Just In
Don't Miss
- Sports
85 కోట్లు: రాజస్థాన్ రాయల్స్‌లో తన 3 శాతం వాటాను అమ్మేందుకు సిద్ధమైన షేన్ వార్న్
- Movies
అది నోరా, చూస్తే వాంతులు.. అన్ని మూసుకోని కూర్చొ.. మంచు లక్ష్మీపై శ్రీరెడ్డి ఫైర్.. మనోజ్ విడాకులపై
- Lifestyle
కామోద్దీపనలు రగిలించే విటమిన్లు మరియు ఖనిజాలున్న ఆహారాలు! మిస్ చేసుకోకండి..
- News
పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న శాస్త్రవేత్తలు, మేధావులు..ఎందుకో తెలుసా?
- Technology
అనిమోజీ మరియు మెమోజీ సపోర్టుతో ఆపిల్ క్లిప్స్ యాప్
- Finance
మరో రూ.1 లక్ష కోట్లు టార్గెట్, వస్తువుల ధరలు పెరిగే ఛాన్స్: నేరుగా కాకుండా...
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
కేటీఎమ్ అడ్వెంచర్ 390 కోసం చూస్తున్నారా..? మీకో గుడ్‌న్యూస్!
ఇండియాలో ప్రతి ఏటా జరిగే ప్రతిష్టాత్మక మోటార్ సైకిల్ ప్రదర్శన కార్యక్రమం "ఇండియా బైక్ వీక్ 2019"లో కేటీఎమ్ ప్రతినిధులు తమ అడ్వెంచర్ 390 బైకును ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో జరిగే ఈ కార్యక్రమంలో కేటీఎమ్, బజాజ్ మరియు పలువురు మోటార్ సైకిల్ ఔత్సాహికులు పాల్గొననున్నారు.

స్పోర్ట్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థగా పేరుగాంచిన ఆస్ట్రియన్ దిగ్గజం కేటీఎమ్ 2019 ఐక్మా మోటార్ షో ఈవెంట్లో కేటీఎమ్ అడ్వెంచర్ 390 బైకును తొలిసారిగా అంతర్జాతీయ ఆవిష్కరణ చేసింది. అడ్వెంచర్ 390 బైకులో డ్యూక్ 390 నుండి సేకరించిన 373సీసీ సింగల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అందిస్తున్నారు.

కేటీఎమ్ అడ్వెంచర్ 390 (ఆఫ్-రోడ్ వెర్షన్), డ్యూక్390 (నేక్ట్-స్ట్రీట్ ఫైటర్ వెర్షన్) మరియు ఆర్సీ390 (స్పోర్ట్-ఫెయిరింగ్ వెర్షన్) మూడు బైకుల్లో కూడా ఒకే 373సీసీ ఇంజన్ ఉంది. వాటి డిజైన్ పరంగా ఒక్కో బైక్ ఒక్కో రకమైన అవసరానికి ఉపయోగపడుతుంది.

అడ్వెంచర్ 390 బైకులోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 43బిహెచ్‌పి పవర్ మరియు 37ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇందులో స్లిప్పర్ క్లచ్ అసిస్ట్ ఫీచర్ కూడా కలదు. అంతే కాకుండా అడ్వెంచర్ అవసరాలకు అనుగుణంగా అడ్వెంచర్ 390 బైకులో ఇంజన్‌ను కాస్త ప్రత్యేకంగా ట్యూనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

కేటీఎమ్ 390 అడ్వెంచర్ బైకులో ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ఏబీఎస్ మరియు పలు రకాల ఆఫ్-రోడ్ రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ముందు వైపున 19-అంగుళాల వీల్, డ్యూయల్ పర్పస్ టైర్లు, పొడవాటి వీల్ బేస్, అత్యుత్తమ గ్రౌండ్ క్లియరెన్స్, ఎత్తైన సీటు మరియు అత్యధిక ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వంటి ఎన్నో కీలకమైన అదనపు ఫీచర్లు ఉన్నాయి.

కేటీఎమ్ అడ్వెంచర్ 390 ధరల గురించి ఎలాంటి అధికారిక సమాచారం లభించలేదు. కానీ, దీని ధర రూ. 2.85 లక్షల నుండి రూ. 3.25 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉండవచ్చు. ఇది మార్కెట్లోకి పూర్తి స్థాయిలో విడుదలైతే విపణిలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మరియు బిఎమ్‌డబ్ల్యూ జి310జిఎస్ బైకులకు గట్టి పోటీనివ్వనుంది.

కేటీఎమ్ అడ్వెంచర్ 390 మోటార్ సైకిల్‌ను 2020లో విపణిలోకి విడుదల చేసే అవకాశం ఉంది. దీనికి అదనంగా ఫ్యూచర్‌లో డ్యూక్ 890 ఆర్ బైకును కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
కేటీఎమ్ అడ్వెంచర్ 390 మోటార్ సైకిల్ కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారు. దీని విడుదల గురించి ఎన్నో రకాల వార్తలొచ్చినప్పటికీ, కేటీఎమ్ అధికారకంగా ఎలాంటి ప్రకటన చేయకుండా నిశ్శబ్దాన్ని పాటించింది. అయితే, కేటీఎమ్ బైకులు మార్కెట్లోకి ఎప్పుడొచ్చినా కూడా సేల్స్ విషయంలో బాగానే రాణిస్తాయి. ఏదేమైనప్పటికీ ఎంతో కాలంగా వేచి ఉన్న కేటీఎమ్ అడ్వెంచర్ 390 బైక్ ప్రేమికులకు ఇదొక గుడ్‌న్యూస్ అనే చెప్పాలి.