Just In
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారీగా అమ్ముడైన కెటిఎమ్ బైకులు: ఈ రెండు మోడళ్లకు భలే క్రేజ్
ప్రముఖ టూ వీలర్ల తయారీ సంస్థ కెటిఎమ్ గత కొన్ని నెలల నుండి రెండంకెల వృద్దిని కనబరుస్తోంది. ఇటీవల విడుదల చేసిన పలు కొత్త మోడళ్ల్ కారణంగా కెటీఎమ్ సేల్స్ అమాంతం పెరిగిపోయాయి. కెటిఎమ్ డ్యూక్ 125 మరియు ఆర్సీ 125 మోడళ్ల విడుదల కంపెనీ సైతం ఊహించని విధంగా రికార్డ్ స్థాయి సేల్స్ నమోదవుతున్నాయి.

కెటిఎమ్ ఇండియా విభాగం గత ఏడాది నవంబరులో విడుదల చేసిన డ్యూక్ 125 మరియు ఈ ఏడాది జూన్ మాసంలో విడుదల చేసిన ఆర్సీ 125 మోడళ్లు అత్యధికంగా అమ్ముడవుతున్నాయి.

2018 జూన్ నెలలో 4,133 బైకులు విక్రయించిన కేటిఎమ్, 2019 జూలై నెలలో 4,924 యూనిట్లు విక్రయించి ఏకంగా 19.14 శాతం వృద్దిని సాధించింది. ఈ మొత్తం సేల్స్‌లో కేటిఎమ్ 125సీసీ సిరీస్ బైకులయిన డ్యూక్ 125 మరియు ఆర్సీ 125 బైకులే 2,108 యూనిట్ల వరకు అమ్ముడయ్యాయి.

మే 2019 లో ప్రొడక్షన్ మొదలైనప్పటి నుండి ఈ రెండు మోడళ్లు ఏకంగా 2,228 యూనిట్ల వరకు అమ్ముడయ్యాయి. అయితే ముందునుంచే అమ్మకాల్లో ఉన్న కెటిఎమ్ 200 (డ్యూక్ మరియు ఆర్సీ) బైకుల సేల్స్ విషయానికి వస్తే రెండు మోడళ్లు కూడా 2018 జూన్‌లో 2,830 అమ్ముడవ్వగా.. ఈ ఏడాది జూన్ నెలలో కేవలం 1,891 యూనిట్లే అమ్ముడయ్యి 33.18 శాతం నష్టాన్ని మిగిల్చాయి.

గత జూన్ నెలలో విక్రయాలను గత ఏడాగి అదే జూన్‌లో జరిగిన విక్రయాలతో పోల్చితే కేటిఎమ్ 250 మరియు కెటిఎమ్ 390 సిరీస్ మోడళ్ల సేల్స్ విపరీతంగా తగ్గుముఖం పట్టాయి.

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి
కెటిఎమ్ ఇండియా విభాగం దేశీయ మార్కెట్లో ప్రస్తుతం 7 మోటార్ సైకిళ్లను విక్రయిస్తోంది. పర్ఫామెన్స్ మోటార్ సైకిళ్ల విభాగంలో అగ్రగామిగా రాణిస్తోంది. కెటిఎమ్ లైనప్‌లో కెటిఎమ్ 125 డ్యూక్ రూ. 1.25 లక్షల ధరతో చీపెస్ట్ మోటార్ సైకిల్‌గా మరియు కెటిఎమ్ 390 డ్యూక్ రూ. 2.48 లక్షల ధరతో ఖరీదైన మోడల్‌గా ఉన్నాయి.

కెటిఎమ్ డ్యూక్ 200 ధర రూ. 1.52 లక్షలు మరియు డ్యూక్ 250 ధర రూ. 1.81 లక్షలు, కెటిఎమ్ ఆర్సీ 200 ధర రూ. 1.79 లక్షలు మరియు ఆర్సీ 390 ధర రూ. 2.44 లక్షలు. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్‌గా ఉన్నాయి.

కెటిఎమ్ విక్రయిస్తున్న చీపెస్ట్ మోడల్ కెటిఎమ్ ఆర్సీ 125. ఇందులో సాంకేతికంగా 124సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 14.3బిహెచ్‌పి పవర్ మరియు 12ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

కెటిఎమ్ ఆర్సీ 125 ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైకులో ముందు వైపున అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్స్, బ్రేకింగ్ డ్యూటీ కోసం ఫ్రంట్ వీల్‌కు 300ఎమ్ఎమ్ డిస్క్, రియర్ వీల్‌కు 230ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ అందించారు. సేఫ్టీ కోసం సింగల్ ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తప్పనిసరిగా వచ్చింది. కెటిఎమ్ ఆర్సీ 125 విపణిలో ఉన్న యమహా వైజడ్ఎఫ్-ఆర్15 వి3 మోడల్‌కు గట్టి పోటీనిస్తుంది.