Just In
- 31 min ago
మాస్క్, హెల్మెట్ లేకుండా రైడ్ చేసిన ప్రముఖ బాలీవుడ్ హీరోకి ట్రాఫిక్ ఛలాన్
- 41 min ago
మార్చి 2న హ్యుందాయ్ బేయోన్ క్రాసోవర్ ఆవిష్కరణ - వివరాలు
- 50 min ago
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !
- 1 hr ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలు ప్రారంభం
Don't Miss
- News
ఎన్టీఆర్ కాదు నేనే వస్తా .. లేదంటే లోకేష్ ను పంపుతా : కుప్పంలో చంద్రబాబు వ్యాఖ్యలు
- Movies
ముసలి గెటప్‌లో నందమూరి బాలకృష్ణ: సాహసాలు చేయడానికి సిద్ధమైన నటసింహం
- Sports
స్పిన్ బౌలింగ్‌ను సరిగ్గా ఆడలేని ఇంగ్లండ్‌ను కాకుండా.. పిచ్‌ను విమర్శించడం ఏంటి: గ్రేమ్ స్వాన్
- Finance
తగ్గనున్న విమాన ఛార్జీలు- డీజీసీఏ కీలక అనుమతి- ఆ సేవలు ఇక విడివిడిగానే
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విపణిలోకి తొలి రివోల్ట్ ఎలక్ట్రిక్ బైక్: ధర తెలిస్తే షాక్ అవుతారు!
భారత మార్కెట్లో మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ ను రివోల్ట్ లాంచ్ చేసింది, అంతే కాకుండా ఇది మొదటి ఆర్టిఫిషల్ ఇంటిలిజెంట్(AI) బైక్ కావడం విశేషం. రివోల్ట్ మోటార్స్ ఆర్వి300 మరియు ఆర్వి400 అనే రెండు ఎలక్ట్రిక్ బైకులు లాంచ్ చేసింది. మరి ఇందులో ఉన్న అధునాతన ఫీచర్లు వివరాలు మరియు ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ధర లను వివరంగా తెలుసుకొందాం రండి..

రివోల్ట్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లో రెండు కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను ప్రవేశపెట్టింది, వాటిలో ఆర్వి300 మరియు ఆర్వి400 లు ఉన్నాయి. ఈ రివోల్ట్ ఆర్వి400 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది, వాటిలో బేస్ మరియు ప్రీమియం లు ఉన్నాయి.

రివోల్ట్ ధర ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ చాలా విశిష్టమైన పేమెంట్ పథకాలను ప్రకటించింది. ఇందులో నెలవారీ పేమెంట్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. వాటిలో రూ.2999 నెలవారీగా పేమెంట్ పథకంతో రివోల్ట్ ఆర్వి300 పొందవచ్చు.

అలాగే ఆర్వి400 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ యొక్క రెండు వేరియంట్ లలో బేస్ వేరియంట్ ను రూ.3499 నెలవారీ పేమెంట్ తో, ప్రీమియం వేరియంట్ ను నెలకు రూ.3999 పేమెంట్ తో అందిస్తున్నారు.

కంపెనీ డీలర్ షిప్ ల వద్ద రివోల్ట్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల బుకింగ్స్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ రివోల్ట్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ తొలుత ఢిల్లీ, పుణె నగరాలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

రెండు మోటార్ సైకిళ్ల డిలివరీలను వచ్చే నెల నుంచి ప్రారంభం అవుతాయి. రివోల్ట్ మోటార్స్ నుంచి ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు రెండూ కొత్త టెక్నాలజీ ఫీచర్ల తో వస్తాయి.

ఇందులో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డిఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, ఫుల్ డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్ కీ, కీలెస్ ఇగ్నీషన్ మరియు ప్రపంచపు మొట్టమొదటి వాయిస్ యాక్టివేటెడ్ బైక్ స్టార్ట్ టెక్నాలజీ ఉన్నాయి.
Most Read: కమర్షియల్ వాహనాలపై సంచలన నిర్ణయం తీసుకోనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

రెండు ఆఫరింగ్ లు కూడా ఆర్టిఫిషల్ ఇంటిలిజెంట్(AI) ఆధారిత టెక్నాలజీలతో వస్తాయి. ఇందులో జియోఫెన్సింగ్, లైవ్ వేహికల్ ట్రాకింగ్, ఛార్జింగ్-స్టేషన్ లొకేషన్, టర్న్ బై టర్న్ నావిగేషన్ మరియు రియల్ టైమ్ వేహికల్ మరియు బ్యాటరీ డయాగ్నస్టిక్స్ ఉంటాయి.
Most Read: బన్నీ లేటెస్ట్ లగ్జరీ రేంజ్ రోవర్.. ధర ఎంతో తెలుసా

ఈ ఎలక్ట్రిక్ బైకులు ఇన్ బిల్ట్ స్పీకర్స్ తో వస్తాయి, ఇవి నాలుగు ముందుగా నిక్షిప్తం చేసిన ఎగ్జాస్ట్ నోట్స్ కు ప్రతిరూపంగా ఉంటాయి. రైడర్ లు కస్టమ్ ఎగ్జాస్ట్ నోట్లను యాప్ లోనికి లోడ్ చేయవచ్చు.
Most Read: క్రాష్ గార్డ్ ఉన్న వాహనాలపై భారీ జరిమానా : హైదరాబాద్ పోలీస్

రివోల్ట్ ఆర్వి300 2.7 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ను కలిగి ఉంది, ఇది 1.5 కిలోవాట్ విద్యుత్ మోటారును కలిగి ఉంది. ఆర్వి300 ఎలక్ట్రిక్ బైకు ఒకసారి ఛార్జింగ్ చేస్తే 180 కి.మీ రేంజ్ లో 65 కిమీ/గం టాప్ స్పీడ్ ను ఆఫర్ చేస్తున్నట్లు చెప్పారు.

రివోల్ట్ ఆర్వి400 లో అయితే 3.24 కిలో వాట్ లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది, ఇది 3 కిలో వాట్ రేటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ని కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ తన బ్యాటరీ నుంచి 170 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుందని చెప్పారు.

ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కు 85 కిమీ/గం టాప్ స్పీడ్ ఉంటుందని, ఒకసారి ఛార్జింగ్ చేస్తే గరిష్టంగా 156 కిమీ ప్రయాణించవచ్చని చెప్పారు. ఈ రివోల్ట్ ఎలక్ట్రిక్ బైకులను మూడు రైడింగ్ మోడ్ లతో కూడా అందిస్తున్నారు, వాటిలో సిటీ, ఎకో మరియు స్పోర్ట్ లు ఉన్నాయి.

మోటార్ సైకిల్ పై సస్పెన్షన్ ముందు వైపు యూఎస్డి ఫ్రంట్ ఫోర్క్స్ ద్వారా మరియు వెనక వైపున ఒక ఎడ్జెస్టబుల్ మోనో-షాక్ ఏర్పాటు చేయబడింది. బ్రేకింగ్ రెండు చివరల్లో 240 మి.మీ డిస్క్ లను జత చేయబడింది, ఇది CBS (కాంబీ-బ్రేకింగ్ సిస్టమ్) మరియు రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా మద్దతు ఇస్తోంది.

ఛార్జింగ్ సౌకర్యాల పరంగా, రివోల్ట్ మోటార్లు తమ ఆర్వి300 మరియు ఆర్వి400 ఎలక్ట్రిక్ బైకులను ఛార్జింగ్ చేసే నాలుగు విభిన్న పద్ధతులను అందిస్తున్నారు, వాటిలో హోమ్-ఛార్జింగ్, రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్, మొబైల్ బ్యాటరీ స్టేషన్లు మరియు బ్యాటరీ హోమ్ డెలివరీ పద్ధతులు ఉన్నాయి.

ఆర్వి300 రెండు కలర్ లలో లభ్యం అవుతుంది, వాటిలో నియాన్ బ్లాక్ మరియు స్మోకీ గ్రే. అలాగే రివోల్ట్ రెడ్ మరియు కాస్మిక్ బ్లాక్ యొక్క రెండు విభిన్న కలర్ లలో ఆర్వి400 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ను అందిస్తున్నారు.