2018 ఆటో ఎక్స్‌పోలో విడుదలవుతున్న హీరో బైకులు

Written By:
Recommended Video - Watch Now!
Minor Motorcycle Rider Caught For Not Having A License - The Climax Of The Video Will Surprise You - DriveSpark

ప్రపంచ అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ 2018 ఫిబ్రవరిలో జరగనున్న భారతదేశపు అతి పెద్ద వాహన ప్రదర్శన ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదికగా పలు కొత్త మోడళ్లను ఆవిష్కరించడానికి సిద్దమైంది.

ఆటో ఎక్స్‌పోలో హీరో టూ వీలర్లు

దేశీయ మార్కెట్ కోసం కొత్త స్కూటర్లు మరియు బైకులతో పాటు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొన్ని కాన్సెప్ట్ మోడళ్లను ఆవిష్కరించడానికి హీరో మోటోకార్ప్ ఏర్పాట్లు చేసుకుంటోంది.

ఆటో ఎక్స్‌పోలో హీరో టూ వీలర్లు

2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో హీరో మోటోకార్ప్ నుండి వస్తున్న అతి ముఖ్యమైన మోడల్ ఎక్స్‌పల్స్ అడ్వెంచర్ మోటార్ సైకిల్. 2017లో ఇటలీలో జరిగిన ఐక్మా మోటార్ సైకిల్ షోలో తొలిసారిగా ఎక్స్‌పల్స్ అడ్వెంచర్ బైకును పరిచయం చేసింది.

ఆటో ఎక్స్‌పోలో హీరో టూ వీలర్లు

మార్కెట్లోని కమ్యూటర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో తిరుగులేని విజయాన్ని అందుకున్న హీరో మోటోకార్ప్ స్కూటర్ల విపణిలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుని అత్యుత్తమ మార్కెట్ వాటాను సొంతం చేసుకునేందుకు 125సీసీ స్కూటర్‌ను ప్రవేశపెట్టనుంది.

ఆటో ఎక్స్‌పోలో హీరో టూ వీలర్లు

అడ్వెంచర్ మోటార్ సైకిల్ మరియు 125సీసీ స్కూటర్‌తో పాటు ఇప్పటి వరకు పర్ఫామెన్స్ మోటార్ సైకిళ్ల సెగ్మెంట్లో రాణించలేకపోతున్న హీరో 200సీసీ ఇంజన్‌తో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ బైకును ఆటో ఎక్స్‌పో 2018 ద్వారా కస్టమర్లకు పరిచయం చేయనుంది.

ఆటో ఎక్స్‌పోలో హీరో టూ వీలర్లు

హీరో ఎక్స్‌పల్స్

హీరో మోటోకార్ప్ గత ఏడాది జరిగిన 2017 ఐక్మా మోటార్ సైకిల్ షోలో కాన్సెప్ట్ రూపంలో ఆవిష్కరించింది. పూర్తి స్థాయి అడ్వెంచర్ బైక్ చూడటానికి హీరో గతంలో అందుబాటులో ఉంచిన ఇంపల్స్ బైక్ తరహాలో ఉంటుంది. అయితే, దీనిని కంప్లీట్‌గా కొత్త డిజైన్‌లో రూపొందించడం జరిగింది.

ఆటో ఎక్స్‌పోలో హీరో టూ వీలర్లు

హీరో ఎక్స్‌పల్స్ బైకులో ఆఫ్ రోడింగ్‌కు ఎక్కువగా ఉపయోగపడే టైర్లు, పెయింట్ స్కీమ్ మరియు అధిక ఎత్తులో ఉంది. పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, మంచులో వెలిగే ఫాగ్ ల్యాంప్, వెనుక వైపున మోనోషాక్ సస్పెన్షన్ వంటివి ఉన్నాయి. అయితే, ఇంజన్ పరంగా ఎక్స్‌ట్రీమ్ 200ఎస్‌లో అందివ్వనున్న అదే ఇంజన్ ఇందులో వస్తోంది.

Trending On DriveSpark Telugu:

125సీసీ ఇంజన్ సెగ్మెంట్లో బెస్ట్ మైలేజ్‌‌నిచ్చే బైకులు

అరెనా షోరూముల్లో కొత్త తరం స్విఫ్ట్

అత్యధిక మైలేజ్ ఇవ్వగల పది భారతదేశపు ఎస్‌యూవీలు

ఆటో ఎక్స్‌పోలో హీరో టూ వీలర్లు

హీరో 125సీసీ స్కూటర్

ఆటో ఎక్స్‌పో 2018 వేదికగా సరికొత్త 125సీసీ స్కూటర్‌ను ఆవిష్కరిస్తోంది. గత కొన్ని సంవత్సరాల నుండి స్కూటర్ల మార్కెట్ నుండి పరిశీలిస్తే 125సీసీ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో స్కూటర్ల విభాగంలో ఆశించిన మార్కెట్ వాటా సాధించలేకపోతున్న హీరో ఇప్పుడు ఏకంగా 125సీసీ స్కూటర్‌తో సరాసరిగా బరిలోకి దిగుతోంది.

ఆటో ఎక్స్‌పోలో హీరో టూ వీలర్లు

ఈ ఏడాదిలోనే పూర్తి స్థాయిలో మార్కెట్లోకి విడుదల కానున్న స్కూటర్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. అయితే, 2014లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన డేర్ కాన్సెప్ట్ స్కూటర్ ఆధారంగా డెవలప్ చేస్తున్నట్లు తెలిసింది. మోడ్రన్ డిజైన్ మరియు ఎన్నో ప్రీమియమ్ ఫీచర్లతో వస్తున్న డేర్ స్కూటర్ ప్రస్తుతం ఉన్న ఇతర 125సీసీ స్కూటర్లకు గట్టి పోటీనివ్వనుంది.

ఆటో ఎక్స్‌పోలో హీరో టూ వీలర్లు

హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఎస్

ఎక్స్‌ట్రీ200ఎస్ బైకు హీరో మోటోకార్ప్‌కు అతి ముఖ్యమైన మోడల్ కానుంది. పర్ఫామెన్స్ మోటార్ సైకిళ్ల సెగ్మెంట్లోకి ప్రవేశించడానికి ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్న హీరో కల ఎక్స్‌ట్రీమ్200 ఎస్ బైకుతో తీరనుంది. దీనిని తొలిసారిగా 2016 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది.

ఆటో ఎక్స్‌పోలో హీరో టూ వీలర్లు

పోటీగా ఉన్న 200సీసీ బైకులను ఎదుర్కొనేందుకు, డిజిటల్ అనలాగ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, వెనుక వైపు మోనోషాక్ అబ్జార్వర్, స్పోర్టివ్ బాడీ డీకాల్స్ వంటి ప్రీమియమ్ ఫీచర్లతో పాటు అత్యుత్తమ పవర్ మరియు టార్క్ ప్రొడ్యూస్ చేసే 200సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ వస్తోంది.

ఆటో ఎక్స్‌పోలో హీరో టూ వీలర్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

2018 ఆటో ఎక్స్‌పోలో హీరో ప్రవేశపెట్టనున్న ఉత్పత్తులు దేశీయ ద్విచక్ర వాహన పరిశ్రమలో ఉత్సాహాన్ని మరింత పెంచుతోంది. ఎక్స్‌పల్స్ అడ్వెంచర్ మోటార్ సైకిల్, 125సీసీ స్కూటర్ మరియు తీవ్ర పోటీని కలిగి ఉన్న 200సీసీ సెగ్మెంట్లోకి ప్రవేశించడం వెనుక హీరో మోటోకార్ప్ టూ వీలర్ల పరిశ్రమలో దీర్ఘకాళిక ప్రణాళికలు బయటపడుతున్నాయి. దేశీయ దిగ్గజం హీరో అన్ని సెగ్మెంట్లో రాణించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Auto Expo 2018: Upcoming Hero Bikes In India - Lineup Revealed. Read In Telugu

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark