ప్రతి ఒక్కరూ ఇష్టపడే రంగులో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్

Written By:

రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ పురోగతిలో భారీ మార్పులు తీసుకొచ్చిన మోడల్ హిమాలయన్. అడ్వెంచర్ మోటార్ సైకిళ్ల అభిమానుల్లో ఫేవరెట్ బైకుగా స్థానం సంపాదించుకున్న రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఇప్పుడు మరో కొత్త కలర్ ఆప్షన్‌లో డీలర్ల వద్ద పట్టుబడింది.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్

రహస్యంగా సేకరించి ఫోటోల ప్రకారం, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఆర్మీ సైనికులు ధరించే దుస్తుల రంగుని పోలి ఉండే కలర్ స్కీమ్‌లో ఉంది. ఫ్యూయల్ ట్యాంక్, ఫ్రంట్ మరియు రియర్ మడ్ గార్డ్స్ నలుపు మరియు తెలుపు రంగు చారలున్న బూడిద రంగులో ఉన్నాయి.

Recommended Video - Watch Now!
Watch Now | Indian Navy's MiG-29K Crashed In Goa Airport | Full Details - DriveSpark
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్

ఐకానిక్ మోటార్ సైకిళ్ల తయారీ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ విపణిలోకి తీసుకొచ్చిన ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ మోటార్ సైకిల్ హిమాలయన్ స్నో మరియు గ్రాఫైట్ రంగుల్లో మాత్రమే లభించేది. ఈ రెండింటితో పాటు ఇక మీదట ఈ బూడిద రంగుతో కలుపుకొని మూడు రంగుల్లో లభ్యం కానుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్

నూతన పెయింట్ స్కీమ్‌లో రహస్యంగా డీలర్లను చేరిన రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైకులు ప్రొడక్షన్‌కు సిద్దమైన మోడళ్లుగా దర్శనమిస్తున్నాయి. అధికారిక విడుదలకు ముందే డీలర్లకు చేర్చుతున్నారంటే, దీనిని వచ్చే ఫిబ్రవరి 2018లో పూర్తి స్థాయిలో లాంచ్ చేసే అవకాశం ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్

కొత్తగా పరిచయం చేసిన కలర్ ఆప్షన్ మినహాయిస్తే, డిజైన్ మరియు సాంకేతికంగా ఇందులో ఎలాంటి మార్పులు జరగలేదు. రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైకులో 411సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ కలదు.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్

ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు అనుసంధానం చేసిన 5-స్పీడ్ గేర్‌బాక్స్ గుండా ఇంజన్ ఉత్పత్తి చేసే 24.5బిహెచ్‌‌పి పవర్ మరియు 32ఎన్ఎమ్ టార్క్ రియర్ వీల్‌కు సరఫరా అవుతుంది.

Trending On DriveSpark Telugu:

2018లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం విడుదలయ్యే కార్లు

న్యూ మారుతి స్విఫ్ట్ బుకింగ్స్ విషయంలో డీలర్ల తొందరపాటు

రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్‌లో ఎలక్ట్రిక్ బుల్లెట్ బైకు: ఇక మీదట ఆ సౌండ్ లేనట్లేనా..?

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైకును హాఫ్ డ్యూప్లెక్స్ స్ల్పిట్ క్రాడిల్ ఫ్రేమ్ మీద నిర్మించడంతో ఎంతో సౌకర్యవంతమైన అత్యుత్తమ ఆఫ్ రోడ్ మరియు ఆన్ రోడ్ రైడింగ్ సాధ్యమయ్యింది. ముందు వైపున 200ఎమ్ఎమ్ ట్రావెల్ గల 41ఎమ్ఎమ్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున 180ఎమ్ఎమ్ ట్రావెల్ గల మోనోషాక్ అబ్జార్వర్ కలదు.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్

నూతన కలర్ ఆప్షన్‌లో పట్టుబడిన రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ధర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే, రెగ్యులర్ హిమాలయన్‌తో పోల్చుకుంటే రూ. 5,000 లు నుండి రూ. 6,000 మేర అధికంగా ఉండే అవకాశం ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కొత్త కలర్ ఆప్షన్‌లలో తమ బైకులను పరిచయం చేయడంలో రాయల్ ఎన్ఫీల్డ్ ఎప్పుడూ ముందుంటుంది. ఇటీవల కొత్త కలర్ ఆప్షన్స్ మరియు డిజైన్ పరంగా స్వల్ప మార్పులు చేసి థండర్‌బర్డ్ 350 మరియు 500 మోడళ్లను ఎక్స్ సిరీస్ పేరుతో అభివృద్ది చేసిన బైకులను డీలర్ల వద్దకు చేర్చింది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Royal Enfield Himalayan In Camouflage Colour — India Launch Soon
Story first published: Friday, January 5, 2018, 19:08 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark