విపణిలోకి క్రెయాన్ ఎన్వి ఎలక్ట్రిక్ స్కూటర్: టెక్నాలజీలో రారాజు

క్రెయాన్ మోటార్స్ - ఢిల్లీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ, విపణిలోకి మరో కొత్త స్కూటర్‌ను రిలీజ్ చేసింది. "క్రెయాన్ ఎన్వి" కంపెనీ యొక్క లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్, మోడ్రన్ డిజైన్ మరియు ఎన్నో అత్యాధునిక ఫీచర్లు ఇంకా ఎన్నో ప్రత్యేకతలున్నాయి.

విపణిలోకి క్రెయాన్ ఎన్వి ఎలక్ట్రిక్ స్కూటర్: టెక్నాలజీలో రారాజు

స్కూటర్ డిజైన్‌తో మొదలుపెడితే, క్రెయాన్ ఎన్వి ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ ఏప్రాన్‌లో డ్యూయల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ చూడొచ్చు. అంతే కాకుండా ఇందులో ఎల్ఈడీ ఇండికేటర్లు హ్యాండిల్ బార్‌‌లో పక్కనే స్టైలిష్‌గా అందించారు.

విపణిలోకి క్రెయాన్ ఎన్వి ఎలక్ట్రిక్ స్కూటర్: టెక్నాలజీలో రారాజు

క్రెయాన్ ఎన్వి ఇ-స్కూటర్ బాడీ మీదున్న పదునైన డిజైన్ లైన్స్ స్కూటర్‌కు స్పోర్టివ్ ఫీలింగ్ తీసుకొచ్చాయి. స్కూటర్‌లోని పొడవాటి, విశాలమైన పెద్ద సీటు సౌకర్యవంతమైన రైడింగ్ కల్పిస్తుంది. వెనుక వైపున కూర్చున్న వారికి సపోర్ట్‌నిచ్చేందుకు బ్యాక్ రెస్ట్ కూడా అందించారు.

విపణిలోకి క్రెయాన్ ఎన్వి ఎలక్ట్రిక్ స్కూటర్: టెక్నాలజీలో రారాజు

ఫీచర్ల విషయానికి వస్తే, కీలెస్ ఇగ్నిషన్, సెంట్రల్ లాకింగ్, ఫుల్లీ-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు రివర్స్ అసిస్ట్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు, జియో-ట్యాగింగ్, 2.1 యుఎస్‌బి పోర్ట్ మొబైల్ ఛార్జింగ్, సైడ్ స్టాండ్ సెన్సార్, అల్లాయ్ వీల్స్ మరియు విశాలమైన బూట్ స్పేస్ వంటివి ఉన్నాయి.

విపణిలోకి క్రెయాన్ ఎన్వి ఎలక్ట్రిక్ స్కూటర్: టెక్నాలజీలో రారాజు

సాంకేతికంగా క్రెయాన్ ఎన్వి ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని 240-వాట్ సామర్థ్యం ఉన్న BLDC ఎలక్ట్రిక్ మోటార్‌కు 48V VRLA (వాల్ట్ రెగ్యులేటెడ్ లెడ్ యాసిడ్) బ్యాటరీ అనుసంధానం కలదు. ఈ స్కూటర్ 60V లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో కూడా లభిస్తోంది. సింగల్ ఛార్జింగ్‌తో 70కిమీ మైలేజ్‌నిచ్చే దీని గరిష్ట వేగం గంటకు 25కిమీలు.

విపణిలోకి క్రెయాన్ ఎన్వి ఎలక్ట్రిక్ స్కూటర్: టెక్నాలజీలో రారాజు

మెరుగైన బ్రేకింగ్ సిస్టమ్ కోసం ముందు వైపున డిస్క్, వెనుక వైపున డ్రమ్ బ్రేకులు ఉన్నాయి. క్రెయాన్ ఎన్వి ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఇ-ఏబిఎస్ (ఎలక్ట్రానిక్ అసిస్టెడ్ బ్రేకింగ్ సిస్టమ్) మరియు రీజనరేటివ్ బ్రేకింట్ సిస్టమ్ ఉన్నాయి.

కస్టమర్లు దీనిని సూపర్ వైట్, సూతింగ్ బ్లూ మరియు ఫిస్టి ఆరేంజ్ వంటి మూడు విభిన్న రంగుల్లో ఎంచుకోవచ్చు.

విపణిలోకి క్రెయాన్ ఎన్వి ఎలక్ట్రిక్ స్కూటర్: టెక్నాలజీలో రారాజు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

క్రెయాన్ ఎన్వి ఎలక్ట్రిక్ స్కూటర్ క్రెయాన్ ఎన్వి మోటార్స్ బ్రాండ్ యొక్క రెండవ స్కూటర్. ఇది ఎన్వి మోటార్స్ కంపెనీ యొక్క లో-స్పీడ్ రేంజ్ స్కూటర్. ప్రస్తుతం హై-స్పీడ్ రేంజ్ స్కూటర్ల అభివృద్ది మీద పనిచేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. క్రెయాన్ ఎన్వి మార్కెట్లో ఉన్న ఎవన్ ట్రెండ్ ఇ ఎలక్ట్రిక్ స్కూటర్ సిరీస్‌కు గట్టి పోటీనిస్తోంది.

Most Read Articles

English summary
Crayon Envy Electric Scooter Launched In India: New Low-Speed EV From Delhi-Based Start-Up. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X