సరికొత్త మోడల్‌తో భారీ పథకం పన్నిన టీవీఎస్

ద్విచక్ర వాహన తయారీ సంస్థగా సుదీర్ఘ అనుభవం మరియు పేరుగాంచిన దక్షిణ భారతదేశ వాహన తయారీ దిగ్గజం టీవీఎస్ విపణిలోకి సరికొత్త స్కూటర్ ప్రవేశపెట్టాలని భావిస్తోంది. 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వాహన ప్రదర్శన వేదికలో ఆవిష్కరించిన టీవీఎస్ క్రియాన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో ఇండియన్ మార్కెట్లోకి పూర్తి స్థాయిలో లాంచ్ చేయాలని భావిస్తోంది.

సరికొత్త మోడల్‌తో భారీ పథకం పన్నిన టీవీఎస్

టీవీఎస్ ఎలక్ట్రిక్ టూ వీలర్ల ఉత్పత్తిని ప్రారంభిస్తే.. భారతదేశపు మొట్టమొదటి అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్ల తయారీ సంస్థగా నిలవనుంది. తాజాగా అందిన సమాచారం మేరకు.. 2019-2020 ఆర్థిక సంవత్సరం మలిసగంలో నుండి ప్రస్తుతం టీవీఎస్ విక్రయిస్తున్న అన్ని టూ వీలర్లలో బిఎస్-6 ఉద్గార ప్రమాణాలను పాటించే ఇంజన్ అప్‌గ్రేడ్ చేయనున్నట్లు తెలిసింది.

సరికొత్త మోడల్‌తో భారీ పథకం పన్నిన టీవీఎస్

2019-20 మధ్య కాలంలోనే టీవీఎస్ తమ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం. ఎలక్ట్రిక్ టూ వీలర్లు భవిష్యత్ రవాణాలో ఒక భాగం కాదు... భవిష్యత్ మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలదే ఈ నేపథ్యంలోనే కీలక సంస్థగా ఎదిగేందుకు పలు కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్లతో పాటు అన్ని అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త ఉత్పత్తులను అభివృద్ది చేస్తోంది.

సరికొత్త మోడల్‌తో భారీ పథకం పన్నిన టీవీఎస్

ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలను తప్పనిసరి చేసేందుకు ఎంతో కాలం లేదు. ఏప్రిల్ 2023 నుండి అన్ని త్రీ-వీలర్లు ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లుగా మరియు ఏప్రిల్ 2025 నుండి 150సీసీ కంటే తక్కువ కెపాసిటీ ఉన్న టూ వీలర్ల స్థానంలో కేవలం ఎలక్ట్రిక్ టూ వీలర్లను మాత్రమే అనుమతించాలని నియమాన్ని భారత ప్రభుత్వం తప్పనిసరి చేయనుంది.

సరికొత్త మోడల్‌తో భారీ పథకం పన్నిన టీవీఎస్

ఈ తప్పనిసరి నియమాన్ని ఇప్పటికే పలు వాహన తయారీ సంస్థలు తమ భవిష్యత్ ప్రణాళికగా నిర్ణయించుకున్నాయి. అందులో ఒకటి టీవీఎస్ కంపెనీ. ఈ నిర్ణయం గురించి టీవీఎస్ ఛైర్మన్ వేను శ్రీనివాసన్ మాట్లాడుతూ, " నిర్ణీత గడువులోగా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని చేపట్టి, మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురావడంతో పాటు పలు డిస్కౌంట్లు ప్రకటించి విక్రయాలను ప్రోత్సహించడమే కాకుండా ఆటోమొబైల్ పరిశ్రమ ఆధారంగా ఉన్న 40 లక్షల ఉద్యోగాల ప్రమాదంలో పడే అవకాశం ఉందని" పేర్కొన్నారు.

సరికొత్త మోడల్‌తో భారీ పథకం పన్నిన టీవీఎస్

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు

ఏదేమైనప్పటికీ టీవీఎస్ సంస్థ పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కాదు కాబట్టి, ఈ విభాగంలో తమ బలంమేంటో నిరూపించుకునేందుకు ప్రస్తుతం రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ దృష్టిసారిస్తోంది. ఆల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ అనే ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ది చేసే అంకుర సంస్థలో టీవీఎస్ సుమారుగా రూ. 5 కోట్ల వరకు పెట్టుబడి పెట్టింది.

సరికొత్త మోడల్‌తో భారీ పథకం పన్నిన టీవీఎస్

మార్కెట్లోకి ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడం పట్ల వేణు శ్రీనివాసన్ గారు వ్యతిరేకం కాదు, కానీ ప్రభుత్వం ప్రకటించే అసంభవమైన గడువులకు ఆయన వ్యతిరేకం. టీవీఎస్ సంస్థ సీఈఓ కెఎన్ రాధాకృష్ణ మాట్లాడుతూ, టీవీఎస్ ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి కోసం పెట్టుబడులు పెట్టింది. మరో ఎనిమిది నెలల్లో తమ నూతన ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు.

సరికొత్త మోడల్‌తో భారీ పథకం పన్నిన టీవీఎస్

టీవీఎస్ మూడేళ్ల క్రితమే ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్దిని ప్రారంభించింది. క్రియాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్‌ను గత ఏడాది ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో తొలిసారిగా ఆవిష్కరించింది. ఇది పూర్తి స్థాయిలో విద్యుచ్ఛక్తితో నడిచే స్కూటర్. ఇందులో 12kW ఎలక్ట్రిక్ మోటార్ ఉంది.

సరికొత్త మోడల్‌తో భారీ పథకం పన్నిన టీవీఎస్

3 లిథియం-అయాన్ బ్యాటరీల నుండి పవర్ మోటార్‌కు అందుతుంది. టీవీఎస్ కథనం మేరకు కేవలం 5.1సెకన్ల వ్యవధిలోనే గంటకు 0-60కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అంతే కాకుండా 60 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్ అయ్యేందుకు ఫాస్ట్ ఛార్జర్‌తో వస్తోన్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ కూడే.

సరికొత్త మోడల్‌తో భారీ పథకం పన్నిన టీవీఎస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

గ్రీన్ వెహికల్స్(పర్యావరణ హితమైన వాహనాలు) డెవలప్‌మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ విభాగంలో టీవీఎస్ మోటార్ కంపెనీ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది. టీవీఎస్ ఇటీవలె తమ అపాచే ఆర్‌టిఆర్ 200ఎఫ్ఐ ఇ100 అనే బైకును ఇథనాల్‌తో నడిచే ఇంజన్‌తో లాంచ్ చేసింది. టీవీఎస్ ఇలాంటి నూతన ఆవిష్కరణలను చేపడుతూనే ఉంది. తమ క్రియాన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వచ్చే ఏడాది పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానుంది.

Most Read Articles

English summary
TVS To Launch An Electric Vehicle Before March 2020 — Could It Be The Creon? Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X