TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
ఆటో ఎక్స్‌పో 2018: సరికొత్త యమహా ఆర్3 విడుదల- ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఫోటోలు

ఆటో ఎక్స్‌పో 2018: యమహా ఇండియా విభాగం విపణిలోకి సరికొత్త ఆర్ సూపర్ బైకును విడుదల చేసింది. యమహా ఆర్3 ప్రారంభ ధర రూ. 3.48 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.
న్యూ యమహా ఆర్3 బైకులో ఇంజన్, డిజైన్, ఫీచర్ల పరంగా చాలా మార్పులు చోటు చేసుకున్నా. యమహా ఆర్3 గురించి పూర్తి వివరాలతో పాటు ఫోటోలు ఇవాళ్టి కథనంలో...
యమహా సాంకేతికంగా తమ 2018 ఆర్3 బైకులో 321సీసీ కెపాసిటి గల గల ఇన్-లైన్ ట్విన్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. మునుపటి ఆర్3లో కూడా ఇదే ఉండేది, అయితే దాని స్థానంలో బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌ను అందించింది.
ఆర్3 లోని అధునాతన బిఎస్-IV పెట్రోల్ ఇంజన్ 10,750ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 41బిహెచ్‌పి పవర్ మరియు 9,000ఆర్‌పిఎమ్ వద్ద 29.6ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.
సస్పెన్షన్ కోసం సరికొత్త 2018 యమహా ఆర్3 బైకులో ముందువైపున అదే 41ఎమ్ఎమ్ కయాబా ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున ప్రిలోడ్-అడ్జస్టబుల్ మోనోషాక్ అబ్జార్వర్ ఉన్నాయి.
మెరుపు వేగంతో దూసుకెళ్లే యమహా ఆర్3లో బ్రేకింగ్ డ్యూటీ నిర్వర్తించడానికి ఫ్రంట్ వీల్‌కు 298ఎమ్ఎమ్ చుట్టుకొలత గల డిస్క్ మరియు రియర్ వీల్‌కు 220ఎమ్ఎమ్ చుట్టుకొలత గల డిస్క్ బ్రేక్ అందించింది.
సురక్షితమైన రైడింగ్ కోసం యమహా ఎట్టకేలకు తమ 2018 ఆర్3 మోడల్‌లో డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అందించింది. ఎంతో కాలంలో ఇండియన్ మార్కెట్లో ఏబ్ఎస్ లేకుండా లభించేది. వీల్ లాక్, స్కిడ్ మరియు స్లిప్‌ను అరికట్టడంలో ఏబిఎస్ పనితీరు అద్భుతం అని చెప్పాలి.
2018 యమహా ఆర్3 బైకులో జరిగిన ఇతర ప్రధాన మార్పుల్లో 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు పటిష్టమైన మెట్జలర్ స్పోర్టెక్ ఎమ్5 టైర్లు ఉన్నాయి. ఫ్రంట్ వీల్‌కు 110/70 ఆర్17 మరియు రియర్ వీల్‌కు 140/70 కొలతల్లో ఉన్న రబ్బర్ టైర్లు ఉన్నాయి.
2018 యమహా ఆర్3లో డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఫ్రంట్ డిజైన్‌లో అదే మునుపటి ట్విన్ పోడ్ హెడ్‌ల్యాంప్, ఇరు ప్రక్కలా విశాలమైన ఫెయిరింగ్ డీకాల్స్ ఉన్నాయి.
అదే విధంగా సెమీ-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ కలదు. ఇది బైక్‌కు సంభందించిన కూలింగ్ ఆయిర్ ఉష్ణోగ్రత, డ్యూయల్ ట్రిప్ మీటర్లుస, ప్రస్తుతం మరియు సగటు మైలేజ్ ఇంకా ఎన్నో వివరాలను రైడర్‌కు తెలియజేస్తుంది.
సరికొత్త యమహా ఆర్3 నూతన బాడీ గ్రాఫిక్స్ మరియు రెండు విభిన్న కలర్ ఆప్షన్స్ పొందింది. అవి, రేసింగ్ బ్లూ మరియు మ్యాగ్మా బ్లాక్.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
యమహా ఇండియా తమ ఆర్3 బైకులో కాస్మొటిక్స్ మరియు మెకానికలప్ పరంగా అప్‌డేట్స్ చేసింది. అందులో ప్రధానంగా, డ్యూయల్ ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు మెట్జలర్ టైర్లు ఉన్నాయి.
ఇదే సెగ్మెంట్లో ఉన్న టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 మరియు కెటిఎమ్ ఆర్‌సి 390 బైకుల్లో అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ రాలేదు. భారీ ధరల శ్రేణిలో ఉండటం, దీని కంటే సరసమైన మోడళ్లు మంచి ఫీచర్లు ఉండటం మరియు ధరల తగ్గవిలువలతో లభిస్తుండటంతో యమహా ఆర్3 విక్రయాలు కాస్త కష్టమనే చెప్పాలి.