Subscribe to DriveSpark

సరికొత్త డాజ్ స్కూటర్‌ను పరీక్షిస్తోన్న టీవీఎస్

Written By:

దక్షిణ భారత టూ వీలర్ల తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్స్ విపణిలోకి కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయడానికి సిద్దమవుతోంది. ప్రత్యేకించి స్కూటర్ల మార్కెట్ మీద ఎక్కువ దృష్టిసారిస్తోంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
టీవీఎస్ డాజ్ స్కూటర్

తాజాగా టీవీఎస్ ప్రతినిధులు సరికొత్త డాజ్ స్కూటర్‌కు బెంగళూరు పరిసర ప్రాంతాల్లో రహదారి పరీక్షలు నిర్వహించింది. టీవీఎస్ గతంలో 2016 ఇండియన్ ఆటో ఎక్స్-పో వాహన ప్రదర్శన వేదిక మీద ఆవిష్కరించింది. అయితే, ఇప్పటి వరకు విపణిలోకి లాంచ్ చేయలేదు.

Recommended Video - Watch Now!
This New Year 2018 Brings The New Swift Sport To India - DriveSpark
టీవీఎస్ డాజ్ స్కూటర్

టీవీఎస్ మోటార్స్ తొలుత ఈ డాజ్ స్కూటర్‌ను ఇండోనేషియా మార్కెట్ కోసం అభివృద్ది చేసింది. టీవీఎస్ డాజ్ స్కూటర్‌ను ఇప్పటికే పలు ఆగ్నేయాసియా దేశాలలో అందుబాటులో ఉంచింది. అయితే, దేశీయంగా స్కూటర్ల సంఖ్యను పెంచుకునేందుకు ఇప్పుడు భారత్‌ కోసం ఖరారు చేసింది.

టీవీఎస్ డాజ్ స్కూటర్

టీవీఎస్ డాజ్ స్కూటర్‌ను కార్బోరేటర్ మరియు ఫ్యూయల్ ఇంజెక్టెడ్ రెండు రకాల వెర్షన్‌లో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. సాంకేతికంగా ఇందులో ఉన్న 110సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ 8.57బిహెచ్‌పి పవర్ మరియు 8.3ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టీవీఎస్ డాజ్ స్కూటర్

డాజ్ స్కూటర్ డిజైన్ చూడటానికి కాస్త వింతగా ఉంటుంది. ఎందుకంటే, ఇప్పటి వరకు ఇలాంటి తరహా స్కూటర్లు మన విపణిలోకి పరిచయం కాలేదు. ట్రెండింగ్ బాడీ గ్రాఫిక్స్, పెద్ద పరిమాణంలో ఉన్న 14-అంగుళాల పరిమాణం గల అల్లాయ్ వీల్స్‌తో వస్తోంది.

Trending On DriveSpark Telugu:

రాయల్ ఎన్ఫీల్డ్ బైకులో రివర్స్ గేర్ అమర్చిన ఈయన తెలికి జోహార్లు

మారుతికి గట్టి షాక్, ప్రతి కారుకు పోటీని సృష్టిస్తున్న హ్యుందాయ్

ఇండియాలో ఉన్న టాప్-10 అతి పెద్ద టైర్ల కంపెనీలు

సలోన్ వెర్షన్ స్విఫ్ట్ స్పోర్ట్ ఆవిష్కరించిన సుజుకి

టీవీఎస్ డాజ్ స్కూటర్

ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున సింగల్ షాక్ అబ్జార్వర్, అదే విధంగా ఫ్రంట్ వీల్‍‌కు 200ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ మరియు రియర్ వీల్‌కు 130ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ రానుంది.

టీవీఎస్ డాజ్ స్కూటర్

టీవీఎస్ 110 స్కూటర్ల శ్రేణిలో ఉన్న స్తూటీ జెస్ట్ మరియు జూపిటర్ సరసన చేరనుంది. దీని ధర సుమారుగా రూ. 55,000ల నుండి రూ. 60,000 మధ్య ఉండే అవకాశం ఉంది.

టీవీఎస్ డాజ్ స్కూటర్

టీవీఎస్ ఈ 110సీసీ డాజ్ స్కూటర్‌తో పాటు హోండా గ్రాజియాను ఎదుర్కొనేందుకు 125సీసీ కెపాసిటి గల కొత్త స్కూటర్‌ను సిద్దం చేస్తోంది. అధునాతన ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ కన్సోల్‌ మరియు ఎన్నో కొత్త ఫీచర్లను 125సీసీ స్కూటర్లో పరిచయం చేయనుంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Image Source: Bike India

English summary
Read In Telugu: TVS Dazz Spotted Testing In India
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark