యుఎమ్ డ్యూటీ 230 బైకు విడుదలకు సర్వం సిద్దం

యుఎమ్ మోటార్‌సైకిల్స్ విపణిలోకి తమ సరికొత్త డ్యూటీ 230 బైకును సెప్టెంబర్‌లో లాంచ్ చేయడానికి సిద్దమైంది.పెనీ ప్రస్తుతం దేశీయంగా అమ్మకాలు మరియు వ్యాపార అవకాశాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది.

యుఎమ్ మోటార్‌సైకిల్స్ విపణిలోకి తమ సరికొత్త డ్యూటీ 230 బైకును లాంచ్ చేయడానికి సిద్దమైంది. వచ్చే సెప్టెంబర్‌లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానుంది. కంపెనీ ప్రస్తుతం దేశీయంగా అమ్మకాలు మరియు వ్యాపార అవకాశాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది.

యుఎమ్ డ్యూటీ 230 బైకు విడుదలకు సర్వం సిద్దం

2014లో యుఎమ్ ఇంటర్నేషనల్ సంస్థ లోహియా ఆటో ఉమ్మడి భాగస్వామ్యంతో యుఎమ్ లోహియా టూ వీలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఇండియన్ మార్కెట్లో కార్యకలాపాలు ప్రారంభించింది. కంపెనీ ప్రస్తుతం రెనిగేడ్ కమాండో క్లాసిక్, కమాండో మొజావే, కమాండో మరియు స్పోర్ట్స్ బైకులను విక్రయిస్తోంది. వీటి ధరల శ్రేణి రూ. 1.5 లక్షల నుండి రూ. 1.95 లక్షలుగా ఉంది.

యుఎమ్ డ్యూటీ 230 బైకు విడుదలకు సర్వం సిద్దం

వీటి సరసన ఇప్పుడు యుమ్ డ్యూటీ 230 మోటార్ సైకిల్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది. లోహియా ఆటో టూ వీలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిఇ రాజీవ్ మిశ్రా మాట్లాడుతూ, "సెప్టెంబర్ 2018 నాటికి 230సీసీ బైకును లాంచ్ చేయనున్నట్లు తెలిపాడు."

యుఎమ్ డ్యూటీ 230 బైకు విడుదలకు సర్వం సిద్దం

అంతే కాకుండా రానున్న రెండేళ్లలోపు 450సీసీ మరియు 650సీసీ కెపాసిటి గల మోటార్ సైకిళ్లను ప్రవేశపెట్టనున్నాము. దీంతో 2020 నాటికి యుఎమ్ ఇండియా విభాగంలో 230సీసీ నుండి 650సీసీ శ్రేణి మోటార్ సైకిళ్లు అందుబాటులో ఉంటాయని చెప్పుకొచ్చాడు.

యుఎమ్ డ్యూటీ 230 బైకు విడుదలకు సర్వం సిద్దం

తెలంగాణ రాష్ట్రంలోని హైదారాబాదులో నూతన ప్రొడక్షన్ ప్లాంటును నెలకొల్పి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని యుఎమ్ భావిస్తోంది. దక్షిణ మరియు పశ్చిమ ప్రాంతాల్లో యుఎమ్ మోటార్ సైకిళ్లకు ఉన్న డిమాండుకు సరిపడా ప్రొడక్షన్ చేపట్టనుంది.

యుఎమ్ డ్యూటీ 230 బైకు విడుదలకు సర్వం సిద్దం

హైదరాబాదులో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంటు నిర్మాణం కోసం తొలుత 50 కోట్ల రుపాయలు పెట్టుబడి పెట్టనుంది. భవిష్యత్తులో ఈ మోటార్ సైకిళ్లకు వచ్చే డిమాండుకు అనుగుణంగా ఎదురయ్యే రవాణా పరిమైన ఖర్చుల కోసం ఈ కూడా ఈ పెట్టుబడిని ఉపయోగించుకోనుంది.

యుఎమ్ డ్యూటీ 230 బైకు విడుదలకు సర్వం సిద్దం

ఈ నూతన ప్రొడక్షన్ ప్లాంటు యొక్క వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 50,000 యూనిట్లుగా ఉండనుంది. దీనిని 80,000 యూనిట్లకు పెంచుకునే లక్ష్యంతో ఉంది. యుఎమ్ మోటార్ సైకిల్స్ ప్రొడక్షన్ ప్లాంట్ నిర్మాణం ఫిబ్రవరి 2019 నాటికి పూర్తి చేసుకుని, పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.

యుఎమ్ డ్యూటీ 230 బైకు విడుదలకు సర్వం సిద్దం

ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో తయారయ్యే బైకులను దక్షిణ మరియు పశ్చిమ భారతదేశానికి సరఫరా చేస్తున్నాము. ఇందుకు అధిక సమయంతో పాటు ఖర్చు కూడా ఎక్కువ అవుతున్నట్లు రాజీవ్ చెప్పుకొచ్చాడు. హైదారాబాద్ ప్లాంటు అందుబాటులోకి వస్తే, దక్షిణ మరియు మధ్య భారతదేశ అవసరాలను ఇది తీర్చనుంది.

యుఎమ్ డ్యూటీ 230 బైకు విడుదలకు సర్వం సిద్దం

యుఎమ్ మోటార్ సైకిల్స్ ఇండియన్ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను లాంచ్ చేయాలని భావిస్తోంది. యుఎమ్ ఇప్పటికే గతంలో జరిగిన 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో లో యుఎమ్ థార్ బైకును లాంచ్ చేసింది.

యుఎమ్ డ్యూటీ 230 బైకు విడుదలకు సర్వం సిద్దం

ప్రస్తుతం యుఎమ్ థార్ ఎలక్ట్రిక్ బైకును పూర్తి స్థాయిలో ఇటలీ నుండి దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నారు. మరో ఏడాదిలో దేశీయంగా తయారైన విడి భాగాలతో దీనిని పూర్తి స్థాయిలో ఇక్కడే తయారు చేయనుంది. ఇండియాలో తయారైన విడి పరికరాలను వినియోగిస్తే వీటి ధరలు కూడా గణనీయంగా తగ్గుతాయి.

యుఎమ్ డ్యూటీ 230 బైకు విడుదలకు సర్వం సిద్దం

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

యుఎమ్ మోటార్ సైకిల్స్ మార్కెట్లో తమ ఉత్పత్తుల సంఖ్యను పెంచుకునే ఉద్దేశ్యంలో భాగంగా డ్యూటీ 230 బైకును విడుదల చేస్తోంది. అంతే కాకుండా రానున్న మూడు నెలల్లో ప్రస్తుతం ఉన్న 78 విక్రయ కేంద్రాలను 100 కు పెంచుకోవాలని భావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 15,000 యూనిట్లను విక్రయించాలనే లక్ష్యంతో ఉంది.

Most Read Articles

English summary
Read In Telugu: UM Motorcycles Duty 230 India Launch This Year — To Increase Product Portfolio In The Country
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X