Just In
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- News
విమానంలో టాయిలెట్కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత మార్కెట్లో కెటిఎమ్ డ్యూక్ 790 విడుదల ఖరారు
భారతీయ యువత కెటిఎమ్ బైకులపై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు, ఎందుకంటే ఈ బైకుల యొక్క స్టైల్ డిజైన్ మరియు పవర్ ఫుల్ ఇంజన్, అలాగే దీని కలర్ వంటి అనేక విషయాల వలన యువతను ఎంతగానో ఆకట్టుకొంటోంది. అయితే ఈ మధ్య కాలంలో కెటిఎమ్ డ్యూక్ బైకులపై ఎటువంటి వార్త లేదు, కానీ మాకు కొత్తగా తెలిసిన కెటిఎమ్ డ్యూక్ 790 గురించి ఇవాల్టి కథనంలో..

ఈ ఏడాది పండుగ సీజన్ లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కెటిఎమ్ డ్యూక్ 790 లాంచ్ అవుతుందని ధ్రువీకరించారు. ఈ లాంచ్ చాలా ఆలస్యం అయింది, అయితే కంపెనీ (ఎఆర్ఏఐ) ఆటోమోటివ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా నుంచి క్లియరెన్స్ కొరకు వేచి ఉన్నదని తెలిసింది.

నెల రోజుల వ్యవధిలోనే క్లియరెన్స్ పొందాలని కెటిఎమ్ ఆశగా ఎదురుచూస్తున్నారు, దీని తరువాత కంపెనీ విడుదలకు సిద్ధం కావడం ఖాయం అని కంపెనీ వర్గాలు తెలియ చేశాయి. కెటిఎమ్ డ్యూక్ 790 ను సికెడి మార్గం ద్వారా తీసుకురాబడింది.

ఇవి దేశంలో 200 మోటార్ సైకిళ్లు ఉన్నాయని, 790 ఉత్పత్తిని ఆపేయాలని, వచ్చే ఏడాది ప్రారంభమయ్యే కెటిఎమ్ డ్యూక్ 890 రిటైలింగ్ ప్రారంభించాలని కంపెనీ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిసింది.

కెటిఎమ్ డ్యూక్ 790లో కొత్త ఎల్సి8 799 సిసి లిక్విడ్ కూల్డ్, ప్యార్లల్ ట్విన్ ఇంజన్ 102.5 బిహెచ్పి పవర్ మరియు 87 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో పాటు, స్లిప్పర్ క్లచ్ ను కూడా కలిగి ఉంటుంది.

కెటిఎమ్ డ్యూక్ 790 ముందు వైపు 43 మిమీ అప్సైడ్ డౌన్ ఫోర్క్ మరియు వెనక వైపున ఒక డబ్ల్యుపి ఎడ్జెస్టబుల్ మోనో షాక్ ఫీచర్లు ఉన్నాయి.

ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే ముందు వైపున డ్యూయల్ 300 మిమీ పొడవుున్న డిస్క్ లు, మరియు వెనక వైపున ఒక 240 మిమీ డిస్కు ఉన్నాయి. కెటిఎమ్ డ్యూక్ 890 గురించి తగిన సమాచారం తెలియాల్సి ఉంది.
Most Read:హ్యుందాయ్ వెన్యూ పై బిఎస్-6 డీజల్ ఇంజిన్ ఖరారు

అయితే, ఈ మోటార్ సైకిల్ 790 వేరియంట్ కంటే సుమారుగా 15బిహెచ్పి మరింత శక్తివంతమైనదిగా ఉంటుందని మేం ఆశిస్తున్నాం. బ్రేకింగ్ క్యాలీపర్స్ మరియు ఎడ్జెస్టబుల్ లేఅవుట్ల పరంగా కూడా హార్డ్ వేర్ అప్గ్రేడ్ లను ఆశించవచ్చు.
Most Read:మేడ్ఇన్ ఆంధ్రప్రదేశ్: కియా సెల్టోస్ విడుదల

రెండు మోటార్ సైకిళ్లపై ఉన్న ఇతర ఫీచర్లు లీన్ సెన్సిటివ్ ట్రాక్షన్ కంట్రోల్, క్విక్-షిప్టర్స్, కార్నెల్ ఎబిఎస్, లాంచ్ కంట్రోల్, మల్టిపుల్ రైడింగ్ మోడ్ లు, మరియు వీల్ కంట్రోల్ లు ఉన్నాయి.
Most Read:టాటా హారియర్ కొత్త డార్క్ ఎడిషన్ ఇదే

అయితే దీని విడుదల తర్వాత దాదాపు లిమిటెడ్ ఎడిషన్ డ్యూక్ 790 సుమారు రూ. 7.5 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) ధర ఉండొచ్చని అంచనా. ఇక్కడ నిజంగా కెటిఎమ్ కు పోటీ ఉండదు, కానీ ఇది కవాసకి జెడ్ 800 తో పోటీ పడుతుంది.

కెటిఎమ్ డ్యూక్ 890 ధర గురించి ఎలాంటి సమాచారం లేదు. సంబంధిత వార్తల్లో, కెటిఎమ్ కూడా వచ్చే ఏడాది చివరినాటికి పలు ఇతర మోటార్ సైకిళ్లను ప్రారంభించాలని యోచిస్తోంది. వాటిలో 2020 సంవత్సరంలో ఆర్సి 390, కెటిఎమ్ 390 అడ్వెంచర్, మరియు కెటిఎమ్ 790 అడ్వెంచర్ లు ఉన్నాయి.

డ్రైవ్స్ స్పార్క్ తెలుగు అభిప్రాయం
చివరకు! కెటిఎమ్ డ్యూక్ 790 యొక్క విడుదలతో కొత్త రికార్డు అమ్మకాలను నమోదు చేయనుంది. ఈ సంవత్సరం మోటార్ సైకిల్స్ లాంచ్ చేస్తాయని మాకు తెలుసు మరియు మేము కూడా టెస్ట్ రైడ్ కొరకు ఎదురు చూస్తున్నాము. అయితే ఏఆర్ఏఐ సమస్యలను త్వరలో క్లియరెన్స్ చేసి, రోడ్లపై ఈ కెటిఎమ్ డ్యూక్ 790 చూడవచ్చు.