విడుదలకు సిద్దమైన ఏబిఎస్ వెర్షన్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్: ధర మరియు ఇతర వివరాలు

By Anil Kumar

ఏప్రిల్ 1, 2018 నుండి 125సీసీ కంటే ఎక్కువ ఇంజన్ కెపాసిటీతో మార్కెట్లోకి విడుదలయ్యే ప్రతి బైకులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌ను కేంద్రం తప్పనిసరి చేసింది. ఈ తరుణంలో, చాలా వరకు టూ వీలర్ల తయారీ కంపెనీలు విడుదల చేసే కొత్త బైకుల్లో ఏబిఎస్ అందివ్వడానికి సిద్దమయ్యాయి. ఈ నేపథ్యంలో రాయల్ ఎన్ఫీల్డ్ తమ బుల్లెట్ బైకులో ఏబిఎస్ ఫీచర్ అందివ్వడానికి సిద్దమైనట్లు తెలిసింది.

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఏబిఎస్

తాజాగా అందిన సమాచారం మేరకు, రాయల్ ఎన్ఫీల్డ్ తమ బుల్లెట్ బైకులో సింగల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌ను అందివ్వనున్నట్లు తెలిసింది. అంటే, కేవలం ఫ్రంట్ డిస్క్ బ్రైకుకు మాత్రమే ఏబిఎస్ ఉంటుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఏబిఎస్

రాయల్ ఎన్ఫీల్డ్ శ్రేణిలో బుల్లెట్ 350 మరియు బుల్లెట్ 500 బైకులు తొలిసారిగా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌తో రానున్నాయి. సేఫ్టీలో అత్యంత కీలకమైన ఏబిఎస్ ఇప్పటి వరకు రాయల్ ఎన్ఫీల్డ్ ఏబిఎస్ రాలేదు. ఈ నిర్ణయంతో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకు కూడా డిమాండ్ పెరగనుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఏబిఎస్

డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో పోల్చుకుంటే సింగల్ ఛానల్ ఏబిఎస్ అంత మంచిది కాదు. కానీ, అస్సలు ఏబిఎస్ లేకపోవడం కంటే కనీసం సింగల్ ఛానల్ ఏబిఎస్ అయినా మంచిదే కదా. బుల్లెట్ శ్రేణి బైకుల బరువు ఎక్కువగా ఉండటం, దీనికి తోడు ఏబిఎస్ ఉండటంతో వీటి బ్రేకింగ్ పనితీరు మరింత మెరుగుపడనుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఏబిఎస్

రాయల్ ఎన్ఫీల్డ్ తమ బైకుల్లో డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ కాకుండా సింగల్ ఛానల్ ఏబిఎస్ అందివ్వడానికి గల ప్రధాన కారణం తక్కువ ధరలో అందివ్వడం. నూతన ప్రమాణాలకు అనుగుణంగా వచ్చే సింగల్ ఛానల్ ఏబిఎస్ ధర చాలా తక్కువ.

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఏబిఎస్

సింగల్ ఛానల్ ఏబిఎస్ వెర్షన్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ధరల్లో పెద్దగా మార్పులేమీ జరగకపోవచ్చు. రెగ్యుల్ వెర్షన్ బుల్లెట్ బైకులతో పోల్చుకుంటే రూ. 10,000 ల నుండి రూ. 12,000 వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఏబిఎస్

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఏబిఎస్ వెర్షన్ ఏప్రిల్ 2018 ప్రారంభం నాటికి విపణిలోకి విడుదలయ్యే అవకాశం ఉంది. అంతే కాకుండా, రాయల్ ఎన్ఫీల్డ్ వారి ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ మోటార్ సైకిల్‌లో కూడా ఏబిఎస్ సేఫ్టీ ఫీచర్‌ను అందించే అవకాశం ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఏబిఎస్

విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అడ్వెంచర్ ఎడిషన్ బైకులో డ్యూయల్ ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ ఉంది. కాబట్టి, ఇండియన్ మార్కెట్లో అమ్ముడయ్యే మోడల్‌లో కూడా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ రానుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఏబిఎస్

అంతే కాకుండా, అప్ కమింగ్ రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జిటి మరియు 650 మరియు ఇంటర్‌సెప్టార్ 650 బైకుల్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఫీచర్ తప్పనిసరి ఫీచర్‌గా రానుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఏబిఎస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

నూతన భద్రతా నియమావళి ప్రకారం, రాయల్ ఎన్ఫీల్డ్ ఎట్టకేలకు తమ బుల్లెట్ శ్రేణి బైకుల్లో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ అందివ్వడానికి సిద్దమైంది. రాయల్ ఎన్ఫీల్డ్ లైనప్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన థండర్‌బర్డ్ మరియు క్లాసిక్ శ్రేణి బైకుల్లో కూడా ఏబిఎస్ ఫీచర్ వస్తే బాగుటుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఏబిఎస్

ఏబిఎస్ ఉన్న బైకుల ధర సాధారణ బైకుల కంటే అధికంగా ఉంటుంది. అయితే, మితిమీరిన వేగంతో ప్రయాణించేటపుడు ప్రమాదానికి గురికాకుండా ప్రతి రైడర్ భద్రత విషయంలో ఏబిఎస్ ఎంతో చక్కగా పనిచేస్తుంది. ప్రాణాల కంటే విలువైనదేదీ లేదు కాబట్టి ఏబిఎస్ వెర్షన్ బైకులనే ఎంచుకోండి...

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఏబిఎస్

1. బజాజ్ డామినర్ 400 మీద మళ్లీ పెరిగిన ధరలు

2.[వీడియో] కదిలే స్కూటర్ మీద హోమ్ వర్క్ చేస్తున్న పిల్లాడు

3.పల్టీలు కొట్టిన టాటా నెక్సాన్ ఎస్‌యూవీ: మళ్లీ అవే ఫలితాలు!!

4.రాంగ్ సైడ్ డ్రైవింగ్ నివారించడానికి టైర్ కిల్లర్స్ ఏర్పాటు చేసిన పోలీసులు

5. 2018 మారుతి స్విఫ్ట్ సేఫ్ కారు కాదా....? నిగ్గు తేల్చిన యూరో ఎన్‌సిఎపి!

Most Read Articles

English summary
Read In Telugu: Royal Enfield Bullet To Get Single-Channel ABS; Launch Date And Expected Price
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X