చేతక్ స్కూటర్ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న బజాజ్

బజాజ్ ఆటో తమ పురాతణ స్కూటర్ బ్రాండ్ "చేతక్"ను మళ్లీ తీసుకొచ్చింది. చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇటీవల దేశీయంగా ఆవిష్కరించింది. అయితే, చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విషయమై బజాజ్ ఆటో సంచలన నిర్ణయం తీసుకుంది. అవును, చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బజాజ్ షోరూముల్లో కాకుండా కెటిఎమ్ షోరూముల్లో విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. చేతక్‌ను ఖరీదైన స్కూటర్‌గా విక్రయించాలంటే అందుకు కెటిఎమ్ షోరూములే సైరన ఆప్షన్ బజాజ్ ఈ నిర్ణయానికి వచ్చింది.

చేతక్ స్కూటర్ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న బజాజ్

బజాజ్ ఆటో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ "చేతక్"ను ఆవిష్కరించింది, ఇది వెస్పా డిజైన్‌కు చాలా దగ్గరగా పోలి ఉంటుంది. ఇండియన్ మార్కెట్లోకి పూర్తి స్థాయిలో విడుదల చేసే ముందు తొలు పూనే ఆ తర్వాత బెంగళూరులో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రయోగాత్మకంగా విడుదల చేయనుంది.

చేతక్ స్కూటర్ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న బజాజ్

కెటిఎమ్ కంపెనీకి చెందిన హస్క్‌వర్న్ మోటార్ సైకిళ్లను విక్రయించేందుకు కెటీఎమ్ షోరూములను చక్కగా ఏర్పాటు చేశారు. కస్టమర్లు ప్రీమియం ఫీలింగ్ కలిగించేందుకు సాధారణ బజాజ్ షోరూముల్లో కాకుండా బజాజ్ భాగస్వామ్యపు ఒప్పందం కుదుర్చుకున్న కేటీఎమ్ డీలర్ల ద్వారానే చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విక్రయించాలనే భావిస్తోంది.

చేతక్ స్కూటర్ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న బజాజ్

సరికొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో NCA సెల్స్ గల వాటర్ ప్రూఫ్ లిథియం-అయాన్ బ్యాటరీ కలదు. ఇందులో ఇకో మరియు స్పోర్ట్ అనే రెండు విభిన్న రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఈ మోడ్స్ 95కిమీలు మరియు 85కిమీల రేంజ్ కలిగి ఉన్నాయి. చేతక్ ఎలక్ట్రిక్‌లో ఉన్న రివర్స్ అసిస్ట్ మోడ్ ద్వారా ఎలాంటి బలం ప్రయోగించకుండానే రివర్స్ అసిస్ట్ ద్వారా స్కూటర్‌ను వెనక్కి నడపించవచ్చు.

చేతక్ స్కూటర్ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న బజాజ్

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లో గుండ్రటి ఆకారంలో ఉన్న ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, డే టైమ్ రన్నింగ్ లైట్లు, రైడర్‌కు ముందువైపున పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి డిజిటల్ ఇంస్ట్రుమెంట్ అత్యంత ఆకర్షణీయంగా ఉంది. కమ్యూనికేషన్, సెక్యురిటీ మరియు యూజర్ అథెంటికేషన్ కోసం ప్రత్యేకమైన మొబిలిటీ సాఫ్ట్‌వేర్ కూడా ఇన్‌స్టార్ చేశారు.

చేతక్ స్కూటర్ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న బజాజ్

చేతక్ స్కూటర్‌లో సస్పెన్షన్ పరంగా ముందు వైపున సింగల్ సైడ్ ట్యూబులర్ సస్పెన్షన్ మరియు వెనుక వైపున మోనో-షాక్ అబ్జార్ కలదు. సింగల్ సైడ్ క్యాస్ట్ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ మీద నిర్మించిన చేతక్ 12-అంగుళాల చక్రాల మీద పరుగులు పెడుతుంది. బ్రేకింగ్ డ్యూటీ కోసం ముందు వైపు డిస్క్ బ్రేక్, వెనుక చక్రానికి డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి.. ఇందులో రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది.

చేతక్ స్కూటర్ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న బజాజ్

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం చేతక్ స్కూటర్ పూర్తిగా మెటల్ బాడీతో వస్తున్నట్లు తెలిసింది, కానీ ఎలక్ట్రిక్ మోటార్ యొక్క లాగే సామర్థ్యం తగ్గిపోయే అవకాశం ఉంది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పూర్తి స్థాయిలో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేస్తే దీని ధర సుమారుగా రూ. 95,000 నుండి రూ. 1.35 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉండవచ్చు.

చేతక్ స్కూటర్ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న బజాజ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బజాజ్ ఆటో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఫ్యూచర్‌ను దృష్టిలో ఉంచుకొని అభివృద్ది చేసింది. అడ్వాన్స్‌డ్ డిజైన్, అత్యాధునిక టెక్నాలజీ మరియు ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రావడంతో ధర కాస్త ఎక్కువగానే ఉండవచ్చు. అయితే, బజాజ్ సాధరణ డీలర్ల ద్వారా ఈ స్కూటర్ విక్రయాలు చేపట్టడం అంత లాభదాయకం కాకపోవచ్చు. బడ్జెట్ టూ వీలర్లను విక్రయించే వాతావరణంలో ఖరీదైన మోడళ్లను విక్రయించి అంత సులభం కాదు. ఈ నేపథ్యంలో బజాజ్ భాగస్వామ్యంతో దేశీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కేటీఎమ్ ద్వారా తమ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విక్రయించాలని బజాజ్ ఆటో భావించింది.

Most Read Articles

English summary
Bajaj Chetak Electric Scooter To Be Sold Via KTM Dealerships. Read in Telugu.
Story first published: Thursday, October 31, 2019, 11:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X