బిఎమ్‌డబ్ల్యూలోని అన్ని బైకుల మీద 1.60 లక్షల వరకు తగ్గిన ధరలు

By Anil
Recommended Video - Watch Now!
BMW Motorcycles Auto Expo 2018

బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న అన్ని మోడళ్ల మీద ధరలు తగ్గించినట్లు ప్రకటించింది. భారత ప్రభుత్వం అన్ని ఇంపోర్టెడ్ బైకుల మీద కస్టమ్స్ ట్యాక్స్ తగ్గించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిఎమ్‍‌డబ్ల్యూ మోటోరాడ్ ప్రతినిధులు వెల్లడించారు.

ట్యాక్స్ తగ్గించడంతో ధరల సవరణం అనంతరం భారత్‌లో లభించే అన్ని బిఎమ్‌డబ్ల్యూ బైకుల మీద ఏకంగా 1.60 లక్షల రుపాయలు వరకు ధర తగ్గింది.

తగ్గిన బిఎమ్‌డబ్ల్యూ బైకుల ధరలు

పూర్తి స్థాయిలో నిర్మించి దిగుమతి చేసుకునే బైకుల మీద విధించే కస్టమ్స్ ట్యాక్స్‌లో 25 శాతం వరకు ట్యాక్స్ తగ్గించినట్లు కేంద్రం ఇది వరకే ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ధరల సవరణ చేపట్టి బిఎమ్‌డబ్ల్యూ దిగుమతి చేసుకునే అన్ని బైకుల ధరలను కొత్త ధరలతో సవరించింది.

తగ్గిన బిఎమ్‌డబ్ల్యూ బైకుల ధరలు

బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ ఇండియా లైనప్‌లో ఉన్న అడ్వెంచర్, స్పోర్ట్, టూరింగ్, హెరిటేజ్ మరియు రోడ్‌స్టర్ వంటి కెటగిరీల్లో ఉన్న మోటార్ సైకిళ్ల మీద 10 శాతం వరకు ధరలను తక్షణమే తగ్గించింది.

తగ్గిన బిఎమ్‌డబ్ల్యూ బైకుల ధరలు

ప్రస్తుతం దేశీయంగా బిఎమ్‌డబ్ల్యూ లైనప్‌లో ఎస్ 1000ఆర్ఆర్, ఆర్ 1200 ఆర్ఎస్, ఆర్ 1200 జిఎస్, ఆర్ 1200 జిఎస్ అడ్వెంచర్, ఎఫ్ 750 జిఎస్, ఎఫ్ 850 జిఎస్, ఎస్ 100 ఎక్స్ఆర్, ఎస్ 1000ఆర్, ఆర్ 1200 ఆర్, ఆర్ నైన్‌టీ, ఆర్ నైన్‌టీ స్క్రాంబ్లర్, ఆర్ నైన్‌టీ రేసర్, ఆర్ 1200 ఆర్‌టి, కె 1600 జిటిఎల్ మరియు కె 1600 బి వంటి అత్యంత ఖరీదైన బైకులు ఉన్నాయి.

తగ్గిన బిఎమ్‌డబ్ల్యూ బైకుల ధరలు

బిఎమ్‌డబ్ల్యూ ఆటో ఎక్స్‌పో 2018లో విడుదల చేసిన ఎఫ్750 జిఎస్ మరియు ఎఫ్ 850 జిఎస్ బైకుల ధరల్లో ఎలాంటి తగ్గింపు జరగలేదు. ఇదే ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన జి 310 ఆర్ మరియు జి310 జిఎస్ బైకులను అతి త్వరలో విడుదల చేయనుంది.

తగ్గిన బిఎమ్‌డబ్ల్యూ బైకుల ధరలు

బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్, విక్రమ్ పవా మాట్లాడుతూ, "బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ మోటార్ సైకిల్ బ్రాండ్ ఇండియాలో ఇప్పటికే మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇప్పుడు అధిక మొత్తంలో ధరలు తగ్గడంతో బిఎమ్‌డబ్ల్యూ బైకులను ఎంచుకోవాలనుకునే ఔత్సాహికులను చేరుకోగలం అని చెప్పుకొచ్చాడు."

