ఆటో ఎక్స్‌పో 2018: యమహా YZF-R15 V3.0 విడుదల - ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఫోటోలు

Written By:

ఆటో ఎక్స్‌పో 2018: జపాన్ టూ వీలర్ల తయారీ దిగ్గజం యమహా 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదిక మీద సరికొత్త వైజడ్ఎఫ్ ఆర్15 వి3.0(YZF-R15 V3.0) బైకును విడుదల చేసింది. సరికొత్త యమహా వైజడ్ఎఫ్ ఆర్15 వి3.0 మోటార్ సైకిల్ ప్రారంభ ధర రూ. 1.25 లక్షలు ఉన్నట్లు యమహా ప్రతినిధులు వెల్లడించారు.

యమహా వైజడ్ఎఫ్ ఆర్15 వి3.0 గురించి పూర్తి విడుదల వివరాలు మరియు ఫోటోలు ఇవాళ్టి స్టోరీలో....

యమహా వైజడ్ఎఫ్ ఆర్15 వి3.0

భారతదేశపు 150సీసీ ఫుల్లీ ఫెయిర్డ్ మోటార్ సైకిల్ వైజడ్ఎఫ్ ఆర్15 బైకును అప్‌డేటెడ్ వెర్షన్‍‌లో కీలకమైన మార్పులు చేర్పులతో విపణిలోకి విడుదల చేసింది. ఢిల్లీలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో 2018లో ఆవిష్కరించి, విడుదల చేసిన ఈ మోడల్‌కు సందర్శకుల తాకిడి విపరీతంగా ఉంది. మరి ఇందులో ఉన్న ప్రత్యేకతలేంటో చూద్దామా...?

Recommended Video - Watch Now!
Auto Rickshaw Explodes In Broad Daylight
యమహా వైజడ్ఎఫ్ ఆర్15 వి3.0

యమహా విడుదల చేసిన వైజడ్ఎఫ్ ఆర్15 వి3.0లో 155సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 19.03బిహెచ్‌పి పవర్ మరియు 15ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

యమహా వైజడ్ఎఫ్ ఆర్15 వి3.0

యమహా వైజడ్ఎఫ్ ఆర్15 వి3.0లో గేర్లను క్రిందకు షిఫ్ట్ చేస్తున్నపుడు గేర్లు స్మూత్‌గా మారేందుకు అధునాతన స్లిప్పర్ క్లచ్ మరియు బైక్ ఓవరాల్ పర్ఫామెన్స్ మెరుగురిచే వివిఎ సిస్టమ్‍‌ను పరిచయం చేసింది.

యమహా వైజడ్ఎఫ్ ఆర్15 వి3.0

డిజైన్ పరంగా ఆర్15 వి3.0 చూడటానికి వైజడ్ఎఫ్-ఆర్1 మరియు వైజడ్ఎఫ్-ఆర్6 బైకులనే పోలి ఉంటుంది. ఈ మోటార్ సైకిల్‌లో ముందు వైపున సరికొత్త ఎయిర్ ఇంటేకర్‌తో వచ్చింది. పెద్ద పరిమాణంలో ఉన్న టైర్లు, కొత్త డిజైన్‌లో ఉన్న ఫ్రంట్ హెడ్ ల్యాంప్ మరియు రియర్ టెయిల్ సెక్షన్‌ ఉన్నాయి.

యమహా వైజడ్ఎఫ్ ఆర్15 వి3.0

సరికొత్త యమహా వైజడ్ఎఫ్ ఆర్15 వి3.0 బైకులో అధునాతన డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఇది గేర్ పొజిషన్ మరియు 18 రకాల ఇతర సమాచారాన్ని రైడర్‌కు అందిస్తుంది. అంతే కాకుండా సరికొత్త ఎగ్జాస్ట్ సిస్టమ్‌ కూడా ఆర్15కు కొత్త రూపాన్ని తీసుకొచ్చింది.

యమహా వైజడ్ఎఫ్ ఆర్15 వి3.0

ఇండియాలో అత్యంత ఆదరణ పాపులర్ ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ మోటార్ సైకిల్‌ వైజడ్ఎఫ్ ఆర్15 వి3.0 నూతన వెర్షన్‌లో వచ్చినప్పటికీ. ఇండియన్ మోడల్‌లో అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్లను యమహా అందివ్వలేకపోయింది.

యమహా వైజడ్ఎఫ్ ఆర్15 వి3.0

నూతన యమహా ఆర్15 వి3.0 బైకును రెండు విభిన్న రంగుల్లో ఎంచుకోవచ్చు. అవి, రేసింగ్ బ్లూ మరియు థండర్ గ్రే. ఆర్15లో ప్రధానంగా గుర్తించదగిన అతి ముఖ్యమైన మార్పు దీని ఫ్రంట్ లుక్ అచ్చం ఆర్1 సూపర్ బైకును పోలి ఉండటం.

యమహా వైజడ్ఎఫ్ ఆర్15 వి3.0

పైన పేర్కొన్న మార్పులు, చేర్పులు మినహాయిస్తే మిగతా అన్ని అంశాల పరంగా ఈ ఆర్15 వి3.0 మునుపటి వెర్షన్ ఆర్15 తరహానే ఉంటుంది. అయితే, కాలం ముందుకెళ్లేకొద్ది అవుట్ డేటెడ్ మోడల్ అనే ముద్ర పడకుండా యమహా దీనిని అప్‌డేటెడ్ వెర్షన్‌లో విడుదల చేసింది.

యమహా వైజడ్ఎఫ్ ఆర్15 వి3.0

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సరికొత్త ఆర్15 వి3.0 బైకు యమహా లైనప్‌లో ఉన్న ఆర్6 మరియు ఆర్1 సూపర్ బైకుల తరహా ఫ్రంట్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది ఆర్15 ఫ్యాన్స్‌కు ఎంతో గర్వకారణం అని చెప్పుకోవచ్చు. అంతే కాకుండా ఈ నూతన ఆర్15 వి3.0 లోని ఇంజన్ మునుపటి ఇంజన్ కంటే అత్యుత్తమ పవర్ మరియు టార్క్ ఇస్తుంది. అంటే అదే బడ్జెట్ ధరలో బెస్ట్ స్పోర్ట్స్ బైక్ ఆర్15 అని చెప్పవచ్చు.

యమహా వైజడ్ఎఫ్ ఆర్15 వి3.0

H5X ఎస్‌యూవీతో ఆవిష్కరణతో దిగ్గజాలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన టాటా మోటార్స్

ఆటో ఎక్స్‌పో 2018: ఫ్యూచర్‌ను గుప్పిట్లో పెట్టుకునేందుకు మారుతి ప్రయత్నం

ఆటో ఎక్స్‌పో 2018: అప్రిలియా SR 125 స్కూటర్ విడుదల - ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఫోటోలు

ఆటో ఎక్స్‌పో 2018: ఎలైట్ ఐ20 ఫేస్‌లిఫ్ట్ విడుదల చేసిన హ్యుందాయ్

English summary
Read In Telugu: Auto Expo 2018: Yamaha YZF-R15 V3.0 Launched At Rs 1.25 Lakh - Specifications, Features & Images
Story first published: Wednesday, February 7, 2018, 19:06 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark