టీవీఎస్ నుండి వస్తున్న పర్ఫామెన్స్ స్కూటర్: గ్రాఫైట్

Written By:
Recommended Video - Watch Now!
Andhra Pradesh State Transport Bus Crashes Into Bike Showroom - DriveSpark

ఫిబ్రవరి 5, 2018న టీవీఎస్ నుండి ఓ సరికొత్త మోడల్ విడుదలవుతోంది. దీనికి సంభందించి టీవీఎస్ నుండి డ్రైవ్‌స్పార్క్‌కు ఆహ్వానం అందింది. ఫిబ్రవరి 5వ తేదీన చెన్నై కేంద్రంగా ఒక కొత్త మోడల్‌ను ఆవిష్కరిస్తున్నట్లు, అందుకు సంభందించిన ఓ యూట్యూబ్ వీడియోతో ప్రత్యేక ఆహ్వానం పంపింది.

ఈ టీజర్ వీడియోలో సరికొత్త టూవీలర్ రియర్ టెయిల్ ల్యాంప్ మరియు దాని ఎగ్జాస్ట్ సౌండ్‌ను గుర్తించడం జరిగింది.

దక్షిణ భారత దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థ టీవీఎస్ ఈ ఫిబ్రవరి 5, 2018న విడుదల చేయబోయే మోడల్ గ్రాఫైట్ 125సీసీ స్కూటర్ అని తెలుస్తోంది. టీవీఎస్ మోటార్స్ రివీల్ చేస్తున్న గ్రాఫైట్ 125 స్కూటర్‌ గురించిన ప్రత్యేకతలేంటో చూద్దాం రండి...

టీవీఎస్ గ్రాఫైట్

టీవీఎస్ గ్రాఫైట్ స్కూటర్ స్పెసిఫికేషన్స్ మరియు పర్ఫామెన్స్

  • ఇంజన్: 125సీసీ
  • పవర్: 11.5బిహెచ్‌పి
  • గేర్‌బాక్స్: సివిటి(ఆటోమేటిక్)
  • గరిష్ట వేగం: గంటకు 100కిమీలకు పైగా
టీవీఎస్ గ్రాఫైట్

టీవీఎస్ గ్రాఫైట్ 125సీసీ పర్ఫామెన్స్ స్కూటర్ విపణిలో ఉన్న హోండా గ్రాజియా మరియు అప్ కమింగ్ అప్రిలియా ఎస్ఆర్125 స్కూటర్లకు గట్టి పోటీనివ్వనుంది. హోండా గ్రాజియా ప్రారంభ వేరియంట్ ధర రూ. 57,000 లుగా ఉంది.

టీవీఎస్ గ్రాఫైట్

టీవీఎస్ మోటార్స్ ఈ గ్రాఫైట్ స్కూటర్‌ను ఇప్పటికే పలుమార్లు ఇండియన్ రోడ్ల మీద రహస్యంగా పరీక్షించింది. ఈ ఫిబ్రవరి 5 న ప్రొడక్షన్ వెర్షన్ గ్రాఫైట్ స్కూటర్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది.

టీవీఎస్ గ్రాఫైట్

ఈ ఏడాది ఫిబ్రవరిలో 9-14 వ తేదీ మధ్య జరిగే భారతదేశపు అతి పెద్ద వాహన ప్రదర్శన వేదిక ఆటో ఎక్స్‌పో 2018లో సరికొత్త గ్రాఫైట్ 125 స్కూటర్‌తో పాటు టీవీఎస్ మోటార్స్ ఇంకా ఎన్నో కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనుంది. ఆటో ఎక్స్‌పో అప్‌డేట్స్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి...

Trending DriveSpark YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: TVS Graphite Scooter Teased - The Performance Scooter From TVS Launching Soon!
Story first published: Sunday, January 28, 2018, 15:10 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark