రిపబ్లిక్ డే రైడ్‌లో అపశ్రుతి: రెండు నిండు ప్రాణాలు బలి

Written By:
Recommended Video - Watch Now!
Andhra Pradesh State Transport Bus Crashes Into Bike Showroom - DriveSpark

రిపబ్లిక్ డే రైడ్ పేరుతో జరిగిన రైడింగ్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ రైడ్‌లో రైడర్ స్పాట్‌లో మరణించగా అడ్డంగా వచ్చిన గేదె కూడా అక్కడిక్కడే మృతి చెందింది.

డుకాటి 959 పనిగాలే యాక్సిడెంట్

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పేరుగాంచిన డుకాటి రైడర్ మోయిన్ షేక్ అహ్మదాబాద్ సిటీలోని మోటోనోవా డుకాటి షోరూమ్‌లో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. రిపబ్లిక్ డే సందర్భంగా చేసిన రైడింగ్‌లో డుకాటి 959 పనిగాలే బైకును రైడ్ చేసిన మోయిన్ షేక్ మృతి చెందాడు.

డుకాటి 959 పనిగాలే యాక్సిడెంట్

ఇతర డుకాటి రైడర్లతో హైవే మీద రిపబ్లిక్ డే రైడ్ చేస్తున్న మోయిన్ షేక్ తన డుకాటి పనిగాలే బైకును అధిక వేగంతో గేదెను ఢీకొన్నాడు.

డుకాటి 959 పనిగాలే యాక్సిడెంట్

రోడ్డు ప్రక్కన ఉన్న గేదె ఉన్నట్లుండి రోడ్డు మీద వచ్చింది. స్పందించే సమయం కూడా లేకపోవడంతో అత్యధిక వేగం మీద ఉన్న మోయిన్ గేదను తప్పించలేక ఢీకొట్టాడు. క్షణాల్లో జరిగిన ఈ ప్రమాదంలో మోయిన్ మరియు గేదె ఇద్దరూ ప్రాణాలు విడిచారు.

డుకాటి 959 పనిగాలే యాక్సిడెంట్

ఫేస్‌బుక్‌లో చేరిన ఈ సంఘటన వైరల్‌ అయిపోయింది. తోటి రైడర్లు మోయిన్ షేక్ అంబులెన్సు‌లో హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు ఈ కేసు నమోదు చేసుకుని సంఘటన వివరాలను ఆరా తీసి లాంఛనాలు పూర్తి చేశారు.

డుకాటి 959 పనిగాలే యాక్సిడెంట్

రిపబ్లిక్ డే రైడ్‌లో పాల్గొన్న ఇతర రైడర్లు అప్రమత్తం అయ్యి, రైడింగ్ నిలిపివేశారు. షేక్ పనిచేస్తున్న డుకాటి షోరూమ్‌లో మరియు తన కుంటుంబ సభ్యులకు సమాచారాన్ని తెలియజేశారు.

డుకాటి 959 పనిగాలే యాక్సిడెంట్

అనూహ్యమైన భారతీయ రోడ్లకు మరో రైడర్ బలయ్యాడు. ఏదేమైనప్పటికీ ఇండియా ఓ మంచి రైడర్‌ను కోల్పోయింది. మోయిన్ షేక్ కుటుంబ సభ్యులకు డ్రైవ్‌స్పార్క్ టీమ్ ప్రగాఢ సానుభూతి...

డుకాటి 959 పనిగాలే యాక్సిడెంట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

59 వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్న రోజు, ఎన్నో రోడ్లు రక్తసిక్తమయ్యాయి. రైడర్లు మరియు వాహనదారులు సరైన భద్రత పాటించకపోవడం ఒక కారణమైతే, ఊహించని భారతీయ రోడ్లు మరో కారణమవుతున్నాయి.

భద్రతను నిర్లక్ష్యం చేయడంతో అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ రైడర్‌ను కోల్పోయాం. కాబట్టి పరిమిత వేగంతో, అన్ని రకాల సేఫ్టీని మరియు రోడ్డు రూల్స్ పాటించి సురక్షితంగా రైడ్ చేయండి.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Ducati Crash On Republic Day Ride Kills Rider And A Buffalo
Story first published: Monday, January 29, 2018, 16:06 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark