యానివర్సరీ ఎడిషన్‌లో డుకాటి మోన్‌స్టర్ 1200

ఇటాలియన్ సూపర్ బైకుల తయారీ దిగ్గజం డుకాటి సరికొత్త లిమిటెడ్ ఎడిషన్ మోన్‌స్టర్ 1200 బైకును ఆవిష్కరించింది. మోన్‌స్టర్ బ్రాండ్ 25 ఏళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని లిమిటెడ్ ఎడిషన్ మోన్‌స్టర్ 1200 మ

By Anil Kumar

ఇటాలియన్ సూపర్ బైకుల తయారీ దిగ్గజం డుకాటి సరికొత్త లిమిటెడ్ ఎడిషన్ మోన్‌స్టర్ 1200 బైకును ఆవిష్కరించింది. మోన్‌స్టర్ బ్రాండ్ 25 ఏళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని లిమిటెడ్ ఎడిషన్ మోన్‌స్టర్ 1200 మోడల్‌‌ను కేవలం 500 యూనిట్లను మాత్రమే విక్రయించనుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ బైక్‌కు 25°యానివర్సరియో అనే పేరు పెట్టింది.

డుకాటి మోన్‌స్టర్ 1200

డుకాటి మోన్‌స్టర్ 1200 లిమిటెడ్ ఎడిషన్ బైకు టాప్ ఎండ్ వేరియంట్ మోన్‌స్టర్ 1200 ఆర్ నుండి సేకరించిన కార్బన్-ఫైబర్ పార్ట్స్ మరియు మెకానికల్ విడి భాగాలను పంచుకుంది. అంతే కాకుండా, 2008 మోన్‌స్టర్ ఎస్4ఆర్ఎస్ టెస్టాస్ట్రెట్టా ట్రైకలర్ వేరియంట్ ప్రేరణతో స్పెషల్ కలర్ స్కీమ్‌లో లిమిటెడ్ ఎడిషన్ మోన్‌స్టర్ 1200 మోడల్‌ను అందించారు.

డుకాటి మోన్‌స్టర్ 1200

ఇటాలియన్ జెండాలోని మూడు రంగులను బైకులో విండ్ స్క్రీన్, ఫ్యూయల్ ట్యాంక్ మరియు పిలియన్ సీటు కవర్ మీద అందించారు. డుకాటి మోన్‌స్టర్ స్పెషల్ ఎడిషన్ ఫ్రేమ్ గోల్డ్ కలర్ ఫినిషింగ్‌లో ఉంది. 25 యానివర్సరీ ఎడిషన్ మోన్‌స్టర్ 1200 బైకులో డబ్ల్యూ-ఆకారంలో ఉన్న గోల్డ్ కలర్ ఫినిషింగ్‌లో ఉన్న మార్చేసిన్ వీల్స్ ఉన్నాయి.

డుకాటి మోన్‌స్టర్ 1200

అంతే కాకుండా, ఈ మోన్‌స్టర్‌లో సాలిడ్ అల్యూమినియం హ్యాండిల్‌బార్-ఎండ్ వెయిట్స్, మిర్రర్స్ మరియు ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్ ఉన్నాయి. ఫ్రంట్ మరియు రియర్ మడ్ గార్డ్స్, ఎగ్జాస్ట్ హీట్ గార్డ్ మరియు కీహోల్ కవర్ వంటి వాటిని కార్బన్ ఫైబర్‌తో తయారు చేశారు.

డుకాటి మోన్‌స్టర్ 1200

సాంకేతికంగా డుకాటి మోన్‌స్టర్ 1200 25°యానివర్సరియో బైకులో 1,198సీసీ కెపాసిటి గల ఎల్-ట్విన్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ కలదు. ఇది 145బిహెచ్‌పి పవర్ మరియు 124ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పవర్ మరియు టార్క్ మోన్‌స్టర్ 1200 ఎస్ మోడల్ తరహాలోనే ఉన్నప్పటికీ, మిగతా అన్ని భాగాలను మోన్‌స్టర్ 1200ఆర్ నుండి సేకరించారు.

డుకాటి మోన్‌స్టర్ 1200

డుకాటి మోన్‌స్టర్ 1200 యానివర్సరీ ఎడిషన్ బైకులో పూర్తి స్థాయిలో అడ్జెస్ట్ చేసుకునే వీలున్న స్టీరింగ్ డ్యాంపర్ గల ఓహ్లిన్స్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంది. బ్రేకింగ్ డ్యూటీ కోసం ముందు వైపున బ్రెంబో ఎమ్50 మోనోబ్లాక్ గల 330ఎమ్ఎమ్ ట్విన్-డిస్క్ బ్రేకులు మరియు వెనుక వైపున 245ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ కలదు.

డుకాటి మోన్‌స్టర్ 1200

డుకాటి మోన్‌స్టర్ 1200 లిమిటెడ్ ఎడిషన్ బైకులో ఇనర్షియల్ మెజర్‌మెంట్ యూనిట్ సమాచారాన్ని బాష్ కార్నరింగ్ ఏబిఎస్ మరియు డుకాటి వీలీ కంట్రోల్ యూనిట్‌కు చేరవేస్తుంది. వీటితో పాటు డుకాటి ట్రాక్షన్ కంట్రోల్, డుకాటి క్విక్ షిప్ట్ అప్ అండ్ డౌన్ మరియు స్పోర్ట్, టూరింగ్ అదే విధంగా అర్బన్ అనే మూడు విభిన్న రైడింగ్ మోడ్స్ ఉన్నాయి.

డుకాటి మోన్‌స్టర్ 1200

సరికొత్త డుకాటి మోన్‌స్టర్ 1200 లిమిటెడ్ ఎడిషన్ సెప్టెంబర్ 2018 నుండి యూరోపియన్ మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది. ఆ తరువాత జపాన్, యునైటెడ్ స్టేట్స్ మరియు ఆస్ట్రేలియా వంటి మార్కెట్లకు రానుంది.

డుకాటి మోన్‌స్టర్ 1200

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇటాలియన్ దిగ్గజం విక్రయిస్తున్న మోస్ట్ పాపులర్ మోటార్ సైకిళ్లలో డుకాటి మోన్‌స్టర్ 1200 ఒకటి. సరికొత్త మోన్‌స్టర్ 1200 లిమిటెడ్ ఎడిషన్ ఇండియాకు వచ్చే అవకాశాలు లేవు. మోన్‌స్టర్ శ్రేణిలోని టాప్ ఎండ్ వేరియంట్ 1200ఆర్ బైకునే ఇప్పటి వరకు ఇండియాలో లాంచ్ చేయలేదు. కాబట్టి, దీని ఆధారంగా రూపొందించిన లిమిటెడ్ ఎడిషన్ రావడం అసాధ్యమనే చెప్పాలి.

Most Read Articles

English summary
Read In Telugu: Ducati Monster 1200 25th Anniversary Edition Unveiled
Story first published: Friday, June 29, 2018, 10:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X