కెటిఎమ్ నుండి లిమిటెడ్ ఎడిషన్ ఆర్‌సి 390 ఆర్ ఎడిషన్

Written By:
Recommended Video - Watch Now!
హీరో Xtreme 200R ను ఇండియా లో అన్‌వీల్ చేసింది | Hero Xtreme 200R Unveiled - DriveSpark

ఆస్ట్రియన్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ కెటిఎమ్ ఆర్‌సి 200 మరియు ఆర్‌సి 390ఎంట్రీ లెవల్ సూపర్ స్పోర్ట్స్ బైకులను అందుబాటులో ఉంచింది. రెండు మోటార్ సైకిళ్లు ఆయా సెగ్మెంట్లవారీగా పనితీరు మరియు సేల్స్ పరంగా మంచి ఫలితాలనే సాధిస్తున్నాయి.

కెటిఎమ్ ఆర్‌సి 390 ఆర్ ఎడిషన్

మీరు కెటిఎమ్ ఆర్‌సి 390 మోటార్ సైకిల్ ఫ్యాన్ అయితే ఈ స్టోరీ పూర్తిగా చదవాల్సిందే. కెటిఎమ్ తమ ఆర్‌సి 390 ఆర్ ఎడిషన్ బైకును పరిమిత సంఖ్యలో కేవలం 500 యూనిట్ల వరకు మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తోంది.

కెటిఎమ్ ఆర్‌సి 390 ఆర్ ఎడిషన్

ఇండియన్ మార్కెట్ కోసం 500 ఆర్‌సి 390 ఆర్ ఎడిషన్ బైకులు అనుకొని పొరబడేరు. ఎందుకంటే ఈ 500 యూనిట్లను కేవలం భారత్ కోసం మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా వీటిని విక్రయిస్తోంది. కాబట్టి దీనిని దక్కించుకోవాలనుకునే వారి మధ్య పోటీ కూడా అంతే స్థాయిలో ఉంటుంది.

కెటిఎమ్ ఆర్‌సి 390 ఆర్ ఎడిషన్

కెటిఎమ్ ఈ ఆర్‌సి 390 ఆర్ మోటార్ సైకిల్‍ భారీ అప్‌డేట్స్‌కు గురయ్యింది. పూర్తి స్థాయి అడ్జస్టబుల్ డబ్ల్యూ‌పి సస్పెన్షన్, అగ్రెసివ్ రైడింగ్ పొజిషన్ కోసం సరికొత్త హ్యాండిల్ బార్, మడిపేసే అవకాశం ఉన్న క్లచ్ మరియు బైక్ ప్రమాదానికి గురైనపుడు బ్రేక్ పడకుండా లీవర్లను మడిపేసే టెక్నాలజీ కలదు.

కెటిఎమ్ ఆర్‌సి 390 ఆర్ ఎడిషన్

కెటిఎమ్ ఆర్‌సి 390 ఆర్ ఇంజన్‌లో అధునాతన అప్‌గ్రేడెడ్ షార్ట్ ఇంటేక్ ట్రంపెట్ కలదు. రేస్ ట్రాక్ మీద అవసరానికి తగినంత పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.

కెటిఎమ్ ఆర్‌సి 390 ఆర్ ఎడిషన్

ఇంగ్లాండు మార్కెట్లో కెటిఎమ్ ఆర్‌సి 390ఆర్ ధర మన కరెన్సీలో సుమారుగా రూ. 7.65 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఆర్‌సి 390 ఆర్ ఎడిషన్ ద్వారా అత్యుత్తమ రేస్ ట్రాక్ రేసింగ్ అనుభవం పొందేందుకు కెటిఎమ్ ప్రత్యేకమైన రేస్ కిట్ ఈ రేసింగ్ మెషీన్‌లో అందిస్తోంది.

కెటిఎమ్ ఆర్‌సి 390 ఆర్ ఎడిషన్

ఆర్‌సి 390 ఆర్ ఎడిషన్ బైకును స్వతహాగా రేస్ మెషీన్‌లా మార్చుకునేందుకు బైకులో వ్యక్తిగతంగా ఫిట్ చేసుకునే 230కి పైగా విడి భాగాలను రేస్ కిట్‌లో కెటిఎమ్ అందిస్తోంది. ఈ రేస్ కిట్‌లో ఇసియు, టైటానియం అక్రోపోవిక్ ఎగ్జాస్ట్, ఎస్‌టిఎమ్ స్ల్పిప్పర్ క్లచ్, క్విక్ షిఫ్టర్, ఇంజన్ కూలింగ్ పెంచే సిస్టమ్ ఇంకా ఎన్నో ఉన్నాయి.

కెటిఎమ్ ఆర్‌సి 390 ఆర్ ఎడిషన్

ఈ రేస్ కిట్ ద్వారా సాధారణ ఆర్‌సి 390 బైకును కూడా రేసింగ్ మోటార్ సైకిల్‌గా మార్చేసుకోవచ్చు. కానీ, కెటిఎమ్ సంవత్సరానికి కేవలం 50 రేస్ కిట్‌లను మాత్రమే తయారు చేస్తోంది.

కెటిఎమ్ ఆర్‌సి 390 ఆర్ ఎడిషన్

కెటిఎమ్ ఆర్‌సి 390 ఆర్ ఎడిషన్ బైకులను ప్రపంచ వ్యాప్తంగా 500 యూనిట్లను ప్రకటించడంతో, దీనిని ప్రత్యేకంగా ఇండియన్ మార్కెట్లో విడుదల చేయడం లేదు. అయితే, కంపెనీ 2018 ఎడిషన్ ఆర్‌‌సి 390 బైకును డ్యూక్ 390 తరహాలో అప్‌డేట్స్ జరిపి రీలాంచ్ చేసే అవకాశం ఉంది.

కెటిఎమ్ ఆర్‌సి 390 ఆర్ ఎడిషన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కెటిఎమ్ ఆర్‌సి 390 ఎంట్రీ లెవల్ ఫుల్లీ ఫెయిర్ పర్ఫామెన్స్ మోటార్ సైకిల్ రేస్ ట్రాక్ మీద అత్యుత్తమ పవర్ ఇస్తుంది. పలు అప్‌డేట్స్‌తో ఆర్‌సి 390 ఆర్ ఎడిషన్ పర్ఫామెన్స్ మరో లెవల్‌ను చేరింది. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 500 యూనిట్లను మత్రమే ఆర్ ఎడిషన్ ఆర్‌సి 390 స్పోర్ట్స్ బైకులను అందుబాటులో ఉంచడంతో పోటీ కాస్త అధికంగానే ఉంటుంది. కాబట్టి, మీరు కనుక ఈ లిమిటెడ్ ఎడిషన్ రేసింగ్ మోటార్ సైకిల్ ఎంచుకోవాలనుకుంటే వెంటనే కెటిఎమ్ షోరూమ్‌ను సంప్రదించండి.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: KTM Announces RC 390 ‘R’ Edition — Ready To Race
Story first published: Tuesday, January 30, 2018, 18:54 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark