రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650సీసీ విడుదల ఖరారు

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650 బైకును ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తూ బిజీగా ఉంది. చెన్నైలోని గ్లోబల్ ఆటోమోటివ్ రీసెర్చ్ సెంటర్ సమీపంలో ఇంటర్‌సెప్టార్ 650సీసీ బైకును పరీక్షించింది.

By Anil

Recommended Video

Ducati 959 Panigale Crashes Into Buffalo - DriveSpark

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650 బైకును ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తూ బిజీగా ఉంది. తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, చెన్నైలోని ఓరగడం ప్రాంతంలో ఉన్న గ్లోబల్ ఆటోమోటివ్ రీసెర్చ్ సెంటర్ సమీపంలో ఇంటర్‌సెప్టార్ 650సీసీ బైకును పరీక్షిస్తూ ఆటోమొబైల్ మీడియా కంటబడింది.

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650

రాయల్ ఎన్ఫీల్డ్ లైనప్‌లో అత్యంత శక్తివంతమైన మరియు ఖరీదైన మోటర్ సైకిల్‌గా నిలవనున్న ఇంటర్‌సెప్టార్ 650 బైకును ఏప్రిల్ 2018లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీనితో పాటు కాంటినెంటల్ జిటి 650 బైకును లాంచ్ చేసే అవకాశం ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650

రెట్రో స్టైల్ మరియ మోడ్రన్ హంగులతో ఉన్న పవర్‌ఫుల్ బైకును కోరుకునే కస్టమర్లకు రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650 బెస్ట్ ఛాయిస్‌గా నిలవనుంది. రహస్యంగా సేకరించిన ఫోటోలను పరిశీలిస్తే, హ్యాండిల్ బార్ మీద యాక్షన్ కెమెరా, పిలియన్ గ్రాబ్ రెయిల్, శారీ గార్డ్ ఉన్నాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650 మూడు విభిన్న రంగుల్లో లభ్యం కానుంది. అవి, ఆరేంజ్ రష్, ర్యావిషింగ్ రెడ్ మరియు సిల్వర్ స్పెక్టర్.

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650

సాంకేతికంగా రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650 బైకులో 650సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే SOHC 4-వాల్వ్ ప్యార్లల్ ట్విన్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది 7,100ఆర్‌పిఎమ్ వద్ద బిహెచ్‌పి పవర్ మరియు 4,000ఆర్‌పిఎమ్ వద్ద 52ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650

రాయల్ ఎన్ఫీల్డ్ బైకులంటే వైబ్రేషన్స్‌కు పెట్టింది పేరు. అయితే, ఈ 650సీసీ ఇంజన్‌లో వైబ్రేషన్స్ తగ్గించేందుకు 270-డిగ్రీ క్రాంక్‌షాఫ్ట్‌కు బ్యాలన్సర్ షాఫ్ట్ జోడించడం జరిగింది. ఇందులో స్ల్పిట్ క్లచ్ అనుసంధానం గల 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది.

  • రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో వైబ్రేషన్స్‌కు ఫుల్ స్టాప్!!
  • రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650

    రాయల్ ఎన్ఫీల్డ్ 650సీసీ ఇంజన్‌తో ఇండియన్ క్రూయిజర్ మోటార్ సైకిళ్ల సెగ్మెంట్లోకి ప్రవేశిస్తోంది. ఇంటర్‌సెప్టార్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 బైకులతో ఏప్రిల్ 2018న విపణిలోకి ఎంట్రీ ఇవ్వనుంది.

    రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650

    క్రూయిజర్ బైక్ ప్రేమికులకు ఇప్పుడు ఆప్షన్స్ మరింత పెరిగాయని చెప్పవచ్చు. ఈ సెగ్మెంట్లో రూ. 5.44 లక్షలు ఎక్స్-రూమ్ ధరతో లభించే కవాసకి వుల్కన్ ఎస్ బైకుతో రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650 గట్టి పోటీని ఎదుర్కోనుంది. ఇదే బరిలో హోయసంగ్ జివి650 అక్విలా ప్రొ మరియు హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ 750 బైకులు ఉన్నాయి.

    Trending DriveSpark Telugu YouTube Videos

    Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Source: Rushlane

Most Read Articles

English summary
Read In Telugu: Royal Enfield Interceptor 650cc Spied In Chennai; Launch Slated For April 2018
Story first published: Monday, January 29, 2018, 12:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X