TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
ఆటో ఎక్స్‌పో వేదికగా రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ బైకులను తీసుకొస్తున్న బిఎమ్‍డబ్ల్యూ

బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదిక మీద జి310 కవల బైకులు: జి310 ఆర్ మరియు జి310 జిఎస్ బైకులను ఆవిష్కరించడానికి సిద్దమైంది. 2018 ఫిబ్రవరిలో ఢిల్లీ వేదికగా జరగబోయే వాహన ప్రదర్శనలో బిఎమ్‌డబ్ల్యూ యొక్క బడ్జెట్ ఫ్రెండ్లీ బైకులను ప్రదర్శించనుంది.
రెండు మోటర్ సైకిళ్లను ఒకే ఛాసిస్ మీద డెవలప్ చేసింది. అయితే, డిజైన్ పరంగా రెండు బైకులు చూడటానికి చాలా విభిన్నంగా ఉన్నాయి. వీటిలో జి310 ఆర్ నేక్డ్ స్పోర్ట్స్ బైకు కాగా... జి310 జిఎస్ ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ టూరర్ మోటార్ సైకిల్.
బిఎమ్డబ్ల్యూ మోటోరాడ్ ఈ రెండు బైకులను తొలుత 2016లో జరిగిన ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదిక మీద ఆవిష్కరించింది. మరియు ఇండియన్ టూ వీలర్ ఇండస్ట్రీలో విడుదల ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోడళ్లలో ఈ రెండు బైకులు ఉన్నాయి.
దక్షిణ భారత ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్స్ బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్‌తో టూ వీలర్ల తయారీకి భాగస్వామ్యపు ఒప్పందం కుదుర్చుకుంది. జి310 శ్రేణిలోని రెండు బైకులను తమిళనాడులో ఉన్న హోసూర్ టీవీఎస్ ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి చేసి విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది.
గత రెండేళ్లలోనే విడుదల కావాల్సిన బైకులు, అనివార్య కారణాల రీత్యా ఈ ఏడాది దేశీయ విపణిలోకి విడుదలకు సిద్దమయ్యాయి. ఇంజన్, సస్పెన్షన్, ఛాసిస్, అల్లాయ్ వీల్స్, బ్రేక్స్ మరియు ఎగాస్ట్ వంటి కీలకమైన విడి భాగాలు జి310 ఆర్ మరియు జి310 జిఎస్ రెండు బైకుల్లో ఒకేలా ఉన్నాయి.
సాంకేతికంగా రెండు బైకుల్లో 312సీసీ కెపాసిటి గల లిక్విడ్‌తో చల్లబడే ఫ్యూయల్ ఇంజెక్టెడ్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఈ ఇంజన్ గరిష్టంగా 34బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
Trending On DriveSpark Telugu:
ఈ ఎస్‌యూవీలు భారతదేశపు మైలేజ్ ఛాంపియన్లు
2018 స్విఫ్ట్ అఫీషియల్ బుకింగ్స్ స్టార్ట్: బుకింగ్ ధర మరియు డెలివరీ వివరాలు!!
ఆల్టో కార్లతో రేసింగ్: యువ క్రికెటర్ మృతి
టీవీఎస్ మరియు బిఎమ్‌డబ్ల్యూ భాగస్వామ్యం నుండి వస్తున్న తొలి మోటార్ సైకిల్ జి310 ఆర్, రెండవ బైకు జి310 జిఎస్. జి310 ఆర్ బైకు కెటిఎమ్ డ్యూక్ 390, కవాసకి జడ్250 మరియు 2 లక్షల లోపు ధరలో లభించే ఇతర పర్ఫామెన్స్ మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.
అదే విధంగా, బిఎమ్‌డబ్ల్యూ జి310 జిఎస్ మోటార్ సైకిల్ విపణిలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్, మహీంద్రా మోజో, కవాసకి వెర్సేస్ ఎక్స్300 మరియు కెటిఎమ్ నుండి అతి త్వరలో రానున్న 390 అడ్వెంచర్ మోటార్ సైకిల్‌కు గట్టి పోటీగా నిలవనుంది.
బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ మరియు జి310 జిఎస్ బైకులు రూ. 2.5 లక్షల నుండి రూ. 2.8 లక్షల ధరల శ్రేణిలో ఎక్స్-షోరూమ్‌గా వచ్చే అవకాశం ఉంది. ఈ రెండింటితో పాటు, ఎఫ్750 జిఎస్ మరియు ఎఫ్850 జిఎస్ బైకులను 2018 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించనుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ దేశవ్యాప్తంగా విక్రయ కేంద్రాల ఏర్పాటు చేసుకోవడంలో బిజీగా ఉంది. ఈ కారణంతోనే జి310 ఆర్ మరియు జి310 జిఎస్ విడుదలను ఆలస్యం చేసింది. దేశీయంగా తయారయ్యి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి అవుతున్న జి310 కవల బైకులను 2018 ఆటో ఎక్స్‌పో వేదిక మీద ఆవిష్కరించడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.
Trending DriveSpark Telugu YouTube Videos