తగ్గిన బిఎమ్‌డబ్ల్యూ బైకుల ధరలు

ధరకు తగ్గ విలువలతో మోటార్ సైక్లింగ్‌లో కస్టమర్లకు విభిన్నమైన అనుభవం మరియు నాణ్యతతో కూడా అద్భుతమైన రైడింగ్ అందివ్వడం పట్ల బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ నిబద్ధతతో ఉన్నట్లు వివరించాడు.

తగ్గిన బిఎమ్‌డబ్ల్యూ బైకుల ధరలు

బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్ఆర్ ప్రో మీద గరిష్టంగా రూ. 1,60,000 ల వరకు ధర తగ్గింది. మరియు బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1200 జిఎస్ స్టాండర్డ్ వేరియంట్ ధరలో 20,000 ల వరకు తగ్గింది.

తగ్గిన బిఎమ్‌డబ్ల్యూ బైకుల ధరలు

బిఎమ్‍‌డబ్ల్యూ బైకులు-పాత ధరలు-కొత్త ధరలు-తగ్గిన ధర

Model Old Price New Price Difference
S 1000 RR Standard Rs 18.90 lakh Rs 17.90 lakh Rs 1 lakh
S 1000 RR Pro Rs 21.40 lakh Rs 20.60 lakh Rs 80,000
R 1200 RS Standard Rs 15.90 lakh Rs 15.40 lakh Rs 50,000
R 1200 RS Dynamic+ Rs 16.90 lakh Rs 16.40 lakh Rs 50,000
R 1200 GS Standard Rs 15.90 lakh Rs 15.70 lakh Rs 20,000
R 1200 GS Pro Rs 19.50 lakh Rs 18.90 lakh Rs 60,000
R 1200 GS Adventure Standard Rs 17.50 lakh Rs 17.10 lakh Rs 40,000
R 1200 GS Adventure Pro Rs 21.40 lakh Rs 20.80 lakh Rs 60,000
S 1000 XR Standard Rs 18.50 lakh Rs 17.50 lakh Rs 1 lakh
S 1000 XR Pro Rs 21.50 lakh Rs 19.90 lakh Rs 1,60,000
F 750 GS Rs 12.20 lakh Rs 12.20 lakh Nil
F 850 GS Rs 13.70 lakh Rs 13.70 lakh Nil
S 1000 R Standard Rs 16.90 lakh Rs 16.30 lakh Rs 60,000
S 1000 R Sport Rs 17.90 lakh Rs 17.20 lakh Rs 70,000
S 1000 R Pro Rs 18.90 lakh Rs 18.10 lakh Rs 80,000
R 1200 R Standard Rs 14.90 lakh Rs 14.90 lakh Nil
R 1200 R Exclusive Rs 15.40 lakh Rs 15.40 lakh Nil
R 1200 R Style Rs 15.50 lakh Rs 15.50 lakh Nil
R nineT Rs 17.90 lakh Rs 17.30 lakh Rs 60,000
R nineT Scrambler Rs 15.90 lakh Rs 15.40 lakh Rs 50,000
R nineT Racer Rs 17.30 lakh Rs 16.50 lakh Rs 80,000
R 1200 RT Standard Rs 18.50 lakh Rs 18.20 lakh Rs 30,000
R 1200 RT Pro Rs 21.90 lakh Rs 21.50 lakh Rs 40,000
K 1600 GTL Pro Rs 28.50 lakh Rs 28.30 lakh Rs 20,000
K 1600 B Pro Rs 29.00 lakh Rs 28.10 lakh Rs 90,000
Most Read Articles

English summary
Read In Telugu: BMW Bike Prices Reduced By Up To Rs 1.60 Lakh: New Price List Of Entire Range Revealed
Story first published: Friday, February 23, 2018, 17:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more