలోని అతి చిన్న మోడల్ పల్సర్ ఎల్ఎస్135 ఈ 2018 రేంజ్ నుండి మిస్సయ్యింది. అయితే, తాజాగా అందిన సమాచారం మేరకు బజాజ్ ఆటో ఎల్ఎస్135 బైకును మార్కెట్ నుండి తొలగించినట్లు తెలిసింది.

బజాజ్ పల్సర్ ఎల్ఎస్135

బజాజ్ తమ వెబ్‌సైట్ నుండి ఎల్ఎస్135 బైకును తొలగించి ఈ ఆధారం లేని వార్తను నిజం చేసింది. అంతే కాకుండా, బజాజ్ ఈ చిన్న పల్సర్ బైకును యథావిధిగా ఉత్పత్తి చేస్తుంది, అయితే ఇండియన్ మార్కెట్లో లభించదు కేవలం విదేశీ మార్కెట్ కోసం తయారు చేస్తున్నట్లు తెలిసింది.

బజాజ్ పల్సర్ ఎల్ఎస్135

ఇండియన్ మార్కెట్లో 4-వాల్వ్ టెక్నాలజీతో వచ్చిన మొదటి బైకు బజాజ్ పల్సర్ ఎల్ఎస్135. ఇందులో 4-వాల్వ్ టెక్నాలజీ అందివ్వడంతో 150సీసీ మోటార్ సైకిల్‌కి సమానమైన పవర్ మరియు టార్క్ అదే విధంగా 125సీసీ బైకు కంటే మెరుగైన మైలేజ్ ఇవ్వగలిగింది.

బజాజ్ పల్సర్ ఎల్ఎస్135

స్టైలింగ్ విషయానికి వస్తే, పోటీదారులను పోల్చుకుంటే మోటార్ సైకిల్ అత్యంత పదునైన మరియు అగ్రెసివ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. లైట్ స్పోర్ట్ పర్ఫామెన్స్‌కు బ్రాండెడ్‌గా ఎల్ఎస్135 నిలిచింది.

బజాజ్ పల్సర్ ఎల్ఎస్135

బజాజ్ ఆటో 2017లో అప్‌డేట్ చేసిన పల్సర్ 135 బైక్‌కు కమ్యూటర్ మోటార్ సైకిల్ లుక్ తీసుకొచ్చింది. సాంకేతికంగా ఇందులో ఉన్న 135సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 13బిహెచ్‍‌పి పవర్ మరియు 11ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

Recommended Video - Watch Now!
హోండా ఎక్స్-బ్లేడ్ 160సీసీ బైక్ రివీల్ | Honda X-Blade - Details & Full Specifications - DriveSpark
బజాజ్ పల్సర్ ఎల్ఎస్135

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో స్పోర్టివ్ 125సీసీ బైకులకు గిరాకీ ఎక్కువగా ఉంది. బహుశా దీని వల్లనే కాబోలు తమ 135సీసీ స్పోర్టివ్ బైకును మార్కెట్ నుండి తొలగించింది. ప్రారంభంలో పల్సర్ ఎల్ఎస్135 మంచి సేల్స్ సాధించినప్పటికీ తరువాత మెల్లమెల్లగా దీని సేల్స్ తగ్గిపోయాయి.

బజాజ్ పల్సర్ ఎల్ఎస్135

పల్సర్ ఎల్ఎస్135 బైకును తొలగించడంతో, బజాజ్ లైనప్‌లో డిస్కవర్ 125 మరియు వి125 బైకులు మాత్రమే 125సీసీ సెగ్మెంట్లో ఉన్నాయి. బజాజ్ తమ పల్సర్ ఎల్ఎస్ 135 బైకును నూతన ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఏబిఎస్ ఫీచర్‌తో మళ్లీ రీలాంచ్ చేసే అవకాశం కూడా ఉంది.

బజాజ్ పల్సర్ ఎల్ఎస్135

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బజాజ్ ఆటో టూ వీలర్ల శ్రేణిలో 150సీసీ బైకుల తరహా అద్భుతమైన పవర్ మరియు 125సీసీ బైకుల తరహా గొప్ప మైలేజ్ అందించే ఏకైక ఎంట్రీ లెవల్ స్పోర్టివ్ మోటార్ సైకిల్ పల్సర్ ఎల్ఎస్135. విపణిలో ఉన్న పోటీని ఎదుర్కునేందుకు బజాజ్ ఖచ్చితంగా ఎల్ఎస్135 బైకును భారీ మార్పులు చేర్పులతో విడుతదల చేసే అవకాశం ఉంది.

బజాజ్ పల్సర్ ఎల్ఎస్135

1. 5 మరియు 7 సీటింగ్ ఎస్‌యూవీలకు రహదారి పరీక్షలు నిర్వహించిన టాటా

2.టియాగో కారు ఢీకొట్టడంతో రెండుగా చీలిపోయిన ట్రాక్టర్: ఇదీ కారు పరిస్థితి!

3. ఆరు ఎయిర్ బ్యాగులతో అత్యంత సరసమైన ధరలో లభించే కార్లు

4.విడుదలకు సిద్దమైన ఏబిఎస్ వెర్షన్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్: ధర మరియు ఇతర వివరాలు

5.యారిస్ విడుదల తేదీ ప్రకటించిన టయోటా

Source: ThrustZone

Read more on: #bajaj #బజాజ్
English summary
Read In Telugu: Bajaj Pulsar LS135 Discontinued In India
Story first published: Friday, April 6, 2018, 10:33 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark