Just In
- 38 min ago
మాస్క్, హెల్మెట్ లేకుండా రైడ్ చేసిన ప్రముఖ బాలీవుడ్ హీరోకి ట్రాఫిక్ ఛలాన్
- 49 min ago
మార్చి 2న హ్యుందాయ్ బేయోన్ క్రాసోవర్ ఆవిష్కరణ - వివరాలు
- 57 min ago
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !
- 1 hr ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం
Don't Miss
- Finance
మార్చి 31 వరకు.. వివాద్ సే విశ్వాస్ గడువు పొడిగింపు
- Movies
Check 1st day collections: బాక్సాఫీస్ వద్ద నితిన్ స్టామినా.. తొలి రోజు ఫస్ట్ డే వసూళ్లు ఎంతంటే..
- News
ఎన్టీఆర్ కాదు నేనే వస్తా .. లేదంటే లోకేష్ ను పంపుతా : కుప్పంలో చంద్రబాబు వ్యాఖ్యలు
- Sports
స్పిన్ బౌలింగ్‌ను సరిగ్గా ఆడలేని ఇంగ్లండ్‌ను కాకుండా.. పిచ్‌ను విమర్శించడం ఏంటి: గ్రేమ్ స్వాన్
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొత్త అప్డేట్ తో విడుదల కానున్న టీవీఎస్ జూపిటర్
ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ ఇప్పటికే భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన 110సీసీ ఆటోమేటిక్ స్కూటర్ 'టీవీఎస్ జూపిటర్' ని కొత్త అప్డేట్ లతో అందుబాటులోకి తీసుకురానుంది. మరి ఈ టీవీఎస్ జూపిటర్ పై ఎటువంటి మార్పులతో తీసుకొస్తుందో ,మాకు తెలిసిన సమాచారం మీకోసం..

టీవీఎస్ జూపిటర్ జెడ్ఎక్స్ ను ప్రవేశపెట్టినప్పుడు భారత మార్కెట్లో మంచి ఆదరణ లభించింది. ఈ టాప్-స్పెక్ కు రీప్లేస్ మెంట్ గా గ్రాండే మోడల్ తీసుకొచ్చే పనిలో ఉంది. అయితే, ఈ సారి అనేక కొత్త ఫీచర్లతో ఈ సంస్థ జూపిటర్ గ్రాండే తిరిగి ప్రవేశపెట్టాలని చూస్తోందని తెలిసింది.

ఒక బ్లూటూత్ -ఆధారిత డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ రూపంలో అతిపెద్ద అప్డేట్ తో రావాల్సి ఉంది. ఈ స్క్రీన్ ఎన్‌టార్క్ లో ఒకదానిని పోలి ఉంటుందని మేము తెలుసుకున్నాము, కానీ అది ప్రదర్శించబడే సమాచారం పరంగా సమగ్రంగా వుండదు.

ఇందులో కాల్స్ మరియు ఎస్ఎమ్ఎస్ సమాచారంతో పాటు బ్యాటరీ శాతం మరియు నెట్వర్క్ కవరేజ్ వంటి మొబైల్ ఫోన్ వాటికీ అనుగుణంగా కొత్త ఫీచర్లు ఉంటాయని మేము ఆశిస్తున్నాము. మరిన్ని ఫీచర్ల వినియోగానికి వీలు కల్పించే టీవీఎస్ ' కనెక్ట్ ' అప్లికేషన్ తో కూడా జత చేస్తుంది.

అదనంగా ఈ ఫీచర్ తో 110 సిసి సెగ్మెంట్లో ఉన్న మొదటి స్కూటర్ ను టీవీఎస్ తయారు చేస్తుంది. ఈ గ్రాండే మునుపటి జనరేషన్ నమూనాపై ఒకదానిని పోలిన ఒక ఎల్ఈడి హెడ్ లైట్ ను కూడా కలిగి ఉండనుంది.

అదనంగా, జూపిటర్ గ్రాండే పై ఒక కొత్త వీల్ డిజైన్ ను కూడా ఉపయోగించనున్నదని భావిస్తున్నారు, ఇది డైమండ్-కట్ ఫినిష్ ను కలిగి ఉండవచ్చు. బాడీవర్క్ ఇంతకు ముందు వలే అలానే ఉండవచ్చు, అప్డేట్ చేయబడ్డ జూపిటర్ గ్రాండే కొత్త కలర్ ఆప్షన్ లు మరియు గ్రాఫిక్స్ ని పొందనుంది.
Most Read: ఆనంద్ మహీంద్రా లైఫ్ లో ఉన్న ఎస్‌యూవీ కార్లు ఇవే

అలాగే 8బిహెచ్పి మరియు 8.4 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేసే అదే 109.7 సిసి, సింగిల్-సిలిండర్ ఇంజన్ తో కూడా ముందుకు తీసుకు రావాల్సి ఉంది. ఈ స్కూటర్ విడుదల సమయానికి వద్ద బిఎస్-6 నిబంధనలకు అనుగుణంగా ఉండదు.
Most Read: బర్త్ డే స్పెషల్: చిరంజీవి గురించి షాకింగ్ నిజాలు-అరుదైన కార్లు

దానికి బదులుగా ఇది బిఎస్-4 ఇంజిన్ తో ఉండవచ్చు, ఎందుకంటే బిఎస్-6 అప్ డేట్ వస్తే, స్కూటర్ ధరను పెంచడం చేయవలసి ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం బిఎస్-6 నిబంధనల కోసం ఏప్రిల్ 2020 డెడ్ లైన్ పెట్టిన విషయం తెలిసిందే.
Most Read: బిఎస్-6 మరియు బిఎస్-4 కార్ల మధ్య తేడా ఏంటి?

టీవీఎస్ జూపిటర్ జెడ్ఎక్స్ రూ.57443 - 59950 ధరతో ఉండగా ఈ కొత్త జూపిటర్ గ్రాండే సుమారు రూ.1000-1200 అధిక ధర ఉంటుంది. జూపిటర్ గ్రాండే గత సంవత్సరం లాగానే, పండుగ సీజన్లో కంపెనీ ఈ కొత్త స్కూటర్ ను ప్రారంభించనున్నట్లు మేము విశ్వసిస్తున్నాం.
Source: Autocarindia