ఆటో ఎక్స్‌పో 2018: హోండా పిసిఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణ

Written By:
Recommended Video - Watch Now!
New Honda Activa 5G Walkaround, Details, Specifications, First Look

ఆటో ఎక్స్‌పో 2018: హోండా టూ వీలర్స్ ఆటో ఎక్స్‌లో సరికొత్త పిసిఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. జపాన్ టూ వీలర్ల తయారీ దిగ్గజం హోండా టూ వీలర్స్ 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో ద్వారా సరికొత్త పిసిఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కాన్సెప్ట్ వెర్షన్‌లో ప్రవేశపెట్టింది.

హోండా పిసిఎక్స్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ గురించి మరిన్ని వివరాలు మరియు ఫోటోల కోసం...

హోండా పిసిఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్

పలు అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయాల్లో ఉన్న పిసిఎక్స్ 150 స్కూటర్ ఆధారంగా పిసిఎక్స్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ వెర్షన్‌ను రూపొందించింది. 2016లో జరిగిన ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో కూడా హోండా ఈ పిసిఎక్స్ స్కూటర్‌ను ప్రదర్శించింది.

హోండా పిసిఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్

స్పోర్టివ్ మరియు ఫ్యూచరిస్టిక్ డిజైన్ శైలిలో ఉన్న పిసిఎక్స్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ స్కూటర్‌ను గత ఏడాది టోక్యోలో జరిగిన టోక్యో ఇంటర్నేషనల్ మోటార్ షోలో కూడా ఆవిష్కరించింది.

హోండా పిసిఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్

హోండా ఇంజనీరింగ్ బృందం సరికొత్త పిసిఎక్స్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ స్కూటర్‌లో 0.98కిలోవాట్ సామర్థ్యం ఉన్న ఎలక్ట్రిక్ మోటార్‌ను అందిచారు. దీనికి రిమూవబుల్ లిథియమ్-అయాన్ బ్యాటరీ నుండి పవర్ అందుతుంది.

హోండా పిసిఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్

హోండా పిసిఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని బ్యాటరీని స్కూటర్‌ నుండి తొలగించి వేరుగా ఛార్జ్ చేయవచ్చు. లేదంటే స్కూటర్‌లోనే ఉంచి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు.

హోండా పిసిఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్

రిమూవబుల్ బ్యాటరీ తక్కువ సమయంలో ఛార్జ్ అవుతుంది మరియు ఎక్కువ దూరం ప్రయాణించడానికి సహకరిస్తుంది. ఇవి తప్పితే, స్కూటర్ గురించి ఎలాంటి సాంకేతిక వివరాలను హోండా ప్రతినిధులు వెల్లడించలేదు.

హోండా పిసిఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్

హోండా పిసిఎక్స్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ స్కూటర్‌లో ఇరువైపులా అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ వీల్‌కు డిస్క్ బ్రేక్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద పరిమాణంలో ఉన్న విండ్‌స్క్రీన్ ఉన్నాయి. సస్పెన్షన్ కోసం ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున డ్యూయల్ షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి.

హోండా పిసిఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్

ఇతర ముఖ్యమైన ఫీచర్లలో ఫ్రంట్ యాప్రాన్ మీద ఉన్న డ్యూయల్ హెడ్‌ల్యాంప్, ఎల్ఇడి టెయిల్ ల్యాంప్ మరియు స్పోర్టివ్ ఫీల్ సెటప్ సీట్ ఉన్నాయి. 2018లోపే పలు ఆసియన్ మార్కెట్లలో పిసిఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేయాడనికి హోండా సన్నాహాలు ప్రారంభించింది.

హోండా పిసిఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హోండా టూ వీలర్స్ పిసిఎక్స్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ స్కూటర్‍‌ను అంతర్జాతీయ విపణిలో ఉన్న పిసిఎక్స్ 150 పెట్రోల్ స్కూటర్ ఆధారంతో అభివృద్ది చేసింది. డిజైన్ పరంగా రెండు స్కూటర్లు ఒకే పోలికలో ఉంటాయి. మరిన్ని ఆటో ఎక్స్‌పో 2018 అప్‌డేట్స్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి.

English summary
Read In Telugu: Auto Expo 2018: Honda PCX Electric Concept Showcased - Specifications, Features & Images
Story first published: Monday, February 12, 2018, 15:22 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark