బిఎస్-6 ద్విచక్ర వాహనాల అమ్మకాలలో 60,000 యూనిట్ల మైలురాయి దాటి కొత్త శకాన్ని ప్రారంభించనున్న హోండా!

భారత మార్కెట్లో బాగా ప్రసిద్ధి చెందిన సంస్థల్లో హోండా ఒకటి. ఇప్పుడు హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్స్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) అమ్మకాలలో ఒక కొత్త మైలురాయిని దాటింది. మార్కెట్లో వచ్చిన తమ రెండు బిఎస్6 ప్రోడక్ట్ ఆఫర్ల అమ్మకాలలో ఇప్పుడు దాదాపుగా 60,000 యూనిట్ల మైలురాయిని దాటి ఒక కొత్తశకానికి నాంది పలుకుతోంది.

బిఎస్-6 ద్విచక్ర వాహనాల అమ్మకాలలో 60,000 యూనిట్ల మైలురాయి దాటి కొత్త శకాన్ని ప్రారంభించనున్న హోండా!

హోండా యాక్టివా నుంచి విడుదలైన రెండు వాహనాలు, ఒకటి యాక్టివా 125 స్కూటర్ రెండు హోండా ఎస్పి 125 . ఈ వాహనాలకు భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వీటి అమ్మకాలు రోజు రోజు కి బాగా పెరుగుతున్నాయి. హొండా మార్కెట్లో ఒక నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించింది అనటంలో సందేహం లేదు.

బిఎస్-6 ద్విచక్ర వాహనాల అమ్మకాలలో 60,000 యూనిట్ల మైలురాయి దాటి కొత్త శకాన్ని ప్రారంభించనున్న హోండా!

హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యాద్వీందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ కస్టమర్లు హోండా బ్రాండ్ మీద నమ్మకం పెంచుకున్నందుకు ధన్యవాదాలు. ఎందుకంటే హోండా నుంచి విడుదలైన రెండు బ్రాండ్లను బాగా ఆదరించారు. బిఎస్-6 యుగం పరివర్తన చెందుతున్న క్రమంలో హోండా యొక్క మొదటి రెండు మోడళ్ళు సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వెళుతున్నాయి.

బిఎస్-6 ద్విచక్ర వాహనాల అమ్మకాలలో 60,000 యూనిట్ల మైలురాయి దాటి కొత్త శకాన్ని ప్రారంభించనున్న హోండా!

హోండా యాక్టివా125 స్కూటర్ మరియు హోండా ఎస్పి 125 లు అధునాతన లక్షణాలను కలిగి ఉన్నాయి. దీనితో పాటు అత్యుత్తమ మైలేజ్ ని అందిస్తుంది. ఈ వాహనాలకు కంపెనీ మొదటి 6 సంవత్సరాల వారంటీ కల్పిస్తుంది. అఖిల భారత మార్కెట్ లభ్యతను ఇంకా పూర్తి చేయనప్పటికీ బిఎస్-6 మార్చి 2020 నాటికి దాదాపు 60,000 యూనిట్ల మైలురాయిని దాటుతుందని కంపెనీ వర్గాల నమ్మకం. ఎందుకంటే బిఎస్-6 యుగంలో భారతీయ వినియోగ దారులు హొండాపై పెట్టుకున్న నమ్మకమే దీనికి నిదర్శనం.

బిఎస్-6 ద్విచక్ర వాహనాల అమ్మకాలలో 60,000 యూనిట్ల మైలురాయి దాటి కొత్త శకాన్ని ప్రారంభించనున్న హోండా!

హోండా నుండి విడుదలైన రెండు కొత్త ఉత్పత్తులలో ఒకటైన హోండా యాక్టివా 125 బిఎస్ 6 స్కూటర్ అనేది 124సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ యొక్క నవీకరించబడిన సంస్కరణ. కొత్త బిఎస్ 6 స్కూటర్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర 67,490 రూపాయలు ఉంటుంది.

బిఎస్-6 ద్విచక్ర వాహనాల అమ్మకాలలో 60,000 యూనిట్ల మైలురాయి దాటి కొత్త శకాన్ని ప్రారంభించనున్న హోండా!

హోండాలో మరొక వాహనమైన హోండా ఎస్పి 125 బిఎస్ 6 భారత మార్కెట్లో ఇది సరికొత్త ప్రయాణికుల మోటార్ సైకిల్ అని చెప్పవచ్చు. కొత్త హోండా ఎస్పి 125 యొక్క ఇంజిన్ అప్‌డేటెడ్ వెర్షన్‌తో వస్తుంది. ఎస్పి 125 కూడా ఆరు ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ పరికరాలతో మాత్రమే కాకుండా అనేక ఇతర ఫీచర్లతో వస్తుంది. ఇందులోని ఇంజిన్ స్టార్ట్ / స్టాప్ స్విచ్ ని కిలిగి ఉండి, ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్స్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ప్రధాన హెడ్‌ల్యాంప్ యూనిట్‌తో అనుసంధానించబడిన పాస్ లైట్లు మరియు పూర్తి-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లను కలిగి ఉండటమే కాకుండా మంచి మైలేజ్ ని కూడా ఇస్తుంది.

బిఎస్-6 ద్విచక్ర వాహనాల అమ్మకాలలో 60,000 యూనిట్ల మైలురాయి దాటి కొత్త శకాన్ని ప్రారంభించనున్న హోండా!

హోండా ఎస్పి 125 రెండు వేరియంట్లలో అందించబడుతుంది మరియు ప్రారంభ ధర రూ. 72,900 వరకు ఉంటుంది. ఇప్పుడు ఎస్పీ 125 ను నాలుగు కలర్ ఆప్షన్స్‌తో అందిస్తున్నారు. ఇందులో స్ట్రైకింగ్ గ్రీన్, మాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్ మరియు పెర్ల్ సైరన్ బ్లూ ఉన్నాయి.

Read More:త్వరపడండి ఇప్పుడు విరాట్ కోహ్లీ లగ్జరీ కారుని సొంతం చేసుకోవడానికి ఇదే సువర్ణ అవకాశం

బిఎస్-6 ద్విచక్ర వాహనాల అమ్మకాలలో 60,000 యూనిట్ల మైలురాయి దాటి కొత్త శకాన్ని ప్రారంభించనున్న హోండా!

హోండా బిఎస్ 6 బైక్‌లు & స్కూటర్ అమ్మకాలపై ఆలోచనలు:

హోండా యొక్క కొత్త కఠినమైన బిఎస్ 6 ఉద్గార నిబంధనలను 2020 ఏప్రిల్ 1 నుండి భారత మార్కెట్లో అమలు చేయనున్నాయి. వీటిని అమలు చేయడానికంటే ముందు వాహనాలను తగినన్ని కొత్త మార్పులతో నవీనీకరించడానికి కృషి చేయాలి. తమ బ్రాండ్ యొక్క మంచి అమ్మకాలకోసం ప్రారంభ స్వీకరణను హోండా సద్వినియోగం చేసుకుంటున్నట్లు మనకు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇప్పుడు మార్కెట్లో హోండా వాహనాలకు మంచి గిరాకీ ఉంది.

Read More:ఫాస్ట్ ట్యాగ్ లు అమలు చేసినప్పటికీ బెంగుళూరులో తగ్గని ట్రాఫిక్

Most Read Articles

English summary
Honda BS-VI Two-Wheeler Sales Achieves New Milestone: Crosses 60,000 Units Since Launch-Read in Telugu
Story first published: Thursday, December 26, 2019, 10:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X