Subscribe to DriveSpark

ఆక్టివా, యాక్సెస్ స్కూటర్ల బరిలోకి టీవీఎస్ తొలి 125సీసీ స్కూటర్

Written By:

టీవీఎస్ సరికొత్త 125సీసీ స్కూటర్‌ను పరీక్షిస్తూ మళ్లీ మీడియా కంటబడింది. అయితే, ఈసారి గ్రాఫైట్ కాన్సెప్ట్ ఆధారిత మోడల్‌కు టెస్టింగ్ నిర్వహించింది. దీని తాలూకు ఫోటోలు మరియు వీడియోలు అంతర్జాలంలో చక్కర్లు కొడుతున్నాయి.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
టీవీఎస్ 125సీసీ స్కూటర్

టీవీఎస్ ప్రస్తుతం తాజాగా విడుదల చేసిన అపాచే ఆర్ఆర్ 310 బైకును ప్రచారం చేయడంలో నిమగ్నమైంది. అయితే టీవీఎస్ డెవలప్‌మెంట్ బృందం టీవీఎస్ యొక్క భవిష్యత్తు మోడళ్ల అభివృద్ది మరియు టెస్టింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తోంది.

Recommended Video - Watch Now!
Shocking Car Accident That Happened In Karunagappally, Kerala
టీవీఎస్ 125సీసీ స్కూటర్

టీవీఎస్ మార్కెట్లోకి తీసుకురానున్న సరికొత్త 125సీసీ స్కూటర్ 2014లో జరిగిన ఇండియన్ ఆటో ఎక్స్ పో వాహన ప్రదర్శన వేదిక మీద ఆవిష్కరించిన గ్రాఫైట్ స్కూటర్ ఆధారంగా అభివృద్ది చేసినట్లు తెలిసింది.

టీవీఎస్ 125సీసీ స్కూటర్

ఎలాంటి డిజైన్ మరియు ఫీచర్లు గుర్తించడానికి వీల్లేకుండా బూడిద రంగు స్టిక్కరింగ్‌తో స్కూటర్ మొత్తాన్ని కవర్ చేసి మంగళూరు పరిసర ప్రదేశాల్లో రహస్యంగా పరీక్షిస్తుండగా మీడియా ప్రతినిధి ఫోటోలు మరియు వీడియో తీశారు. వీడియోలో టీవీఎస్ 125సీసీ స్కూటర్ ఎగ్జాస్ట్ శబ్దాన్ని కూడా గమనించవచ్చు.

టీవీఎస్ 125సీసీ స్కూటర్

విసృత శ్రేణి ప్రీమియమ్ ఫీచర్లు, స్పోర్టివ్ డిజైన్ లుక్, హ్యాండిల్ బార్ క్రింద అమర్చిన హెడ్ ల్యాంప్స్, హ్యాండిల్ బార్‌కు ఇరువైపులా టర్న్ ఇండికేటర్స్, హెడ్ ల్యాంప్‍‌కు జతగా పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, అదనంగా 12-అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు పెటల్ ఫ్రంట్ డిస్క్ బ్రేకులు రానున్నాయి.

Trending On DriveSpark Telugu:

సరికొత్త డాజ్ స్కూటర్‌ను పరీక్షిస్తోన్న టీవీఎస్

సుజుకి ఇంట్రూడర్ బైకును ఎదుర్కునేందుకు బజాజ్ మరో ఎత్తుగడ

ఈయన తెలివికి జోహార్లు: బుల్లెట్ బైకులో రివర్స్ గేర్

కవాసకి వుల్కన్ ఎస్ 650 బైక్ లాంచ్: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఫోటోలు

టీవీఎస్ 125సీసీ స్కూటర్

టీవీఎస్ 125సీసీ స్కూటర్‌లో గుర్తించిన మరో అదనపు ఫీచర్, పూర్తి స్థాయి డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్. ఈ డిస్ల్పే ద్వారా స్కూటర్ వేగం, ఓడోమీటర్, ఫ్యూయల్ గేజ్, టాకోమీటర్, డిస్టెన్స్-టు-ఎంప్టి, సర్వీస్ ఇండికేటర్స్ ఇంకా అంశాల గురించిన సమాచారం పొందవచ్చు.

టీవీఎస్ 125సీసీ స్కూటర్

రియర్ డిజైన్‌లో స్వెప్ట్ బ్యాక్ టెయిల్ లైట్లు, డ్యూయల్ ఫ్లోటింగ్ గ్రాబ్ రెయిల్స్ ఉన్నాయి. స్కూటర్‌ను వెనుక నుండి గమనిస్తే లావుగా మరియు పెద్దగా ఉన్నట్లు అనిపిస్తుంది. రహస్యంగా తీసిన ఫోటోల ద్వారా ఎక్ట్సర్నల్ ఫ్యూయల్ క్యాప్, ప్రీమియమ క్వాలిటీ గల స్విచ్చులు, ఇంజన్ కిల్ స్విచ్ మరియు అల్యూమినియం ఫుట్ పెడల్స్ గమనించవచ్చు.

టీవీఎస్ 125సీసీ స్కూటర్

టీవీఎస్ కొత్త స్కూటర్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ మరియు హైడ్రాలిక్ షాక్ అబ్జార్వర్ ఉన్నాయి. ఇంజన్‌కు సంభందించిన వివరాలు స్పష్టంగా తెలియరాలేదు. దీని పేరు ప్రకారం ఇందులో 125సీసీ మరియు 150సీసీ ఇంజన్‌లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టీవీఎస్ 125సీసీ స్కూటర్ విపణిలో ఉన్న హోండా గ్రాజియా మరియు సుజుకి యాక్సెస్ స్కూటర్లకు పోటీనివ్వనుంది. అదే విధంగా, 150సీసీ స్కూటర్ అప్రిలియా ఎస్ఆర్150 స్కూటర్‌కు పోటీగా నిలవనుంది. ఇప్పటి వరకు 110సీసీ స్కూటర్లకే పరిమితమైన టీవీఎస్ ఇప్పుడు పర్ఫామెన్స్ మరియు ప్రీమియమ్ స్కూటర్ల మార్కెట్లో రాణించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ, విపణిలో ఉన్న మోడళ్లను ఎదుర్కునేందుకు అత్యంత పోటీత్వమున్న ధరతో ప్రవేశపెడితే తప్ప సక్సెస్ సాధించలేదు.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Source: Irfan Ahmed Vlogs

English summary
Read In Telugu: TVS 125cc (Graphite) Scooter Spotted Testing In India Again
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark