లీక్ అయిన బిఎస్ 6 బజాజ్ పల్సర్ NS 160 స్పెసిఫికేషన్స్

పూణేకి చెందిన ద్విచక్ర వాహనతయారీదారు అయిన బజాజ్ తన బ్రాండ్ అయిన బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160 ని త్వరలో లాంచ్ చేయనుంది. కానీ బజాజ్ ఈ కొత్త బైక్ లాంచ్ చేయకముందే ఈ మోటార్ సైకిల్ యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. లీక్ అయిన బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160 యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.. !

లీక్ అయిన బిఎస్ 6 బజాజ్ పల్సర్ NS 160 స్పెసిఫికేషన్స్

బజాజ్ కంపెనీ భారతదేశంలో అధికారికంగా ప్రారంభించటానికి ముందే బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160 స్పెక్స్ లీక్ అయ్యాయి. మోటారుసైకిల్ ఇప్పటికే డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకుంది. కాని ఇప్పటి వరకు స్పెక్స్ గురించి సరైన వివరాలు వెల్లడించలేదు.

లీక్ అయిన బిఎస్ 6 బజాజ్ పల్సర్ NS 160 స్పెసిఫికేషన్స్

ఐఎబి నుండి బయటపడిన డాక్యుమెంట్ ప్రకారం కొత్తగా రానున్న మోటార్ సైకిల్ బిఎస్-6 ఇంజిన్ని కలిగి ఉంటుంది. ఇది మునుపటి మోడల్ కంటే కూడా కొంత ఎక్కువ శక్తిని పొందుతుంది. మునుపటి మోడల్ యొక్క 15.2 బిహెచ్‌పి తో పోలిస్తే పల్సర్ ఎన్ఎస్ 160 ఇప్పుడు 9000 ఆర్పీఎమ్ వద్ద 16 బిహెచ్‌పి ఉత్పత్తి చేస్తుంది.అంటే ఇది పాత మోడల్ కంటే కూడా 0.8 బిహెచ్‌పి ఎక్కువ పెరుగుదలను కనపరుస్తుంది. టార్క్ గణాంకాలు వెల్లడించలేదు, కానీ మునుపటి మోడల్ లాగా 6,500 ఆర్పీఎన్ వద్ద 14.6 ఎన్ఎమ్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

లీక్ అయిన బిఎస్ 6 బజాజ్ పల్సర్ NS 160 స్పెసిఫికేషన్స్

రాబోయే బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160 లో బిఎస్-4 వెర్షన్ లో ఉన్న అదే 160.3 సిసి సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. కాని దీనికి ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉంటుంది.

లీక్ అయిన బిఎస్ 6 బజాజ్ పల్సర్ NS 160 స్పెసిఫికేషన్స్

బిఎస్ 6 బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160 యొక్క కొలతలు గమనించినట్లయితే ఇది మునుపటి మోడల్ లాగానే ఉంటుంది. అంటే ఈ కొత్త మోటార్ సైకిల్ 2,017 మి.మీ పొడవు, 804 మి.మీ వెడల్పు, 1,060 మి.మీ ఎత్తు, వీల్‌బేస్ 1,372 మి.మీ ఉంటుంది. ఈ కొత్త బిఎస్ 6 బైక్ లో ఇంజన్ లో తప్ప దాదాపు మరి ఏవిధమైన మార్పులు ఉండవు.

లీక్ అయిన బిఎస్ 6 బజాజ్ పల్సర్ NS 160 స్పెసిఫికేషన్స్

ఇది చూడటానికి చాలా స్టైల్ గా ఉండటంతో పాటు వినియోగదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ తరానికి సరిపోయే విధానగా ఈ బైక్ తయారుచేయబడింది.

లీక్ అయిన బిఎస్ 6 బజాజ్ పల్సర్ NS 160 స్పెసిఫికేషన్స్

కొత్త బజాజ్ ఎన్ఎస్ 160 బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్ మరియు వెనుక భాగంలో అడ్జస్టబుల్ మోనో-షాక్ ఉంటుంది. ఇందులో బ్రేకింగ్ వ్యవస్థను గమనించినట్లయితే ముందు భాగంలో 260 మిమీ డిస్క్ మరియు వెనుక భాగంలో 230 మిమీ డిస్క్ ఉంటుంది.

లీక్ అయిన బిఎస్ 6 బజాజ్ పల్సర్ NS 160 స్పెసిఫికేషన్స్

బజాజ్ యొక్క కొత్త మోటారుసైకిల్ భారీ పోటీ విభాగంలో ఉంచబడుతుంది. ఇది ఇండియన్ మార్కెట్లో సుజుకి జిక్సెర్, యమహా ఎఫ్ జెడ్, అపాచీ 160 మరియు రాబోయే హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఏదేమైనా మార్కెట్లో ఇది మంచి అమ్మకాలను సాధిస్తుందని కంపెనీ వర్గాలు ఆశిస్తున్నాయి.

లీక్ అయిన బిఎస్ 6 బజాజ్ పల్సర్ NS 160 స్పెసిఫికేషన్స్

బజాజ్ కి సంబంధించిన ఇతర వార్తల ప్రకారం ఇటీవల కాలంలో బజాజ్ డామినార్ 250 ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ మోటారుసైకిల్ మంచి డిజైన్ మరియు మంచి ఫీచర్స్ కలిగి ఉంది. ఇది కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా వాహనదారునికి అనుకూలంగా ఉంటుంది.

లీక్ అయిన బిఎస్ 6 బజాజ్ పల్సర్ NS 160 స్పెసిఫికేషన్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

లీక్ అయిన బజాజ్ పల్సర్ స్పెసిఫికేషన్స్ గమనించినట్లతే ఇది మునుపటికంటే కూడా అద్భుతంగా పనిచేస్తుందని తెలుస్తుంది. ఈ కొత్త బజాజ్ పల్సర్ యొక్క ధరల గురించి ఖచ్చితమైన సమాచారం లేదు. కాబట్టి త్వరలో ఈ కొత్త బైక్ కి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడవుతాయి.

Most Read Articles

English summary
Bajaj Pulsar NS160 BS6 Specification Leaked Ahead Of Launch: Becomes Powerful. Read in Telugu.
Story first published: Friday, March 13, 2020, 10:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X