లాంబ్రెట్టా స్కూటర్స్ రీఎంట్రీ ఈ ఏడాదిలోనే...

ఇటలీకి చెందిన దిగ్గజ ఇకానిక్ స్కూటర్ల బ్రాండ్ లాంబ్రెట్టా గత ఏడాదితో 70 వసంతాలు పూర్తి చేసుకుంది. ఆ సందర్భంగా లాంబ్రెట్టా బ్రాండ్ వి స్పెషల్ స్కూటర్లను ఆవిష్కరించింది.

By Anil Kumar

ఇటలీకి చెందిన దిగ్గజ ఇకానిక్ స్కూటర్ల బ్రాండ్ లాంబ్రెట్టా గత ఏడాదితో 70 వసంతాలు పూర్తి చేసుకుంది. ఆ సందర్భంగా లాంబ్రెట్టా బ్రాండ్ వి స్పెషల్ స్కూటర్లను ఆవిష్కరించింది. అయితే, తాజాగా అందిన సమాచారం మేరకు, లాంబ్రెట్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అభివృద్ది చేస్తున్నట్లు తెలిసింది. ల్యాంబ్రెట్టా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రపంచ ఆవిష్కరణ మరియు దేశీయ కార్యకలాపాలు ఈ ఏడాది నుండే ప్రారంభమవుతాయని సమాచారం.

లాంబ్రెట్టా స్కూటర్స్ రీఎంట్రీ ఈ ఏడాదిలోనే...

అంతే కాకుండా ఇటాలియన్ దిగ్గజం లాంబ్రెట్టా ఆస్ట్రేలియా మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పాటు మొత్తం మూడు కొత్త స్కూటర్లను లాంచ్ చేయడానికి సిద్దమైనట్లు తెలిసింది. లాంబ్రెట్టా వి స్పెషల్ వి50, వి125 మరియు వి200 వేరియంట్లలో లభ్యం కానుంది. అదే విధంగా వచ్చే ఏడాది 400సీసీ స్కూటర్‌ను కూడా పరిచయం చేయనుంది.

లాంబ్రెట్టా స్కూటర్స్ రీఎంట్రీ ఈ ఏడాదిలోనే...

లాంబ్రెట్టా వి స్పెషల్ మోడల్ స్కూటర్లను ఆస్ట్రియన్ టూ వీలర్ డిజైన్ సంస్థ కిస్కా డిజైన్ చేసింది. కెటిఎమ్, హస్కవర్నా స్వార్ట్‌పిలెన్ మరియు విట్‌పిలెన్ మోటార్ సైకిళ్లను కూడా కిస్కా డిజైనింగ్ కంపెనీనే రూపొందించింది. లాంబ్రెట్టా వి స్పెషల్ స్కూటర్లు ఆధునిక టెక్నాలజీ మేళవింపులతో కూడిన సిగ్నేచర్ క్లాసిక్ డిజైన్‌లో ఉన్నాయి.

లాంబ్రెట్టా స్కూటర్స్ రీఎంట్రీ ఈ ఏడాదిలోనే...

లాంబ్రెట్టా వి స్పెషల్ మోడళ్లు స్టీల్ బాడీ, ముందు వైపున ఫిక్స్‌డ్ ఫ్రేమ్ మరియు ఇకానిక్ లాంబ్రెట్టా బ్యాడ్జింగ్ ఉంది. లాంబ్రెట్టా వి స్పెషల్ మోడల్ స్కూటర్లు మూడు రకాల ఇంజన్ ఆప్షన్‌లతో లభ్యమవుతున్నాయి. అవి, 50సీసీ, 125సీసీ మరియు 200సీసీ. అంతే కాకుండా, లాంబ్రెట్టా జిపి మరియు ఎస్ఎక్స్ క్లాసిక్ స్కూటర్లను లాంచ్ చేయాలని చూస్తోంది.

లాంబ్రెట్టా స్కూటర్స్ రీఎంట్రీ ఈ ఏడాదిలోనే...

లాంబ్రెట్టా వి స్పెషల్ స్కూటర్లలో ఎల్ఇడి హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్ మరియు టర్న్ఇండికేటర్లతో పాటు, ముందు వైపున 220ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్, 12-వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ మరియు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ ఉన్నాయి. 200సీసీ వేరియంట్లో సేఫ్టీ కోసం బాష్ నుండి సేకరించిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ కూడా ఉంది.

లాంబ్రెట్టా స్కూటర్స్ రీఎంట్రీ ఈ ఏడాదిలోనే...

లాంబ్రెట్టా కంపెనీ 1950 నుండి 1990 మధ్య కాలంలో ప్రభుత్వ రంగ సంస్థ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ భాగస్వామ్యంతో స్కూటర్లను ఉత్పత్తి చేసింది. తరువాత, కంపెనీలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో లాంబ్రెట్టా స్కూటర్ల తయారీకి శాశ్వతంగా ముగింపు పలికింది.

లాంబ్రెట్టా స్కూటర్స్ రీఎంట్రీ ఈ ఏడాదిలోనే...

లాంబ్రెట్టా స్కూటర్లు ఇప్పటి తరానికి కాస్త కొత్తగా అనిపించినప్పటికీ, ఒకప్పుడు ఇండియాలో బాగా ప్రాచుర్యం పొందిన స్కూటర్ల బ్రాండ్. 1950ల కాలంలో ఇటలీకి చెందిన లాంబ్రెట్టా సంస్థ పూర్తి స్థాయి ప్రభుత్వ వాటాతో ఏర్పాటైన స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ ద్వారా దేశీయ మార్కెట్లోకి పరిచయం అయ్యింది.

లాంబ్రెట్టా స్కూటర్స్ రీఎంట్రీ ఈ ఏడాదిలోనే...

దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లో స్కూటర్ల విభాగం మంచి ఫలితాలను సాధిస్తోంది. దీనికి తోడు ఇకో-ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ టూ వీలర్ల అభివృద్ది మరియు తయారీ పట్ల ప్రపంచ దేశాలు ఆసక్తి కనబరుస్తుండటంతో ఇటాలియన్ దిగ్గజం లాంబ్రెట్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అభివృద్ది చేస్తోంది.

లాంబ్రెట్టా స్కూటర్స్ రీఎంట్రీ ఈ ఏడాదిలోనే...

లాంబ్రెట్టా స్కూటర్ల కంపెనీ అభివృద్ది చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఈ ఏడాదిలోనే అధికారికంగా ఆవిష్కరించనుంది. అంతే కాకుండా, దేశీయ ప్రీమియం స్కూటర్ల విభాగంలోకి ప్రవేశించే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇదే జరిగితే విపణిలో ఉన్న పియాజియో వెస్పా స్కూటర్లకు లాంబ్రెట్టా స్కూటర్లు గట్టి పోటీనివ్వనున్నాయి.

Source: CarandBike

Most Read Articles

English summary
Read In Telugu: Lambretta Electric Scooter In The Works — To Be Unveiled This Year
Story first published: Saturday, May 26, 2018, 14:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X