తుది పరీక్షల్లో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బిఎస్-6

రాయల్ ఎన్పీల్డ్ 2020 హిమాలయన్ బిఎస్6 మోడల్‌ను రహస్యంగా పరీక్షిస్తూ పట్టుబడింది. ఓ ఆటోమొబైల్ మీడియా రహస్యంగా సేకరించిన ఫోటోల ప్రకారం, బిఎస్6 మోడల్ తెలియకుండా పబ్లిక్‌గానే పరీక్షించారు, ప్రస్తుతం ఉన్న మోడల్‌తో పోల్చుకుంటే బిఎస్6 హిమాలయన్ బైకులో బయటివైపు పలు మార్పులు జరిగాయి.

తుది పరీక్షల్లో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బిఎస్-6

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ డిజైన్ పరంగా చూడటానికి అచ్చం పాత మోడల్‌నే పోలి ఉంది. టెస్టింగ్ ఫోటోల్లో కాస్త ఎత్తైన విండ్ షీల్డ్ వచ్చింది. ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌లో కూడా పలు మార్పులు సంభవించాయి.

తుది పరీక్షల్లో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బిఎస్-6

సరికొత్త 2020 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బిఎస్6 మోటార్ సైకిల్‌లోని ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌లో ఉన్న డయల్స్ గ్రాఫిక్స్, రెండు అదనపు మల్టీ-ఇన్ఫర్మేషన్ టెల్-టేల్ లైట్లు వచ్చాయి.

తుది పరీక్షల్లో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బిఎస్-6

బైకులో అదనంగా మరెలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. సరికొత్త 2020 హిమాలయన్ బిఎస్6 బైకులో కొత్త డ్యూయల్ కలర్ పెయింట్ స్కీమ్స్‌ కూడా వస్తున్నాయి. వైట్ కలర్‌తో పాటు రాక్ రెడ్, గ్రావెల్ గ్రే మరియు లేక్ బ్లూ కలర్ హైలెట్స్‌ ఇందులో అదనంగా వస్తున్నాయి.

తుది పరీక్షల్లో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బిఎస్-6

హిమాలయన్ బిఎస్6 వెర్షన్‌లో అదే మునుపటి 411సీసీ కెపాసిటీ గల సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ యధావిధిగా వచ్చింది. ఇది 24.5బిహెచ్‌పి పవర్ మరియు 32ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

తుది పరీక్షల్లో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బిఎస్-6

2020 హిమాలయన్ బైకులో సాంకేతికంగా మరెలాంటి మార్పులు జరగలేదు. అయితే, స్ల్పిట్-క్రాడిల్ ఛాసిస్, 41ఎమ్ఎమ్ ట్రావెల్ గల టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుక వైపున మోనో-షాక్ అబ్జార్వర్ వచ్చింది.

తుది పరీక్షల్లో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బిఎస్-6

రాయల్ ఎన్ఫీల్డ్ 2020 హిమాలయన్ బిఎస్6 బైకులో ముందువైపున 21-ఇంచులు, వెనుక వైపున 17-ఇంచుల స్పోక్ వీల్స్ వచ్చాయి. బ్రేటింగ్ డ్యూటీ కోసం ఫ్రంట్ మరియు రియర్ వీల్స్‌కు 300మిమీ, 240మిమీ చుట్టుకొలత గల డిస్క్ బ్రేకులు వచ్చాయి.

తుది పరీక్షల్లో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బిఎస్-6

డ్యూయల్ ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ టెక్నాలజీని తప్పనిసరి ఫీచర్‌గా వచ్చింది, అంతే కాకుండా ఏబీఎస్ వద్దనుకుంటే రైడర్స్ ఏబీఎస్ బటన్ స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం హిమాలయన్ ధర రూ. 1.80 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది, అయితే బిఎస్6 వెర్షన్ ధర మరో 12 వేల రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది.

తుది పరీక్షల్లో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బిఎస్-6

2020 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బిఎస్6 పూర్తి స్థాయిలో విపణిలోకి లాంచ్ అయితే, త్వరలో రానున్న కెటిఎమ్ అడ్వెంచర్ 390కు గట్టి పోటీనిస్తుంది. అడ్వెంచర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో 400సీసీ రేంజ్‌‌లో అసలు సిసలైన మోడల్ 390 అడ్వెంచర్, అయితే ధర పరంగా హిమాలయన్‌తో పోల్చుకుంటే సుమారుగా లక్షన్నరకు పైనే ఉండవచ్చు.

తుది పరీక్షల్లో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బిఎస్-6

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రాయల్ ఎన్పీల్డ్ హిమాలయన్ భారతదేశపు బడ్జెట్ ఫ్రెండ్లీ పవర్‌ఫుల్ అడ్వెంచర్ మోటార్ సైకిల్. మార్కెట్లోకి వచ్చిన కొత్తలో రకరకాల టెక్నికల్ సమస్యలతో కాస్త చెడ్డ పేరు తెచ్చుకున్నప్పటికీ దశ వారీగా నిర్వహించిన అప్‌డేట్స్‌తో ఇప్పుడు ఇండియన్ అడ్వెంచర్ ప్రియుల హృదయాలను దోచుకుంటోంది. అతి త్వరలో మార్కెట్లోకి రానున్న 2020 హిమాలయన్ బిఎస్6 వెర్షన్ ఎన్నో కీలక అప్‌డేట్స్‌తో వస్తోంది.

Image Courtesy: Team BHP

Most Read Articles

English summary
Spy Pics: Royal Enfield Himalayan BS6 Spotted Testing Ahead Of India Launch. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X