కెటిఎమ్ నుండి 390 అడ్వెంచర్ మోటార్ సైకిల్: ధర, మైలేజ్, ఫీచర్లు

కెటిఎమ్ ఎట్టకేలకు తమ 390 అడ్వెంచర్ మోటార్ సైకిల్‌ను ఐక్మా 2019 (EICMA) మోటార్ సైకిల్ షోలో ఆష్కరించింది. విడుదలకు ఎంతో కాలంగా వేచి చూస్తున్న మోడళ్లలో కెటిఎమ్ 390 అడ్వెంచర్ ఒకటి. కెటిఎమ్ 390 అడ్వెంచర్ బైకును పలు ఈవెంట్లలో అక్కడక్కడ ప్రదర్శించింది.

కెటిఎమ్ నుండి 390 అడ్వెంచర్ మోటార్ సైకిల్: ధర, మైలేజ్, ఫీచర్లు

ఇండియన్ కస్టమర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మోడళ్లలో ఒకటైన కెటిఎమ్ 390 అడ్వెంచర్ బైకు అతి త్వరలో ఇండియన్ మార్కెట్లో విక్రయాలకు సిద్దమగా విడుదల కానుంది. 390 డ్యూక్ స్ట్రీట్ ఫైటర్ బైక్ యొక్క ఆఫ్-రోడ్ వెర్షన్ ఈ 390 అడ్వెంచర్ మోడల్. డిసెంబర్‌లో జరిగే ఇండియా బైక్ వీక్ 2019 ఈవెంట్లో దీనిని విడుదల చేసే అవకాశం ఉంది.

కెటిఎమ్ నుండి 390 అడ్వెంచర్ మోటార్ సైకిల్: ధర, మైలేజ్, ఫీచర్లు

కెటిఎమ్ 390 అడ్వెంచర్ బైకులో కూడా 390 డ్యూక్‌ మరియు 390 ఆర్సీ బైకుల్లో ఉన్నటువంటి అదే 373.2సీసీ కెపాసిటీ గల సింగల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ గల ఈ ఇంజన్ గరిష్టంగా 44బిహెచ్‌పి పవర్ మరియు 37ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

కెటిఎమ్ నుండి 390 అడ్వెంచర్ మోటార్ సైకిల్: ధర, మైలేజ్, ఫీచర్లు

అయితే, 390 అడ్వెంచర్ బైకులో బిఎస్-6 ఇంజన్ వస్తుందా లేదంటే మునుపటి బిఎస్-4 వెర్షన్ఇంన్ ఉంటుందా అనే విషయం గురించి కెటిఎమ్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ అప్‌డేటెడ్ ఇంజన్‌తో వస్తే బిఎస్-6 ప్రమాణాలను పాటించే ఇంజన్‌తో వస్తున్న తొలి కెటిఎమ్ బైక్ 390 అడ్వెంచర్‌.

కెటిఎమ్ నుండి 390 అడ్వెంచర్ మోటార్ సైకిల్: ధర, మైలేజ్, ఫీచర్లు

390 డ్యూక్ స్ట్రీట్ ఫైటర్‌తో పోల్చుకుంటే తేడా ఉండేందుకు పొడవైన వీల్‌బేస్, ఎత్తైన గ్రౌంజ్ క్లియరెన్స్, ఎత్తైన సీటు, అతి పెద్ద ఫ్యూయల్ ట్యాంక్, ఓవరాల్‌గా అత్యధిక బరువు మరియు హ్యాండిల్ ఇందులో ఉన్న ప్రధాన ప్రత్యేకతలని చెప్పవచ్చు.

కెటిఎమ్ నుండి 390 అడ్వెంచర్ మోటార్ సైకిల్: ధర, మైలేజ్, ఫీచర్లు

అడ్వెంచర్ వెర్షన్ 390 మోటార్ సైకిల్‌లో 200ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్ కలదు. దీంతో సీటు ఎత్తు కూడా పెరిగి గ్రౌండ్ నుండి 855ఎమ్ఎమ్ ఎత్తులో సీటు ఉంది. 390 అడ్వెంచర్ బైకులో లాంగ్ అండ్ ఆఫ్ రోడ్ రైడింగ్స్ అనువుగా ఉండేందుకు 14.5-లీటర్ల కెపాసిటీ గల పెట్రోల్ ట్యాంక్ ఉంది. 158కేజీల బరువుతో 390 డ్యూక్ బైకు కంటే కాస్త అధిక బరువు ఉంది.

కెటిఎమ్ నుండి 390 అడ్వెంచర్ మోటార్ సైకిల్: ధర, మైలేజ్, ఫీచర్లు

కెటిఎమ్ 390 అడ్వెంచర్ టైర్లు మరియు సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు వైపున 19-ఇంచుల టైర్ 100/90 ప్రొఫైల్ మరియు వెనుక వైపున 17-ఇంచుల టైర్ 130/80 ప్రొఫైల్‍తో ఉన్నాయి.

కెటిఎమ్ నుండి 390 అడ్వెంచర్ మోటార్ సైకిల్: ధర, మైలేజ్, ఫీచర్లు

సస్పెన్షన్ డ్యూటీ కోసం ముందు వైపున 43ఎమ్ఎమ్ అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ ఉన్నాయి. ముందు సస్పెన్షన్ గరిష్టంగా 170ఎమ్ఎమ్ వరకు ట్రావెల్ చేస్తుంది; ఇదే డ్యక్ 390 బైకులో గరిష్ట ట్రావెల్ 142ఎమ్ఎమ్‌గా ఉంది. వెనుక వైపున ప్రిలోడ్ మరియు రౌండ్ అడ్జెస్టబిలిటీ ఫీచర్‌తో 177ఎమ్ఎమ్ ట్రావెల్ గల మోనో-షాక్ అబ్జార్వర్ ఉంది.

కెటిఎమ్ నుండి 390 అడ్వెంచర్ మోటార్ సైకిల్: ధర, మైలేజ్, ఫీచర్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కెటిఎమ్ 390 అడ్వెంచర్ బైకును అతి త్వరలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ మోడల్ కోసం దేశవ్యాప్తంగా ఎంతో మంది ఔత్సాహికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగ ఐక్మా 2019 మోటార్ సైకిల్ షోలో ఆవిష్కరించిన కెటిఎమ్ ఈ బైకును అంతర్జాతీయ మార్కెట్లో కూడా విడుదల చేస్తామని చెప్పకనే చెప్పింది.

కెటిఎమ్ నుండి 390 అడ్వెంచర్ మోటార్ సైకిల్: ధర, మైలేజ్, ఫీచర్లు

కెటిఎమ్ 390 అడ్వెంచర్ పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే మార్కెట్లో ఉన్న బిఎమ్‌డబ్ల్యూ జి310 జిఎస్ మరియు రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మోటార్ సైకిళ్లకు సరాసరి పోటీనివ్వనుంది. దీని ధర సుమారుగా రూ. 2.5 లక్షల నుండి రూ. 3 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉండవచ్చు.

Most Read Articles

English summary
EICMA 2019: KTM 390 Adventure Showcased Ahead Of Its India Launch Later This Year. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X