హోండాకు ఊహించని షాకిచ్చిన టీవీఎస్

హోండా గత ఏడాది విడుదల చేసిన గ్రాజియా స్కూటర్‌ను టీవీఎస్ ఎన్‌టార్క్ 125 సేల్స్ పరంగా దాటేసింది. ఒక రకంగా ఈ చెప్పాలంటే ఈ మధ్య కాలంలో హోండా స్కూటర్లను సేల్స్ పరంగా అధికమించిన మోడల్ కూడా టీవీఎస్ ఎన్‌టార్క

By Anil Kumar

ఆటోమేటిక్ స్కూటర్ల సామ్రాజ్యంలో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా కంపెనీకి దక్షిణ భారత ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ నుండి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125

అవును, హోండా గత ఏడాది విడుదల చేసిన గ్రాజియా స్కూటర్‌ను టీవీఎస్ ఎన్‌టార్క్ 125 సేల్స్ పరంగా దాటేసింది. ఒక రకంగా ఈ చెప్పాలంటే ఈ మధ్య కాలంలో హోండా స్కూటర్లను సేల్స్ పరంగా అధిగమించిన మోడల్ కూడా టీవీఎస్ ఎన్‌టార్క్ స్కూటర్ కావడం విశేషం.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125

హోండా గ్రాజియా 125 మరియు టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రెండు స్కూటర్ల కూడా 125సీసీ సెగ్మెంట్లో పర్ఫామెన్స్ మరియు ప్రీమియం స్కూటర్లుగా యువతను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. గ్రాజియా విడుదలైన తరువాత ఎన్‌టార్క్ కాస్త ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ, మంచి ఫలితాలను సాధిస్తోంది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125

సరిగ్గా మూడు నెలల క్రితం విడుదలైన టీవీఎస్ గ్రాజియా మే 2018లో 14,695 యూనిట్ల సేల్స్ సాధించింది. గత ఏడాది లాంచ్ అయిన హోండా గ్రాజియా ఇదే కాలంలో 12,068 యూనిట్లు అమ్మడయ్యాయి.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125

అంతకు ముందు ఏప్రిల్ 2018లో 26,000 గ్రాజియా స్కూటర్లు అమ్ముడుపోగా, ఎన్‌టార్క్ 125 రాకతో గ్రాజియా సేల్స్ విపరీతంగా పడిపోయాయి. టీవీఎస్ ఎన్‌టార్క్ 125 నుండి ఎదురైన పోటీ గ్రాజియా మీద తీవ్ర ప్రభావమే చూపింది. దీంతో కేలం నెల రోజుల వ్యవధిలోనే సగానికి పైగా సేల్స్ పతనమయ్యాయి.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రూ. 58,750 ఎక్స్-షోరూమ్ ధరతో అమ్మడవుతోంది. టీవీఎస్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న అత్యంత ఖరీదైన స్కూటర్ ఇదే. స్పోర్ట్ థీమ్ మరియు అగ్రెసివ్ డిజైన్ శైలిలో రూపొందించింది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125

టీవీఎస్ స్వయంగా అభివృద్ది చేసి మరియు పరీక్షించిన సరికొత్త 125సీసీ కెపాసిటి గల ఆటోమేటిక్ ఇంజన్ అందించింది. ఇది గరిష్టంగా 9.3బిహెచ్‌పి పవర్ మరియు 10.5ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125

ఇండియన్ మార్కెట్లో ఉన్న అత్యంత వేగవంతమైన స్కూటర్లలో టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ఒకటి, కేవలం 9 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 60 కిమీల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 95కిమీలుగా ఉంది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125

బ్రేకింగ్ డ్యూటీ కోసం ముందు వైపున 220ఎమ్ఎమ్ డిస్క్ మరియు వెనుక వైపున 130ఎమ్ఎమ్ డ్రమ్ బ్రేక్ ఉంది. 12-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ మరియు ట్యూబ్ లెస్ టైర్లు స్టాండర్డ్‌గా వచ్చాయి.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125

సస్పెన్షన్ కోసం ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్ ఉంది. 5-లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి గల స్కూటర్ మొత్తం బరువు 116 కిలోలుగా ఉంది. 22-లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ మరియు 155ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్ కలదు.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్లో వచ్చిన అత్యంత కీలకమైన ఆవిష్కరణ సరికొత్త ఇంస్ట్రుమెంట్ క్లస్టర్. బ్లూటూత్ ద్వారా స్మార్ట్ ఫోన్‌ను ఈ డిస్ల్పేకు కనెక్ట్ చేసుకోవచ్చు. దీంతో బ్లూటూత్ అనుసంధానం గల భారత దేశపు తొలి స్కూటర్‌గా కూడా ఇదే నిలించింది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125

ఈ డిస్ల్పే, రైడింగ్ చేస్తున్నపుడు ఎస్ఎమ్ఎస్ అలర్ట్ ద్వారా ఆటో రీప్లే ఇస్తుంది, మిస్స్‌డ్ కాల్ అలర్ట్, న్యావిగేషన్ అసిస్ట్, చివరిసారిగా పార్క్ చేసిన ప్రదేశాన్ని గుర్తుంచుకోవడం, ఫోన్ సిగ్నల్ మరియు బ్యాటరీ స్థితి, ల్యాప్ టైమర్, టాప్ స్పీడ్ రికార్డర్ మరియు యావరేజ్ స్పీడ్ ఇంటికేటర్ వంటి ఎన్నో ఫీచర్లు దీని సొంతం.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125

శక్తివంతమైన ఇంజన్, గొప్ప పనితీరు, అద్భుతమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్లు... అన్నింటి కంటే సరసమైన ధరలో లభించడం. ఒక్కటేమిటి ఇలా ఎన్నో కారణాల దృష్ట్యా టీవీఎస్ ఎన్‌టార్క్ 125 హోండా గ్రాజియా స్కూటర్ కంటే మంచి ఎంపిక అని కస్టమర్ల చేత నిరూపించుకుంది.

టీవీఎస్ ఎన్‌టార్క్ మరియు హోండా గ్రాజియా పట్ల మరి మీ అభిప్రాయం ఏంటి? క్రింది కామెంట్ సెక్షన్ ద్వారా మాతో పంచుకోండి...

Most Read Articles

Read more on: #టీవీఎస్
English summary
Read In Telugu: TVS NTorq 125 Beats Honda Activa-based Grazia automatic scooter
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X