డ్యూయల్ ఛానల్ ఏబిఎస్‌తో వస్తున్న జావా కొత్త బైకులు

భారతదేశపు అత్యంత పురాతణ ద్విచక్ర వాహన తయారీ సంస్థ క్లాసిక్ లెజెండ్స్ ఒకానొక కాలంలో దివాలా తీసిన సంగతి తెలిసిందే. అయితే, మార్కెట్లో జావా మోటార్ సైకిళ్లకు ఉన్న డిమాండ్ మరియు ఓల్డ్ స్టైల్ క్లాసిక్ బైకులు సేల్స్ ఆశాజనకంగా ఉండటంతో దేశీయ ఆటోమోటివ్ దిగ్గజం మహీంద్రా గ్రూపు జావా బైకులను తయారు చేసే క్లాసిక్ లెజెండ్స్ సంస్థను కొనుగోలు చేసి పునరుద్దరించింది.

డ్యూయల్ ఛానల్ ఏబిఎస్‌తో వస్తున్న జావా కొత్త బైకులు

జావా పాత కాలం నాటి స్టైలింగ్ మరియు అత్యాధునిక ఇంజన్‌లతో జావా మరియు జావా ఫార్టీ టూ అనే రెండు మోడళ్లను విపణిలోకి విడుదల చేసి కస్టమర్లకు డెలివరీలు కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే వీటిలో అత్యంత కీలకమైన డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అందిస్తామని గత ఏడాది డిసెంబర్‌లో సంస్థ సీఈఓ ప్రకటించారు.

డ్యూయల్ ఛానల్ ఏబిఎస్‌తో వస్తున్న జావా కొత్త బైకులు

జావా మరియు జావా ఫార్టీ టూ డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ మోడళ్లను పూర్తి స్థాయిలో సిద్దం అయ్యాయని, అతి త్వరలోనే వీటిని డెలివరీ ఇస్తామని.. సోషల్ మీడియా ద్వారా ఓ కస్టమర్ నుండి ఎదురైన ప్రశ్నకు క్లాసిక్ లెజెండ్స్ సంస్థ సీఈఓ అనుపమ్ థారేజా స్పష్టం చేశారు.

డ్యూయల్ ఛానల్ ఏబిఎస్‌తో వస్తున్న జావా కొత్త బైకులు

డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ గల జావా బైకుల డెలివరీలను అతి త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు తప్పితే... ఏ తేదీ నుండి అనే క్లారిటీ ఇవ్వలేదు. అంతే కాకుండా, జావా సంస్థ ఇప్పటి వరకు ఎన్ని బైకులను విక్రయించింది, ఎన్ని బుకింగ్స్ జరిగాయనే విషయాన్ని ఇంత వరకు వెల్లడించకుండా గోప్యంగా ఉంచింది.

డ్యూయల్ ఛానల్ ఏబిఎస్‌తో వస్తున్న జావా కొత్త బైకులు

జావా మోటార్ సైకిళ్లను ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని పితంపూర్‌లో ఉన్న మహీంద్రా ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ జావా మరియు జావా ఫార్టీ టూ అనే రెండు మోడళ్లను తయారు చేస్తున్నారు.

డ్యూయల్ ఛానల్ ఏబిఎస్‌తో వస్తున్న జావా కొత్త బైకులు

జావా మరియు జావా ఫార్టీ టూ రెండు క్లాసిక్ బైకుల్లో 293సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ లిక్విడ్ కూలింగ్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 27బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండింటిలో కూడా పాత డిజైన్ డీఎన్‌ఏ మరియు నూతన టెక్నాలజీ జోడింపుతో క్లాసిక్ స్టైలో ఉన్నాయి. గుండ్రటి ఆకారంలో ఉన్న హెడ్ ల్యాంప్, బ్లాక్ ఫినిషింగ్ గల ఎలిమెంట్స్ ఎంతగానో ఆకట్టుకుంటాయి.

డ్యూయల్ ఛానల్ ఏబిఎస్‌తో వస్తున్న జావా కొత్త బైకులు

డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ జావా బైకు ధర రూ. 1.72 లక్షలు మరియు జావా ఫార్టీ టూ బైకు ధర రూ. 1.63 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉన్నట్లు క్లాసిక్ లెజెండ్స్ సంస్థ పేర్కొంది. సింగల్ ఛానల్ ఏబీఎస్ ఉన్నవాటితో పోల్చితే వీటి ధరలు రూ. 8,000 వరకు ఎక్కువగా ఉంది.

Most Read Articles

English summary
Jawa & Jawa Forty-two dual-channel abs deliveries to start this month. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X