కెటిఎమ్ డ్యూక్200 మోడిఫైడ్ స్క్రాంబ్లర్: కేటీఎమ్‌ మతి పోగొట్టిన కట్రోస్ గ్యారేజీ

By Anil Kumar

ఇటీవల కాలంలో బైక్ మోడిఫికేషన్స్ చాలా ఎక్కువ అయ్యాయి. వివిధ టూ వీలర్ల కంపెనీల నుండి సేకరించిన విడి భాగాలతో మార్కెట్లో ఇప్పటి వరకూ పరిచయం కానటువంటి ఒక కొత్త రూపంలోకి మార్చేస్తున్నారు.

కెటిఎమ్ డ్యూక్200 మోడిఫైడ్ స్క్రాంబ్లర్

ఇంజన్, ఛాసిస్ ఒక బైకు నుండి సేకరిస్తే, ఫ్యూయల్ ట్యాంక్, హెడ్ ల్యాంప్ మరియు టైర్లు ఇంకా ఎన్నో విడి పరికరాలను ఇతర మోటార్ సైకిళ్లను సేకరించి ఎంతో చక్కగా మోడిఫై చేస్తున్నారు. ఎంతలా అంటే, ఆ మోటార్ సైకిళ్లను మార్కెట్లోకి విడుదల చేసిన కంపెనీలే అసూయపడే విధంగా... అందుకు చక్కటి ఉదాహరణ స్క్రాంబ్లర్ స్టైల్లోకి మారిపోయిన కెటిఎమ్ 200 డ్యూక్.

కెటిఎమ్ డ్యూక్200 మోడిఫైడ్ స్క్రాంబ్లర్

నేక్డ్ స్ట్రీట్ ఫైబర్ బైకును ఇలా స్క్రాంబ్లర్ స్టైల్లోకి మార్చేశారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ.... ఎంతో మంది మోటార్ సైకిల్ ప్రియుల మతి పోగొడుతున్న కెటిఎమ్ 200 డ్యూక్ స్కాంబ్లర్ బైకును ఇండోనేషియాకు చెందిన "కట్రోస్ గ్యారేజీ" మోడిఫై చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇవాళ్టి కథనంలో...

కెటిఎమ్ డ్యూక్200 మోడిఫైడ్ స్క్రాంబ్లర్

ముందుగా దీనిని చూడగానే గుర్తొచ్చే బైకు, బెనెల్లీ లియోన్సినో. అయితే, మోడిఫికేషన్స్ పరంగా బాడీ మరియు డిజైన్ పరంగా బెనెల్లీ లియోన్సినో బైకును పోలి ఉన్నప్పటికీ, దీని హృదయం మాత్రం కెటిఎమ్ 200 డ్యూక్ బైకుదే.

కెటిఎమ్ డ్యూక్200 మోడిఫైడ్ స్క్రాంబ్లర్

ఫ్రంట్ డిజైన్‌లో ఆకర్షణీయమైన క్వాడ్-ఎల్ఇడి యూనిట్(టర్న్ సిగ్నల్స్ మరియు హెడ్‌ల్యాంప్) మరియు పలు రకాల డిజైన్ ఎలిమెంట్లతో హెడ్ ల్యాంప్ నుండి ఇన్వర్టెడ్ యుఎస్‌డి ఫ్రంట్ ఫోర్క్స్ వరకు చాలా చక్కగా తీర్చిదిద్దారు.

కెటిఎమ్ డ్యూక్200 మోడిఫైడ్ స్క్రాంబ్లర్

గుండ్రటి ఆకారంలో ఉన్న రియర్ వ్యూవ్ మిర్రర్స్ రెట్రో శైలిని ప్రతిబింబిస్తాయి. అంతే కాకుండా, ముందు వైపున ఇంజన్ వద్ద ఉన్న ఇంజన్ గార్డ్ తొలగించడంతో సీరియస్ ఆఫ్-రోడర్ లుక్ సొంతం చేసుకుంది. వీటికి తోడు విశాలంగా కనబడుతున్న రేడియటర్ దీనిని పెద్ద బైకుగా చూపిస్తోంది.

కెటిఎమ్ డ్యూక్200 మోడిఫైడ్ స్క్రాంబ్లర్

రెగ్యులర్ కెటిఎమ్ డ్యూక్ 200 బైకులో ఉన్న చక్రాలు మరియు బ్రేకులను యథావిధిగా అందించినట్లు ఉన్నారు. అయితే, రెండు టైర్లను కూడా పెద్ద పరిమాణంలో బటన్లు ఉన్న టైర్లను అందించారు.

కెటిఎమ్ డ్యూక్200 మోడిఫైడ్ స్క్రాంబ్లర్

సైడ్ డిజైన్ విషయానికి వస్తే, కెటిఎమ్ తరహాలోనే రెండుగా విడిపోయిన ట్రెల్లిస్ ఫ్రేమ్‌ను కనబడేలా డిజైన్ చేశారు. అయితే, ఈ ఫ్రేములో స్వల్ప మోడిఫికేషన్స్ నిర్వహించారు. రైడర్ సీటు ఎత్తు కొద్దిమేర పెరిగింది. సీటింగ్ కూడా పర్ఫెక్ట్ స్కాంబ్లర్ రైడింగ్ స్టైల్‌ను కలిగి ఉంది.

