కోటి యూనిట్ల సేల్స్ మైలురాయిని అధిగమించిన బజాజ్ పల్సర్

బజాజ్ పల్సర్ శ్రేణి ఇండియన్ మార్కెట్లోకి విడుదలైనప్పటి నుండి ఏకంగా కోటి బైకులకు పైగా అమ్ముడైనట్లు బజాజ్ ప్రకటించింది. గత డిసెంబరు 2017 నెలలో ప్రపంచ వ్యాప్తంగా కోటి యూనిట్ల పల్సర్ బైకులను ఉత్పత్తి చేయగ

By Anil Kumar

ఇటీవల ప్రచురించిన కథనంలో బజాజ్ పల్సర్ చరిత్రలోనే గత మే 2018లో అత్యధిక నెలవారీ విక్రయాలు సాధించినట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. బజాజ్ ఆటో దిగ్గజం ఒక్క మే 2018 నెలలోనే ఏకంగా 70,000 యూనిట్ల బజాజ్ పల్సర్ సిరీస్ బైకులను విక్రయించింది.

కోటి యూనిట్ల సేల్స్ మైలురాయిని అధిగమించిన బజాజ్ పల్సర్

ఇప్పుడు తాజాగా మరో రికార్డును నమోదు చేసుకుంది. బజాజ్ పల్సర్ శ్రేణి ఇండియన్ మార్కెట్లోకి విడుదలైనప్పటి నుండి ఏకంగా కోటి బైకులకు పైగా అమ్ముడైనట్లు బజాజ్ ప్రకటించింది. గత డిసెంబరు 2017 నెలలో ప్రపంచ వ్యాప్తంగా కోటి యూనిట్ల పల్సర్ బైకులను ఉత్పత్తి చేయగా, తాజా గణాంకాలతో కోటి పల్సర్ బైకులు రోడ్డెక్కినట్లు తెలిసింది.

కోటి యూనిట్ల సేల్స్ మైలురాయిని అధిగమించిన బజాజ్ పల్సర్

పల్సర్ సిరీస్ బైకుల కోటి యూనిట్ల సేల్స్ మైలురాయిని పురస్కరించుకొని బజాజ్ ఆటో తాజాగా ఓ టెలివిజన్ వీడియోను లాంచ్ చేసింది. ఈ వీడియోలో వివిధ రకాల పల్సర్ బైకులు మరియు వాటి స్టంట్లను చూపించింది.

బజాజ్ పల్సర్ సిరీస్ నూతన టీవీ యాడ్ వీడియోలో పల్సర్ ఆర్ఎస్200, పల్సర్ ఎన్ఎస్200, పల్సర్ 180 మరియు పల్సర్ 150 యుజీ5 బైకులు ఉన్నాయి. పల్సర్ సిరీస్‌లో ఉన్న ఇతర బైకులు ఈ వీడియోలో మిస్సయ్యాయి.

కోటి యూనిట్ల సేల్స్ మైలురాయిని అధిగమించిన బజాజ్ పల్సర్

మే 2018 నెలలో బజాజ్ పల్సర్ రేంజ్ మొత్తం విక్రయాలు 70,000 యూనిట్లు. ఈ తరహా సేల్స్ బజాజ్ చరిత్రలోనే మొదటిసారి నమోదయ్యాయి. బజాజ్ ఆటో ప్రస్తుతం పల్సర్ 135ఎల్ఎస్, పల్సర్ 150, పల్సర్ 180, పల్సర్ 220 ,పల్సర్ ఎన్ఎస్160, పల్సర్ ఎన్ఎస్200 మరియు పల్సర్ ఆర్ఎస్200.

కోటి యూనిట్ల సేల్స్ మైలురాయిని అధిగమించిన బజాజ్ పల్సర్

బజాజ్ పల్సర్ శ్రేణిలోని ఎంట్రీ లెవల్ మోడల్ పల్సర్ ఎల్ఎస్135 ప్రారంభ ధర రూ. 64,141 లు మరియు పల్సర్ శ్రేణిలోని టాప్ ఎండ్ మోడల్ ఆర్ఎస్200 ధర రూ. 1.25 లక్షల వరకు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

కోటి యూనిట్ల సేల్స్ మైలురాయిని అధిగమించిన బజాజ్ పల్సర్

బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 మరియు ఎన్ఎస్200 రెండు బైకుల్లో కూడా 199.5సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. అయితే, ఆర్ఎస్200 ఇంజన్ ఫ్యూయల్ ఇంజెక్షన్ మరియు ఎన్ఎస్200 కార్బోరేటర్‌తో లభ్యమవుతున్నాయి. పల్సర్ ఆర్ఎస్200 ఇంజన్ 24.5బిహెచ్‌పి పవర్ మరియు 18.6ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

కోటి యూనిట్ల సేల్స్ మైలురాయిని అధిగమించిన బజాజ్ పల్సర్

అదే విధంగా పల్సర్ ఎన్ఎస్200 లోని ఇంజన్ గరిష్టంగా 23.2బిహెచ్‌పి పవర్ మరియు 18.3ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు ఇంజన్‌లకు 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం మరియు సేఫ్టీ పరంగా రెండు బైకుల్లో కూడా ఆప్షనల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ అందివ్వడం జరిగింది.

కోటి యూనిట్ల సేల్స్ మైలురాయిని అధిగమించిన బజాజ్ పల్సర్

బజాజ్ ఆటో ఇటీవల పల్సర్ 150 బైకును పలు మార్పులు చేర్పులతో అప్‌డేటెడ్ వెర్షన్‌లో లాంచ్ చేసింది. పల్సర్ 150లో ఇరు వైపులా డిస్క్ బ్రేకులు మరియు పలు నూతన గ్రాఫిక్స్ పరిచయం అయ్యాయి. దీనితో పాటు ఫ్రంట్ డిస్క్ మరియు రియర్ డ్రమ్ బ్రేక్ గల పల్సర్ 150 క్లాసిక్ బైకును సాధారణ వేరియంట్ కంటే తక్కువ ధరలో లాంచ్ చేసింది.

కోటి యూనిట్ల సేల్స్ మైలురాయిని అధిగమించిన బజాజ్ పల్సర్

వీటితో పాటు ఎన్ఎస్200 ప్రేరణతో ఎన్ఎస్160 బైకును కూడా ప్రవేశపెట్టింది. పల్సర్ 220 మరియు పల్సర్ 180 ఎవర్ గ్రీన్ మోడళ్లు బజాజ్ కంపెనీకి ఇప్పటికీ నిలకడైన ఫలితాలు సాధించిపెడుతున్నాయి. బజాజ్ పల్సర్ శ్రేణిలో నూతన మోడళ్లను పరిచయం చేయడంలో విక్రయాలు గణనీయంగా పెరిగాయి.

కోటి యూనిట్ల సేల్స్ మైలురాయిని అధిగమించిన బజాజ్ పల్సర్

డ్రైవ్‍‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ టూ వీలర్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్లలో పల్సర్ ఒకటి. పల్సర్ బ్రాండ్ పేరు పరిచయంతో బజాజ్ తన ఉనికిని చాటుకుంది. పల్సర్ రేంజ్‌లోనే తక్కువ ఇంజన్ కెపాసిటి గల కమ్యూటర్ బైకులను మరియు ఎక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న పర్ఫామెన్స్ బైకులను ప్రవేశపెట్టడంతో భారీ విజయాన్ని అందుకుంది.

బజాజ్ ఆటో రానున్న కాలంలో పల్సర్ బ్రాండ్ పేరు క్రింది మరిన్ని నూతన ఉత్పత్తులను పరిచయం చేసే అవకాశం ఉంది.

Most Read Articles

Read more on: #బజాజ్
English summary
Read In Telugu: Bajaj Pulsar Range Achieves 1 Crore Sales Milestone In India
Story first published: Wednesday, July 4, 2018, 10:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X