ఇండియన్ మోటార్ సైకిళ్ల మీద భారీగా తగ్గిన ధరలు

Written By:

అమెరికన్ మోటార్ సైకిళ్ల తయారీ కంపెనీ, ఇండియన్ మోటార్ సైకిల్స్ ఇండియా లైనప్‌లో తమ ఉత్పత్తుల మీద ధరలు తగ్గించినట్లు ప్రకటించింది. ఇండియన్ మోటార్స్ సైకిల్స్ క్రూయిజర్ సెగ్మెంట్లో ఉన్న అన్ని బైకులను అమెరికా నుండి దిగుమతి చేసుకుని విక్రయిస్తోంది. దిగుమతి చేసుకుంటున్న బైకుల మీద గరిష్టంగా రూ. 3 లక్షల వరకు తగ్గించింది.

Recommended Video - Watch Now!
UM Renegade Thor Electric Cruiser Bike India Launch Details, Price, Specifications - DriveSpark
ఇండియన్ మోటార్ సైకిళ్ల మీద తగ్గిన ధరలు

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు, దిగుమతి చేసుకునే బైకుల మీద ఇపోర్ట్ మరియు కస్టమ్స్ ట్యాక్స్ గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో విదేశీ మార్కెట్ల నుండి దిగుమతి చేసుకుని విక్రయించే అన్ని బైకుల ధరలు విపరీతంగా తగ్గుముఖం పట్టాయి.

ఇండియన్ మోటార్ సైకిళ్ల మీద తగ్గిన ధరలు

ఇండియన్ మోటార్ సైకిల్స్ ప్రస్తుతం, విసృత శ్రేణి క్రూయిజ్ మోటార్ సైకిళ్లను విక్రయిస్తోంది. ఎంట్రీ లెవల్ మోడల్ స్కౌట్ సిక్ట్సి నుండి టాప్ ఎండ్ మోడల్ ఇండియన్ రోడ్‌మాస్టర్ బైకులు విపణిలో ఉన్నాయి.

ఇండియన్ మోటార్ సైకిళ్ల మీద తగ్గిన ధరలు

పూర్తి స్థాయిలో నిర్మించి దిగుమతి చేసుకునే మోటార్ సైకిళ్ల మీద మునుపు ఉన్న 75 శాతం ట్యాక్స్‌ను 50 శాతానికి తగ్గించింది. 25 శాతం ట్యాక్స్ తగ్గడంతో, ఇందుకు అనుగుణంగా తమ అన్ని బైకుల మీద ఇండియన్ మోటార్ సైకిల్స్ ధరలు తగ్గించింది.

ఇండియన్ మోటార్ సైకిళ్ల మీద తగ్గిన ధరలు

దిగుమతి చేసుకునే బైకుల ధరల తగ్గుతుండటంగా, విడి భాగాలను దిగుమతి చేసుకుని దేశీయంగా అసెంబుల్ చేసి విక్రయించే మోటార్ సైకిళ్ల మీద ట్యాక్స్ పెరగడంతో ఈ బైకుల ధరలు పెరగనున్నాయి.

ఇండియన్ మోటార్ సైకిళ్ల మీద తగ్గిన ధరలు

భారత్ థాయిలాండ్‌తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంది. కాబట్టి, థాయిలాండ్ నుండి దిగుమతి చేసుకునే బైకుల మీద పొందే ప్రయోజనాల్లో ఎలాంటి మార్పులు జరగడం లేదు.

ఇండియన్ మోటార్ సైకిళ్ల మీద తగ్గిన ధరలు

ధరల సవరణం అనంతరం ఇండియన్ మోటార్ సైకిల్స్ కొత్త ధరలు

Models Ex-Showroom Price
Indian Scout Sixty Rs 10.99 Lakh
Indian Scout Rs 12.69 Lakh
Indian Scout Bobber Rs 11.99 Lakh
Indian Chief Dark Horse Rs 18.81 Lakh
Indian Chief Classic Rs 21.29 Lakh
Indian Chief Vintage Rs 25.32 Lakh
Indian Chief Springfield Rs 33.50 Lakh
Indian Chieftain Rs 32.01 Lakh
Indian Roadmaster Rs 39 Lakh
ఇండియన్ మోటార్ సైకిళ్ల మీద తగ్గిన ధరలు

ఇంపోర్ట్ చేసుకునే బైకుల మీద ఉన్న కస్టమ్ డ్యూటీని 75 నుండి 50 శాతానికి తగ్గించడం పట్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగిస్తూ, ఇండియన్ మోటార్ సైకిల్స్ ఇండియా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ణయంతో ఇకానిక్ బైకులను ఎంచుకోవాలనుకునే కస్టమర్ల కలం నిజం కానుందని పొలారిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్ మరియు కంట్రీ హెడ్ పంకజ్ దుబే పేర్కొన్నాడు.

ఇండియన్ మోటార్ సైకిళ్ల మీద తగ్గిన ధరలు

భారత ప్రభుత్వం బైకుల మీద ఇపోర్ట్ ట్యాక్స్ తగ్గించడంతో ఇండియన్ మోటార్ సైకిల్స్‌తో పాటు, హ్యార్లీ-డేవిడ్సన్ మరియు డుకాటి సంస్థలు ఇప్పటికే తాము దిగుమతి చేసుకునే బైకుల మీద ధరలు తగ్గించాయి.

ఇండియన్ మోటార్ సైకిళ్ల మీద తగ్గిన ధరలు

డుకాటి చాలా వరకు బైకులను థాయిలాండ్ నుండి దిగుమతి చేసుకుంటోంది. కాబట్టి, వాటి ధరలలో ఎలాంటి మార్పులు ఉండవు. బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ జర్మనీ నుండి దిగుమతి చేసుకునే బైకుల ధరలను ఇప్పటికే తగ్గించింది. ట్రైయంప్ కంపెనీ దిగుమతి చేసుకున్న విడి భాగాలతో బైకులను అసెంబుల్ చేసి, విక్రయిస్తోంది. కాబట్టి, వీటి ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.

English summary
Read In Telugu: Indian Motorcycle Prices Slashed By Up To Rs 3 Lakh — Here’s The Revised Price List
Story first published: Friday, March 9, 2018, 19:12 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark