యాక్టివా 5G స్కూటర్ ఆవిష్కరించిన హోండా

Written By:
Recommended Video - Watch Now!
Aprilia Storm Unveiled At Auto Expo 2018; Walkaround, Specs, Features - DriveSpark

ఆటో ఎక్స్‌పో 2018: మనందరికీ యాక్టివా 3G తెలుసు.. యాక్టివా 4G తెలుసు... అయితే, ఢిల్లీలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో 2018లో సరికొత్త యాక్టివా 5G స్కూటర్‌ను ఆవిష్కరించింది.

3G, 4G, తరహాలో వచ్చిన యాక్టివా 5G స్కూటర్‌లో ఉన్న ప్రత్యేకతలు మరియు ఎప్పుడు విడుదల చేస్తారో వంటి పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో తెలుసుకుందాం రండి...

ఆటో ఎక్స్‌పో 2018: హోండా యాక్టివా 5G

హోండా టూ వీలర్స్ అదే 109.19సీసీ కెపాసిటి గల ఆక్టివా 4G ఇంజన్‌ను ఇందులో అందించింది. ఇది, 7,500ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 8బిహెచ్‌పి పవర్ మరియు 5,500ఆర్‌పిఎమ్ వద్ద 9ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఆటో ఎక్స్‌పో 2018: హోండా యాక్టివా 5G

సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ గల యాక్టివా 5G ఆటోమేటిక్ స్కూటర్‌లో 5.3-లీటర్ కెపాసిటి గల ఫ్యూయల్ ట్యాంక్ మరియు స్కూటర్ మొత్తం బరువు 108కిలోలుగా ఉంది.

ఆటో ఎక్స్‌పో 2018: హోండా యాక్టివా 5G

కొలతల పరంగా యాక్టివా 5Gలో ఎలాంటి మార్పులు జరగలేదు. అదే 1,761ఎమ్ఎమ్ పొడవు, 710ఎమ్ఎమ్ వెడల్పు, 1,149ఎమ్ఎమ్ ఎత్తులో ఉంది. 153ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్ మరియు సీటు ఎత్తు 765ఎమ్ఎమ్‌‌గా ఉంది.

ఆటో ఎక్స్‌పో 2018: హోండా యాక్టివా 5G

హోండా యాక్టివా 5G స్కూటర్‌లో ముందు మరియు వెనుక వైపున 10-అంగుళాల పరిమాణంలో ఉన్న అల్లాయ్ వీల్స్, రెండు చక్రాలకు 90/100 కొలతల్లో ఉన్న టైర్లు ఉన్నాయి. అంతే కాకుండా హోండా కాంబి బ్రేక్ సిస్టమ్ గల 130ఎమ్ఎమ్ రెండు డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

ఆటో ఎక్స్‌పో 2018: హోండా యాక్టివా 5G

హోండా యాక్టివా 5G డిజైన్

యాక్టివా సిరీస్ మోడళ్లతో పోల్చుకుంటే యాక్టివా 5 స్కూటర్‌లో పెద్ద మార్పులేమీ జరగలేదు. చెప్పుకోదగిన మార్పుల్లో సరికొత్త పూర్తి స్థాయి ఎల్ఇడి హెడ్ ల్యాంప్, హెడ్ ల్యాంప్‌లో కలిసిపోయినట్లుగా కనిపించే ఇండికేటర్ పొజిషన్ లైట్లు ఉన్నాయి. హెడ్ ల్యాంప్ మరియు పొజిషన్ రెండూ ఎల్ఇడి లైట్లతో వచ్చిన భారతదేశపు మొదటి 110సీసీ స్కూటర్ ఇదే. ఇకపోతే ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్ ఆన్ ఫీచర్ సాధారణంగానే వచ్చింది.

ఆటో ఎక్స్‌పో 2018: హోండా యాక్టివా 5G

ఇతర మార్పుల్లో ప్రధానంగా చూసుకుంటే. స్కూటర్ ఎక్ట్సీరియర్‌లో అక్కడక్కడ క్రోమ్ సొబగులు, మెటల్ మఫ్లర్ ప్రొటెక్టర్ మరియు రెండు కొత్త రంగుల్లో వచ్చింది.అవి, డాజిల్ యెల్లో మెటాలిక్ మరియు పర్ల్ స్పార్టన్ రెడ్.

ఆటో ఎక్స్‌పో 2018: హోండా యాక్టివా 5G

హోండా యాక్టివా 5G స్కూటర్‌లో కొత్తగా పరిచయమైన ఫీచర్లు, ఇందులోని సరికొత్త డీలక్స్ వేరియంట్ సరికొత్త ఎల్ఇడి హెడ్ ల్యాంప్, డిజిటల్-అనలాగ్ ఇస్ట్రుమెంట్ క్లస్టర్, ఇకో స్పీడ్ మరియు సర్వీస్ డ్యూ డేట్ ఇండికేటర్లు ఉన్నాయి.

ఆటో ఎక్స్‌పో 2018: హోండా యాక్టివా 5G

ఇందులో సరికొత్త 4-ఇన్-వన్ కీ కలదు. స్కూటర్ హ్యాండిల్ సైడ్ లాక్, ఇంజన్ ఆఫ్, ఆన్ మరియు సీట్ ఓపెన్‌తో సహా నాలుగింటింకి ఒకే కీ సిస్టమ్ అందించారు. ఫ్రంట్ హుక్ మరియు రిట్రాక్టబుల్ రియర్ హుక్ కలదు.

ఆటో ఎక్స్‌పో 2018: హోండా యాక్టివా 5G

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హోండా టూ వీలర్స్ తమ యాక్టివా సిరీస్‌ స్కూటర్లను యాక్టివా 5G మోడల్‌తో భర్తీ చేయాలని భావిస్తోంది. ఎల్ఇడి హెడ్ ల్యాంప్ మరియు 4-ఇన్-వన్ లాకింగ్ సిస్టమ్ వంటి కీలకమైన ఫీచర్లను గ్రాజియా నుండి సేకరించి ఇందులో అందించింది. ధరలో ఎలాంటి మార్పులు చేయకుండా పాత ధరలకే సరికొత్త యాక్టివా 5G స్కూటర్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ప్రారంభం నాటికి మార్కెట్లోకి రానుంది.

English summary
Read In Telugu: Auto Expo 2018: Honda Activa 5G Unveiled - Key Specs, Colours, Features & Images

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark