రాయల్ ఎన్ఫీల్డ్ కస్టమర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్

రాయల్ ఎన్ఫీల్డ్ తమ క్లాసిక్ 350 మోటార్ సైకిల్ కోసం 16 రకాల విభిన్న సైలెన్సర్లను ప్రవేశపెట్టింది. ఈ సైలెన్సర్లు చట్టబద్దమైనవి అంతే కాకుండా భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ఉద్గార మరియు శబ్ద కాలుష్య ప్రమాణాలను పాటిస్తాయి. కస్టమర్లు ఈ సైలెన్సర్లను బిఎస్-3 మరియు బిఎస్-4 బైకుల్లో అమర్చుకోవచ్చు.

రాయల్ ఎన్ఫీల్డ్ కస్టమర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్

రాయల్ ఎన్ఫీల్డ్ లాంచ్ చేసిన OEM సైలెన్సర్లను స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేశారు, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైకులో అందించే సాధారణ సైలెన్సర్లతో పోలిస్తే ఇవి 40 శాతం తక్కువ బరువును కలిగి ఉంటాయి. రాయల్ ఎన్ఫీల్డ్ ప్రస్తుతం అందుబాటులో ఉంచిన OEM సైలెన్సర్ల వివరాలు మీ కోసం...

రాయల్ ఎన్ఫీల్డ్ కస్టమర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్

పీషూటర్ ఎండ్ క్యాప్

ఈ సిరీస్‌లో ఉన్న సైలెన్సర్లు చూడటానికి రెగ్యులర్ సైలెన్సర్ల మాదిరిగానే ఉంటాయి. సైలెన్సర్ చివరలో ఉన్న అదనపు గొట్టం ఎన్నో బైకుల్లో చూస్తుంటాం, యువతకు ఈ తరహా సైలెన్సర్లు అంటే ఎంతో ఇష్టం. ఆల్-బ్లాక్, ఆల్-సిల్వర్ మరియు సిల్వర్ & బ్లాక్ రెండు ఆప్షన్లు ఉన్న కాంబినేష‌న్‌‌లో పీషూటర్ ఎండ్ క్యాప్ సైలెన్సర్లను రూ. 3,600 ధరతో ఎంచుకోవచ్చు.

రాయల్ ఎన్ఫీల్డ్ కస్టమర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్

స్ట్రైట్ కట్ ఎండ్ క్యాప్

సైలెన్సర్ నిజానికి రెండు పైపుల సమూహం, ఒకటి పైభాగంలో ఉంటే, మరొకటి లోపలి భాగంలో చిన్నగా ఉంటుంది.. మండిన వాయువులను తీసుకొచ్చేది ఇదే. స్ట్రైట్ కట్ ఎండ్ క్యాప్ సైలెన్సర్లలో ఎండ్-పైప్ కాస్స లోపలివైపుకు జొప్పించినట్లుగా ఉంటుంది. క్లాసిక్ 350 బైకులకు ఈ సైలన్సర్ చక్కగా, చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఆల్-బ్లాక్, ఆల్-సైలెన్సర్ అదే విధంగా బ్లాక్ మరియు సిల్వర్ ఆప్షన్లలో లభించే ఈ సైలెన్సర్ ధర 3,450 రూపాయలుగా ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ కస్టమర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్

స్లాష్ కట్ ఎండ్ క్యాప్ సైలెన్సర్

ఇది చెప్పాలంటే స్ట్రైట్ కట్ ఎండ్ క్యాప్ తరహాలోనే ఉంటుంది, కానీ చివరలో ఒక కోణంలో వాలుగా కట్ చేసినట్లు ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ ప్రవేశపెట్టిన 16 సైలెన్సర్లలో కస్టమర్లు ఎక్కువగా కోరుకునే వెర్షన్ ఇదే కావచ్చు. దీనిని బ్లాక్, సిల్వర్ మరియు బ్లాక్-సిల్వర్ కాంబినేషన్‌లో ఎంచుకోవచ్చు. దీని ధర రూ. 3,300.

రాయల్ ఎన్ఫీల్డ్ కస్టమర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్

ట్యాపర్ట్ ఎండ్ క్యాప్

దీనిని కూడా స్ట్రైట్ కట్ స్టైల్ నుండి తయారు చేశారు. కానీ చివర్లో బయటి వైపుకు ఉబ్బినటువంటి ఆకారంలో ఉంటుంది. ఇది కూడా ఆల్-బ్లాక్, ఆల్-సిల్వర్ మరియు బ్లాక్-సిల్వర్ కాంబినేషన్లో లభిస్తోంది. దీని ధర 3,450 రూపాయలుగా ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ కస్టమర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్

టూరింగ్ మిర్రర్స్

రాయల్ ఎన్ఫీల్డ్ 16 సైలెన్సర్లతో పాటు టూరింగ్ చేసే రైడర్ల కోసం వారి జర్నీ మరింత అందంగా ఉంచేందుకు మరికొన్ని ఇతర యాక్ససరీలను పరిచయం చేసింది, అందులో టూరింగ్ మిర్రర్స్ కూడా ఉన్నాయి. ధృడత్వం మరియు సామర్థ్యాన్ని కలిగి ఉండేలా అల్యూమినియంతో ఆకర్షణీయంగా మెషినింగ్ చేశారు. టూరింగ్ మిర్రర్ల జత ధర రూ. 4,000.

రాయల్ ఎన్ఫీల్డ్ కస్టమర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్

సంప్‌గార్డ్

సంప్ గార్డ్ లేదా ఇంజన్ గార్డ్, ఇంజన్‍ను ముందువైపున క్రింది భాగంలో దీనిని అమరుస్తారు. ఆఫ్-రోడింగ్ చేసేటప్పుడు రాళ్లు మరియు ఎగుదిగుడు తలాల నుండి ఇంజన్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. దీని ధర రూ. 2,650.

రాయల్ ఎన్ఫీల్డ్ కస్టమర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్

హ్యాండ్ గార్డ్ కిట్

ఎక్కువ స్పీడ్ మీద ఉన్నప్పుడు క్రింద పడితే ఎక్కువగా గాయాలయ్యే ప్రదేశాలు చేతులు, చేతి వేళ్లు, మరియు ముంజేతులు. చేతులు ఎప్పుడూ హ్యాండిల్ మీదనే ఉంటాయి కాబట్టి, వీటి రక్షణ కోసం హ్యాండ్ గార్డ్స్ ఎంతో ఉపయోగపడతాయి. హ్యాండ్ గార్డ్స్ క్లచ్, బ్రేక్ మరియు యాక్సిలరేటర్ వంటి లీవర్లను డ్యామేజ్ నుండి రక్షిస్తాయి. వీటి ధర రూ. 2,200.

రాయల్ ఎన్ఫీల్డ్ కస్టమర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్

పైన పేర్కొన్న వాటితో పాటు, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోటార్ సైకిల్‌ కోసం పలు అదనపు యాక్ససరీలను కూడా పరిచయం చేసింది. ప్యానీయర్ మౌంట్స్, మిలిటరీ ప్యానీయర్స్, సీట్ కవర్లు మరియు హెడ్ లైట్ విజర్‌లతో పాటు ఇంకా ఎన్నో ఉన్నాయి. వీటికి సంభందించిన పూర్తి వివరాల కోసం, ఇక్కడ క్లిక్ చేయండి

రాయల్ ఎన్ఫీల్డ్ కస్టమర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్

క్లాసిక్ 350 మోటార్ సైకిల్ కొనుగోలు చేసే కొత్త కస్టమర్లకు కోసం రాయల్ ఎన్ఫీల్డ్ ఇటీవల "మేక్ యువర్ ఓన్" ప్రోగాంను ప్రారంభించింది. కస్టమర్లను తమకు నచ్చినట్లుగా అందుబాటులో ఉన్న యాక్ససరీలతో డిజైన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫైనల్ రేట్ డిసైడ్ చేస్తారు. ఈ ప్రోగ్రాం ప్రస్తుతం ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబాయ్, చెన్నై, బెంగళూరు, పూనే మరియు హైదరాబాద్ వంటి నగరాల్లో అందుబాటులో ఉంది. పూర్తి వివరాల కోసం..

రాయల్ ఎన్ఫీల్డ్ కస్టమర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోటార్ సైకిల్ కొనుగోలు చేయాలని భావిస్తున్న కస్టమర్లకు ఇదొక గుడ్‌న్యూస్. కొత్తగా ప్రకటించిన యాక్ససరీలతో క్లాసిక్ 350 బైక్ రోడ్డెక్కినపుడు చాలా కొత్తగా, స్టైలిష్‌గా ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ అత్యధికంగా విక్రయిస్తున్న మోడల్ క్లాసిక్ 350. యువతను ఆకర్షించి, సేల్స్ పెంచుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Most Read Articles

English summary
Royal Enfield 350 Classic Accessories Launched: 16 Exhausts, Touring Mirrors & More. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X