మోడిఫైడ్ సైలెన్సర్లతో పట్టుబడితే ఏకంగా RC రద్దు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు

Written By:

గతంలో బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు పెద్ద పెద్ద శబ్దం చేస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల సైలెన్సర్లను తొలగించి, రోడ్డు రోలరుతో తొక్కించిన సంగతి తెలిసిందే. తాజాగా అందిన రిపోర్ట్స్ ప్రకారం, భారీ శబ్దాన్నిచ్చే మరియు బిగ్గరగా అరిచే మోటార్ సైకిళ్ల మోడిఫైడ్ సైలెన్సర్ల భరతం పట్టేందుకు కేరళ వెహికల్ డిపార్ట్‌మెంట్ సరికొత్త పద్దతికి శ్రీకారం చుట్టింది.

మోడిఫైడ్ సైలెన్సర్లతో పట్టుబడితే ఏకంగా RC రద్దు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు

ఈ నూతన విధానం జూన్ 1, 2018 నుండి కేరళ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఇంతకీ, ఈ విధానం ఏమిటి...? మోడిఫైడ్ సైలెన్సర్లకు శాశ్వతంగా ఎలా అడ్డుకట్ట వేయబోతున్నారో ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి...

మోడిఫైడ్ సైలెన్సర్లతో పట్టుబడితే ఏకంగా RC రద్దు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు

ఈ నూతన విధానంలో భాగంగా, కేరళ ఆర్టీఓ అధికారులు మోడిఫైడ్ సైలెన్సర్లు ఉన్న బైకులు మరియు స్కూటర్ల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను(RC) శాశ్వతంగా రద్దు చేయనున్నారు. ఒక్కసారి ఆర్‍‌‌సి రద్దయితే, ఆ వాహనాలు మళ్లీ రోడ్డెక్కే అవకాశమే లేదు. ఆర్‌సి రద్దయితే, వాటి ఇన్సూరెన్స్ కూడా రద్దవుతుంది.

మోడిఫైడ్ సైలెన్సర్లతో పట్టుబడితే ఏకంగా RC రద్దు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు

అయితే, ఆర్‌సి రద్దు కేవలం మూడు నెలల వరకు మాత్రమే ఉంటుంది. అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న మోడిఫైడ్ సైలెన్సర్ తొలగించి, సాధారణ సైలెన్సర్ అమర్చుకుంటే, ఆ వాహనం యొక్క ఆర్‌సి మళ్లీ పునరుద్దరించబడుతుంది.

మోడిఫైడ్ సైలెన్సర్లతో పట్టుబడితే ఏకంగా RC రద్దు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు

యువకులు మరియు రైడింగ్ ఔత్సాహికులు బిగ్గరగా అరిచే మోడిఫైడ్ సైలెన్సర్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా, వాటి నుండి వచ్చే శబ్దం నుండి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీని కారణంగా ఎన్నో ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎదురవుతాయి. వీటిని అరికట్టేందుకు కేరళ రవాణా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.చ

మోడిఫైడ్ సైలెన్సర్లతో పట్టుబడితే ఏకంగా RC రద్దు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు

డిప్యూటి ట్రాన్స్‌పోర్ట్ కమీషనర్, ఎమ్‌పి అజిత్ కుమార్ మాట్లాడుతూ, "కేవలం ఒక్క ఎర్నాకులంలోనే వెయ్యికి పైగా బైకులు మోడిఫైడ్ సైలెన్సర్లతో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే పలు క్యాంపెయిన్ల ద్వారా వీరందరి ఆటకట్టించాము. అయితే, మోటార్ వెహికల్ డిపార్ట్ ఆదేశాలకు అనుగుణంగా, ఈ ఏడాది శబ్ద కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 53 ప్రకారం మోడిఫైడ్ సైలెన్సర్లు ఉన్న బైకుల ఆర్‌సీలను రద్దు చేస్తున్నట్లు వివరించాడు."

మోడిఫైడ్ సైలెన్సర్లతో పట్టుబడితే ఏకంగా RC రద్దు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు

మోడిఫైడ్ సైలెన్సర్లు 95 డెసిబల్స్ నుండి 100డెసిబల్స్ వరకు శబ్ద కాలుష్యం చేస్తున్నాయి, అంటే లారీలు మరియు బస్సుల హారన్ కంటే వీటి శబ్ద తీవ్రత అధికం. కాబట్టి, శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు విపరీతమైన శబ్దాన్నిస్తున్న మోడిఫైడ్ సైలెన్సర్ మఫ్లర్లను బైకుల నుండి తొలగించకపోతే వాటి ఆర్సీ రద్దు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు.

మోడిఫైడ్ సైలెన్సర్లతో పట్టుబడితే ఏకంగా RC రద్దు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు

మోడిఫైడ్ సైలెన్సర్లు కేరళతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొంత మంది డీలర్ల వద్ద లభ్యమవుతున్నాయి. కానీ, ఇలాంటి మోడిఫైడ్ మఫ్లర్లు రోడ్డు మీద జనవాసాల మధ్య తిరిగే వాహనాలకు ఉపయోగించకూడదని మోటార్ వాహనాల చట్టం స్పష్టంగా పేర్కొంది. కాబట్టి, మోడిఫైడ్ సైలెన్సర్లు ఉన్న బైకులు పబ్లిక్ రోడ్లు ఎక్కకుండా చూసుకోవాల్సిన భాద్యత ఆ బైకుల యజమానులదే.

మోడిఫైడ్ సైలెన్సర్లతో పట్టుబడితే ఏకంగా RC రద్దు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న మోడిఫైడ్ సైలెన్సర్లు ఉన్న బైకుల ఆటకట్టించేందుకు కేరళ రాష్ట్ర రవాణా శాఖ మంచి నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ రోడ్ల మీద మోడిఫైడ్ సైలెన్సర్లతో చక్కర్లు కొట్టే రైడర్లకు కేరళ ఆర్‌టిఓలు గట్టి సమధానం ఇవ్వనున్నాయి.

*Note: Images for representation purpose only.

Source: ETAuto

English summary
Read In Telugu: RTO To Suspend Registration Certificate Of Bikes Fitted With Modified Silencers

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark