బెనెల్లీ టిఎన్‌టి302ఎస్ విడుదల ఖరారు

, బెనెల్లీ ఇండియా సరికొత్త టిఎన్‌టి 302ఎస్ మోడల్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభించినట్లు తెలిసింది. తాజాగా అందిన సమాచారం మేరకు, బెనెల్లీ ఇండియా లైనప్‌లో ఉన్న టిఎన్‌టి 300 బైకు స్థానంలోకి ఈ సరి

By Anil Kumar

ఇటాలియన్ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం బెనెల్లీ ఇటీవల హైదరాబాద్‌కు చెందిన మహవీర్ గ్రూపుతో దేశీయ కార్యకలాపాలను కొనగసాగించడానికి పరస్పర భాగస్వామ్యపు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఉమ్మడి భాగస్వామ్యం క్రింద పలు నూతన ఉత్పత్తులు విపణిలోకి విడుదల కానున్నాయి. ఈ తరుణంలో, బెనెల్లీ ఇండియా సరికొత్త టిఎన్‌టి 302ఎస్ మోడల్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభించినట్లు తెలిసింది.

బెనెల్లీ టిఎన్‌టి 302ఎస్

తాజాగా అందిన సమాచారం మేరకు, బెనెల్లీ ఇండియా లైనప్‌లో ఉన్న టిఎన్‌టి 300 బైకు స్థానంలోకి ఈ సరికొత్త టిఎన్‌టి 302ఎస్ మోడల్‌ను ప్రవేశపెడుతున్నట్లు సమాచారం. గత ఏడాది ఇటలీలోని మిలాన్ కేంద్రంగా జరిగిన ఐక్మా 2017 మోటార్ సైకిల్ షోలో ఈ బైకును తొలిసారిగా ఆవిష్కరించారు.

బెనెల్లీ టిఎన్‌టి 302ఎస్

డిజైన్ పరంగా రెండు బైకులు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. ఒకే ఫ్రేమ్ ఆధారంగా రెండింటినీ నిర్మించడంతో స్వల్ప మార్పులు మినహాయిస్తే, ప్రధానంగా గుర్తించదగిన మార్పులేమీ లేవు. కానీ ఫ్రంట్ డిజైన్ మాత్రం కెటిఎమ్ డ్యూక్ 390 బైకును పోలి ఉందంటే, ఖచ్చితంగా అవుననే చెప్పాలి. డ్యూక్ 390లో ఉన్నటువంటి ఫ్లాట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ఇందులో కూడా వచ్చింది.

బెనెల్లీ టిఎన్‌టి 302ఎస్

బెనెల్లీ టిఎన్‌టి 302ఎస్ బైకులో కండలు తిరిగిన మరియు అగ్రెసివ్ డిజైన్ శైలిలో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్, బయటికి కనిపించే విధంగా ఉన్న ట్రెల్లిస్ ఫ్రేమ్ బైక్‌కు చక్కటి రూపాన్ని ఇచ్చాయి. సింగల్ పీస్ సీటు, పదునైన టెయిల్ సెక్షన్ మరియు విశాలమైన టైరు వంటివి ఉన్నాయి.

బెనెల్లీ టిఎన్‌టి 302ఎస్

అతి త్వరలో విడుదలవ్వనున్న బెనెల్లీ టిఎన్‌టి 302ఎస్ నేక్డ్ మోటార్ సైకిల్‌లో డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ మరియు టెయిల్ ల్యాంప్, అల్యూమినియం ప్లేట్ గల ఎగ్జాస్ట్ సిస్టమ్, స్ల్పిట్ గ్రాబ్ రెయిల్స్ మరియు అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

సేఫ్టీ పరంగా ముందు వైపున రెండు పెటల్ డిస్క్ బ్రేకులు మరియు వెనుక వైపున సింగల్ డిస్క్ బ్రేక్ కలదు. డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌ను తప్పనిసరి ఫీచర్‌గా అందివ్వడం జరిగింది.

బెనెల్లీ టిఎన్‌టి 302ఎస్

బెనెల్లీ టిఎన్‌టి 302ఎస్ బైకులో సాంకేతికంగా 300సీసీ సామర్థ్యం గల ప్యార్లల్-ట్విన్ ఇంజన్ కలదు, 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 37.5బిహెచ్‌పి పవర్ మరియు 25.6ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 16-లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం గల 302ఎస్ బైకు మొత్తం బరువు 203కిలోలుగా ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బెనెల్లీ మరియు మహవీర్ గ్రూప్ ఉమ్మడి భాగస్వామ్యం పలు నూతన మోడళ్లను దేశీయ మార్కెట్ కోసం సిద్దం చేస్తోంది. అందులో భాగంగానే, ప్రస్తుతం బెనెల్లీ ఇండియా లైనప్‌లో ఉన్న టిఎన్‌టి 300 స్థానంలో టిఎన్‌టి 302ఎస్ మోడల్‌ను ప్రవేశపెట్టడానికి సిద్దమైంది. ఇది పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే, మార్కెట్లో ఉన్న బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ మరియు కెటిఎమ్‌ డ్యూక్ 390 మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Source: IAB

Most Read Articles

English summary
Read In Telugu: Benelli TNT 302S India Launch Soon — To Replace TNT 300
Story first published: Monday, August 13, 2018, 10:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X