రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్ పద్ద రహస్యంగా పట్టుబడిన క్లాసిక్ స్క్రాంబ్లర్

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 ఆధారిత స్క్రాంబ్లర్ ఎడిషన్ బైకులను యూరోపియన్ మార్కెట్లో విక్రయిస్తోంది, కానీ ఈ మోటార్ సైకిల్ ఇండియన్ మార్కెట్లో లభించడం లేదు. అయితే, యూరోపియన్ వెర్షన్ తరహా క్లాసిక్ 500 ఆధ

By Anil Kumar

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 ఆధారిత స్క్రాంబ్లర్ ఎడిషన్ బైకులను యూరోపియన్ మార్కెట్లో విక్రయిస్తోంది, కానీ ఈ మోటార్ సైకిల్ ఇండియన్ మార్కెట్లో లభించడం లేదు. అయితే, యూరోపియన్ వెర్షన్ తరహా క్లాసిక్ 500 ఆధారిత స్క్రాంబ్లర్ బైకు తాజాగా ఇండియన్ రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్ వద్ద పట్టుబడింది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ స్క్రాంబ్లర్

అంతే కాకుండా, రాయల్ ఎన్ఫీల్డ్ ఈ క్లాసిక్ స్క్రాంబ్లర్ బైకును దేశీయంగా లాంచ్ చేస్తుందనే ఆధారంలేని వార్త ఒకటి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. అయితే క్లాసిక్ స్క్రాంబ్లర్ ఇండియా విడుదల గురించి రాయల్ ఎన్ఫీల్డ్ నుండి ఎలాంటి సమాచారం లేదు.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ స్క్రాంబ్లర్

కంపెనీ కాకుండా, రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్ స్వయంగా ఇలా మోడిఫై చేయించి అమ్మకానికి ప్రదర్శించినట్లు తెలుస్తోంది. అయితే, సాంకేతికంగా మోడిఫైడ్ చేసిన మోటార్ సైకిళ్లను విక్రయించడం నేరం. కాబట్టి డీలర్లు కూడా ఈ పని చేసే అవకాశం లేదు.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ స్క్రాంబ్లర్

డీలర్ వద్ద పట్టుబడిన క్లాసిక్ స్క్రాంబ్లర్ 500 బైకులో గుర్తించదగిన మార్పుల్లో, ఎత్తైన మడ్ రియర్ మడ్ గార్డ్, రియర్ సీట్ స్థానంలో లగేజ్ క్యారీర్, అప్‌సెట్ ఎగ్జాస్ట్ మరియు ఆఫ్ రోడింగ్ లక్షణాలు గల టైర్లను అందివ్వడం జరిగింది. యూరోపియన్ మార్కెట్లో డీలర్లు కస్టమైజేషన్ కిట్ ద్వారా క్లాసిక్ స్క్రాంబ్లర్ బైకును విక్రయిస్తున్నారు. ఇక్కడి పట్టుబడిన మోడల్‌లో కూడా దాదాపు అవే ఫీచర్లు ఉన్నాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ స్క్రాంబ్లర్

రాయల్ ఎన్ఫీల్డ్ ఈ ఏడాది రెండు పెద్ద బైకులను లాంచ్ చేయడానికి సిద్దమవుతోంది. గత ఏడాది అంతర్జాతీయ ఆవిష్కరణ చేసిన కాంటినెంటల్ జిటి 650 మరియు ఇంటర్‌సెప్టార్ 650 బైకులను 650సీసీ కెపాసిటి గల ట్విన్-సిలిండర్ ఇంజన్‌తో లాంచ్ చేయనుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ స్క్రాంబ్లర్

రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియా లైనప్‌లో అత్యంత శక్తివంతమైన బైకులుగా నిలిచే 650-సిరీస్ బైకుల్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఫీచర్ తప్పనిసరిగా వస్తోంది. అంతే కాకుండా, వీటి విడుదలతో ట్విన్ సిలిండర్ ఇంజన్‌ను పూర్తి స్థాయిలో స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ది చేసి, అందుబాటులోకి తీసుకొచ్చిన మొదటి భారతదేశపు టూ వీలర్ల కంపెనీగా రాయల్ ఎన్ఫీల్డ్ రికార్డు సృష్టించనుంది.

Source: FinancialExpress

Most Read Articles

English summary
Read In Telugu: Royal Enfield Classic Scrambler spied at dealership in India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X