టీవీఎస్ నుండి సరికొత్త స్కూటీ: జూపిటర్ గ్రాండీ రిలీజ్.. ధర ఎంతంటే?

టీవీఎస్ మోటార్ కంపెనీ తమ మోస్ట్ పాపులర్ స్కూటర్ జూపిటర్ మోడల్‍ను అప్‌‌డేటెడ్ వెర్షన్‍‌‌లో జూపిటర్ గ్రాండి పేరుతో మార్కెట్లోకి రిలీజ్ చేసింది. స్కూటర్లలో ఇప్పటి వరకు పరిచయం కానటువంటి స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఫీచర్‌తో వచ్చిన టీవీఎస్ గ్రాండి స్కూటర్ ధర రూ. 59,990 ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా నిర్ణయించింది.

టీవీఎస్ నుండి సరికొత్త స్కూటీ: జూపిటర్ గ్రాండీ రిలీజ్.. ధర ఎంతంటే?

టీవీఎస్ జూపిటర్ రెగ్యులర్ వెర్షన్‌తో పోల్చుకుంటే జూపిటర్ గ్రాండి ధర 6,700 రూపాయలు ఎక్కువగా ఉంది. కొత్తగా పరిచయమైన ఫీచర్ విషయానికి వస్తే టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ నుండి సేకరించిన "స్మార్ట్ఎక్స్ కనెక్ట్" అనే స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఫీచర్ తీసుకొచ్చారు.

టీవీఎస్ నుండి సరికొత్త స్కూటీ: జూపిటర్ గ్రాండీ రిలీజ్.. ధర ఎంతంటే?

జూపిటర్ గ్రాండిలో వచ్చిన స్మార్ట్ఎక్ కనెక్ట్ ఫీచర్ రైడర్ వాడుతున్నటువంటి ఐఒఎస్ లేదా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‍కు కనెక్ట్ చేసుకోవచ్చు. స్కూటర్‌కు సంభందించిన వివరాలన్నింటినీ రైడర్ తన స్మార్ట్ ఫోన్‌లో పొందవచ్చు. ఫోన్ కాల్ అలర్ట్స్, టెక్ట్స్ మెసేజ్, ఓవర్-స్పీడ్ వివరాలు, ట్రిప్ డిటైల్స్ వంటి ఎన్నో వివరాలు పొందవచ్చు.

టీవీఎస్ నుండి సరికొత్త స్కూటీ: జూపిటర్ గ్రాండీ రిలీజ్.. ధర ఎంతంటే?

డ్యాష్ బోర్డు మీదున్న డిజిటల్-అనలాగ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌లో కూడా ట్రిప్ మీటర్, ఓడో మీటర్ రీడింగ్స్, ట్యాంక్‌లో పెట్రోల్ లెవల్ మరియు ఇతర సమాచారాన్ని సూచించే పలురకాల లైట్లు డ్యాష్‌బోర్డులో ఉన్నాయి. అదనంగా క్రోమ్ సరౌడింగ్స్ గల ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ మరియు సెగ్మెంట్లోనే తొలిసారిగా డ్యూయల్-కలర్ త్రీడీ లోగో అందివ్వడం జరిగింది.

టీవీఎస్ నుండి సరికొత్త స్కూటీ: జూపిటర్ గ్రాండీ రిలీజ్.. ధర ఎంతంటే?

సరికొత్త టీవీఎస్ జూపిటర్ గ్రాండి స్కూటర్ ప్రత్యేకమైన "టెక్ బ్లూ" పెయింట్ స్కీమ్‌లో లభ్యమవుతోంది. అంతే కాకుండా క్రోమ్ ఫినిషింగ్ గల బాడీ ప్యానల్స్, రియర్ వ్యూవ్ మిర్రర్స్, మెరూన్ కలర్ సీట్, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ వంటివి ప్రత్యేకంగా నిలిచాయి. టీవీఎస్ జూపిటర్ గ్రాండి కేవలం సింగల్ వేరియంట్లో మాత్రమే లభ్యమవుతోంది. ఇందులో ఫ్రంట్ వీల్‌కు డిస్క్ బ్రేక్ కూడా ఉంది.

టీవీఎస్ నుండి సరికొత్త స్కూటీ: జూపిటర్ గ్రాండీ రిలీజ్.. ధర ఎంతంటే?

సాంకేతికంగా టీవీఎస్ జూపిటర్ గ్రాండి స్కూటర్లో 109.7సీసీ కెపాసిటీ గల సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు, ఇది 8బిహెచ్‌పి పవర్ మరియు 8.4ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సస్పెన్షన్ కోసం ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున ప్రి-లోడ్ అడ్జస్టబుల్ షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి.

Most Read: చెప్పులేసుకుని బండి నడిపితే వెయ్యి, లుంగీ కడితే 2 వేలు ఫైన్.. జైలు కూడా!!

టీవీఎస్ నుండి సరికొత్త స్కూటీ: జూపిటర్ గ్రాండీ రిలీజ్.. ధర ఎంతంటే?

టీవీఎస్ జూపిటర్ గ్రాండి వేరియంట్‌తో పాటు పలు రకాల ఇతర వేరియంట్లలో కూడా లభ్యమవుతోంది. స్టాండర్డ్, జడ్ఎక్స్, జడ్ఎక్స్ డిస్క్ మరియు క్లాసిక్ అనే నాలుగు అదనపు వేరియంట్లలో జూపిటర్ స్కూటర్ ఎంచుకోవచ్చు. టీవీఎస్ జూపిటర్ శ్రేణిలో ప్రారంభ వేరియంట్ ధర రూ. 52,945 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. ఈ శ్రేణిలో గ్రాండి వేరియంట్ టాప్ రేంజ్ వేరియంట్.

Most Read: 54 వేల ధరకే టీవీఎస్ రేడియాన్ స్పెషల్ ఎడిషన్ విడుదల

టీవీఎస్ నుండి సరికొత్త స్కూటీ: జూపిటర్ గ్రాండీ రిలీజ్.. ధర ఎంతంటే?

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టీవీఎస్ జూపిటర్ గ్రాండి స్కూటర్‍ను ఖరీదైన మరియు స్టైలిష్ స్కూటర్ కోరుకునే కస్టమర్లను లక్ష్యంగా చేసుకునే అత్యంత సరసమైన ధరలో అత్యాధునిక ఫీచర్లతో తీసుకొచ్చారు. ఇది మార్కెట్లో ఉన్న హోండా యాక్టివా 5జీ, హీరో ప్లెజర్ 110 మరియు యమహా ఫ్యాసినో స్కూటర్లకు గట్టి పోటీనిస్తోంది.

Most Read Articles

English summary
New TVS Jupiter Grande Launched In India: Priced At Rs 59,990
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X