హీరో డెస్టినీ 125 స్కూటర్ బ్రోచర్ లీక్

హీరో మోటోకార్ప్ తమ డ్యూయెట్ 125 స్కూటర్‌ను హీరో డెస్టినీ 125గా పేరు మార్చి సరికొత్త హంగులతో రీలాంచ్ చేయడానికి సిద్దమైనట్లు ఇది వరకే ఓ కథనాన్ని ప్రచురించాము. హీరో డెస్టినీ 125 స్కూటర్ విడుదల నేపథ్యంలో

By Anil Kumar

హీరో మోటోకార్ప్ తమ డ్యూయెట్ 125 స్కూటర్‌ను హీరో డెస్టినీ 125గా పేరు మార్చి సరికొత్త హంగులతో రీలాంచ్ చేయడానికి సిద్దమైనట్లు ఇది వరకే ఓ కథనాన్ని ప్రచురించాము. హీరో డెస్టినీ 125 స్కూటర్ విడుదల నేపథ్యంలో ఈ స్కూటర్‌కు సంభందించిన బ్రోచర్ లీక్ అయ్యింది.

హీరో డెస్టినీ 125 స్కూటర్ గురించి బ్రోచర్‌లో ఏయే అంశాలను జోడించిందో తెలుసుకుందాం రండి...

హీరో డెస్టినీ 125 స్కూటర్ బ్రోచర్ లీక్

ప్రతి రెండేళ్లకొకసారి జరిగే ఆటో ఎక్స్‌పో వాహన ప్రదర్శన వేడుకల్లో హీరో మోటోకార్ప్ డ్యూయట్ 125 స్కూటర్‌ను పోలి ఉండే హీరో డెస్టినీ 125 స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఇందులో నూతన ఫ్రంట్ ఏప్రాన్, క్రోమ్ సొబగులు, ఎగ్జాస్ట్ మఫ్లర్ మరియు రీడిజైన్ చేయబడిన గ్రాబ్ రెయిల్ వంటి ఎన్నో ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

హీరో డెస్టినీ 125 స్కూటర్ బ్రోచర్ లీక్

సరికొత్త హీరో డెస్టినీ 125 స్కూటర్‌లో సాంకేతికంగా 124.6సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు, సీవీటీ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఆటోమేటిక్ స్కూటర్‌ 8.7బిహెచ్‌పి పవర్ మరియు 10.2ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హీరో డెస్టినీ 125 స్కూటర్ బ్రోచర్ లీక్

హీరో డెస్టినీ 125 స్కూటర్‌లో వస్తోన్న అత్యంత కీలకమైన ఫీచర్ ఐ3ఎస్ టెక్నాలజీ. ఇంజన్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీతో వస్తున్న మొట్టమొదటి స్కూటర్ కూడా ఇదే. హీరో ఇప్పటికీ వరకు ఈ టెక్నాలజీ కేవలం కమ్యూటర్ మోటార్ సైకిళ్లలో మాత్రమే అందించింది.

హీరో డెస్టినీ 125 స్కూటర్ బ్రోచర్ లీక్

హీరో డెస్టినీ 125 నాలుగు విభిన్న రంగుల్లో లభ్యం కానుంది. అవి, నోబెల్ రెడ్, చెస్ట్‌నట్ బ్రాంజ్, ఫ్యాంథర్ బ్లాక్ మరియు పర్ల్ సిల్వర్ వైట్. సస్పెన్షన్ పరంగా ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్ కలదు.

హీరో డెస్టినీ 125 స్కూటర్ బ్రోచర్ లీక్

పటిష్టమైన రైడింగ్ కోసం ట్యూబ్ లెస్ టైర్లను అందించింది. డెస్టినీ 125 స్కూటర్‌లో ఇరువైపులా డ్రమ్ బ్రేకులు ఉన్నాయి. అయితే, డిస్క్ బ్రేక్‌ను కనీసం ఆప్షనల్ ఫీచర్‌గా కూడా అందివ్వలేదు. కానీ ఇందులో కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ వచ్చింది. హీరో మోటోకార్ప్ తమ డెస్టినీ 125 మరియు మాయెస్ట్రో 125 స్కూటర్లతో దేశీయంగా ప్రీమియం 125సీసీ సెగ్మెంట్లో తన స్థానాన్ని పధిలం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది.

హీరో డెస్టినీ 125 స్కూటర్ బ్రోచర్ లీక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హీరో మోటోకార్ప్ తమ సరికొత్త డెస్టినీ 125 స్కూటర్ ఈ ఏడాది పండుగ సీజన్‌లోపు మార్కెట్లోకి విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. డిజైన్ మరియు ఫీచర్ల పరంగా చూస్తే, హోండా గ్రాజియా, సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్, టీవీఎస్ ఎన్‌టార్క్ 125 మరియు అప్రిలియా ఎస్ఆర్125 వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వడం ఖాయమనిపిస్తోంది.

Source: Rushlane

Most Read Articles

English summary
Read In Telugu: Hero Destini 125 Brochure Leaked Ahead Of Launch — Gets i3S Technology
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X