కెటిఎమ్ డ్యూక్200 మోడిఫైడ్ స్క్రాంబ్లర్

అంతే కాకుండా, ఓవరాల్ బైక్ డిజైన్‌కు సెట్ అయ్యే విధంగా కెటిఎమ్ డ్యూక్ 200లో ఉన్న అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ సిస్టమ్ తొలగించి మార్కెట్లో లభించే పొడవాటి సైలెన్సర్ మరియు రీఇన్ఫోర్స్‌‌డ్ మెటల్ ఇంజన్ కవర్ జోడించారు.

కెటిఎమ్ డ్యూక్200 మోడిఫైడ్ స్క్రాంబ్లర్

సింగల్ పీస్ బ్రౌన్ లెథర్ సీటు చాలా అట్రాక్టివ్ మరియు క్లాసీ లుక్‌లో ఉంది.

కెటిఎమ్ డ్యూక్200 మోడిఫైడ్ స్క్రాంబ్లర్

ఈ కెటిఎమ్ 200 డ్యూక్ మోడిఫైడ్ స్క్రాంబ్లర్ బైకులో ఉన్న మరో హైలెట్ సరికొత్త ఫ్యూయల్ ట్యాంక్. ఆరేంజ్ మరియు బ్లాక్ పెయింట్ స్కీమ్‌లో ఖరీదైన మోటార్ సైకిళ్లలో ఉండే ఫ్యూయల్ ట్యాంకును తలపిస్తోంది. ఫ్యూయల్ ట్యాంక్ మీద "డ్యూక్ 200 కట్రోస్" బ్యాడ్జ్ గల స్పోర్టి ఫ్యూయల్ క్యాప్ ఉంది.

కెటిఎమ్ డ్యూక్200 మోడిఫైడ్ స్క్రాంబ్లర్

రియర్ డిజైన్‌లో ఎలాంటి హంగులు లేకుండా చాలా సింపుల్‌గా ముగించేశారు. ఎత్తైన మడ్ గార్డ్ మరియు సింగల్ రౌండ్ టెయిల్ ల్యాంప్, దీని ఇరువైపులా చిన్న పరిమాణంలో ఉన్న టర్న్ సిగ్నల్స్ ఉన్నాయి.

కెటిఎమ్ డ్యూక్200 మోడిఫైడ్ స్క్రాంబ్లర్

డ్యూక్ డిఎన్‌ఎతో నిర్మించిన స్క్రాంబ్లర్ బైకులో అదే 199.5సీసీ కెపాసిటి గల లిక్విడ్-కూల్డ్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 25బిహెచ్‌పి పవర్ మరియు 19.2ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

కెటిఎమ్ డ్యూక్200 మోడిఫైడ్ స్క్రాంబ్లర్

మోడిఫైడ్ స్క్రాంబ్లర్ బైకు పనితీరు గురించి కట్రోస్ మోడిఫికేషన్స్ బృందం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. మార్కెట్ నుండి కొనగోలు చేసిన సైలెన్సర్ ఇవ్వడంతో పవర్ కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. అయితే, పెద్ద పరిమాణంలో ఉన్న నూతన ఫ్యూయల్ ట్యాంక్ మరియు ఇతర మెటల్ ఎలిమెంట్ల జోడింపుతో బరువు పెరుగుతుంది. కాబట్టి, పవర్‌లో వ్యత్యాసం పెద్ద కనిపించే ఛాన్స్ లేదు.

కెటిఎమ్ డ్యూక్200 మోడిఫైడ్ స్క్రాంబ్లర్

గత కొన్ని సంవత్సరాల నుండి ఇండియాలో కెటిఎమ్ బైకుల ఆధారంగా ఎన్నో బైకులను మోడిఫై చేశారు. అందులో కొన్ని మోడళ్లు బాగున్నాయనే పేరును సొంతం చేసుకుంటాయి. అందులో ఒకటి కట్రోస్ గ్యారేజీ వారి కెటిఎమ్ డ్యూక్ 200 స్క్రాంబ్లర్.

నేక్డ్ స్ట్రీట్ ఫైటర్, ఫెయిరింగ్ స్పోర్ట్ మరియు అడ్వెంచర్ మోటార్ సైకిళ్లను ఉత్పత్తి చేస్తున్న కెటిఎమ్ ఒకవేళ స్క్రాంబ్లర్ బైకులను ఉత్పత్తి చేస్తే సక్సెస్ గ్యారంటీ అనేది మా అభిప్రాయం. మరి మీరేమంటారు...?

Most Read Articles

English summary
Read In Telugu: A KTM Duke 200 Scrambler Modification From Indonesia — Is This The Best KTM 200 Duke Mod Yet?
Story first published: Thursday, May 31, 2018, 17:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X