కొత్త హోండా రెబల్ 1100 లగ్జరీ బైక్ ; ఫీచర్స్ & వివరాలు

జపాన్ కేంద్రంగా పనిచేస్తున్న ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ తన కొత్త రెబెల్ 1100 బైక్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త హోండా రెబెల్ 1100 ను "రిలాక్స్ అండ్ ఎక్సైట్" డిజైన్ థీమ్‌తో అభివృద్ధి చేశారు. ఈ కొత్త హోండా రెబల్ 1100 బైక్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కొత్త హోండా రెబల్ 1100 లగ్జరీ బైక్ ; ఫీచర్స్ & వివరాలు

కొత్త హోండా రెబెల్ 1100 బైక్ ఇంజిన్ హోండా ఆఫ్రికా ట్విన్ నుండి తీసుకోబడింది. కొత్త హోండా రెబెల్ 1100 బైక్ 1084 సిసి ప్యారలల్-ట్విన్ ఇంజన్, 270-డిగ్రీ ఫైరింగ్ ఆర్డర్ మరియు 8 వాల్వ్స్ ఉన్నాయి. ఈ ఇంజన్ 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 85.8 బిహెచ్‌పి శక్తిని, 4,750 ఆర్‌పిఎమ్ వద్ద 98 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కొత్త హోండా రెబెల్ 1100 బైక్ అద్భుతమైన పనితీరును కలిగి ఉంది.

కొత్త హోండా రెబల్ 1100 లగ్జరీ బైక్ ; ఫీచర్స్ & వివరాలు

ఈ బైకులో డిసిటి ఆటోమేటిక్ కూడా ఉంది. వినియోగదారులు ఇప్పుడు మాన్యువల్ మోడ్‌ను ఎంచుకోవచ్చు మరియు హ్యాండిల్‌బార్-మౌంటెడ్ బటన్ ద్వారా గేర్‌లను మార్చవచ్చు. 2021 హోండా రెబెల్ 1100 లో రైడ్-బై-వైర్ సిస్టమ్ మరియు మూడు వేర్వేరు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. అవి స్టాండర్డ్, స్పోర్ట్ మరియు రైన్ మోడ్స్. హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్స్ కూడా కలిగి ఉంది.

MOST READ:క్రాష్ టెస్ట్‌లో ఫోర్ స్టార్ రేటింగ్ సొంతం చేసుకున్న మహీంద్రా థార్ : వివరాలు

కొత్త హోండా రెబల్ 1100 లగ్జరీ బైక్ ; ఫీచర్స్ & వివరాలు

2021 హోండా రెబెల్ 1100 బైక్ లో ఎబిఎస్ స్టాండర్డ్ గా అందిస్తుంది. ఈ కొత్త బైక్ పుల్లీ డిజిటల్ మోనోక్రోమ్ ఎల్‌సిడి ఇన్స్ ట్రూ క్లస్టర్‌ను కలిగి ఉంటుంది. ఇది బైక్ గురించి ఎక్కువ సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. బైక్ సీటు దిగువన యుఎస్‌బి పోర్టు కూడా ఉంది.

కొత్త హోండా రెబల్ 1100 లగ్జరీ బైక్ ; ఫీచర్స్ & వివరాలు

2021 హోండా రెబెల్ 1100 బైక్ సస్పెన్షన్ సెటప్ విషయానికొస్తే, ముందు భాగంలో కార్ట్రిడ్జ్ లాంటి డంపర్లతో 43 మిమీ ఫోర్క్ మరియు వెనుక వైపు పిగ్గీబ్యాక్ మోనో షాక్ సెటప్ ఉన్నాయి. కొత్త హోండా రెబెల్ 1100 బైక్ ఫ్రంట్ అల్లాయ్ వీల్ సింగిల్ 330 మిమీ రోటర్ కలిగి ఉండగా, 16 అంగుళాల వెనుక చక్రంలో 256 మిమీ డిస్క్ బ్రేక్ ఉంది.

MOST READ:ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ కొత్త కలర్స్‌లో కూడా

కొత్త హోండా రెబల్ 1100 లగ్జరీ బైక్ ; ఫీచర్స్ & వివరాలు

ఈ కొత్త హోండా రెబెల్ 1100 బైక్ మెటాలిక్ బ్లాక్ మరియు బోర్డియక్స్ రెడ్ మెటాలిక్ రంగులలో లభిస్తుంది. 2021 హోండా రెబెల్ 1100 వచ్చే ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల కానుంది.

కొత్త హోండా రెబల్ 1100 లగ్జరీ బైక్ ; ఫీచర్స్ & వివరాలు

హోండా ఇటీవల సిబి 350 ను విడుదల చేసింది, ఈ బైక్ కి మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. ఈ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంది. భారతీయ మార్కెట్లో 500 సిసి బైక్‌లను విడుదల చేయడాన్ని హోండా పరిశీలిస్తోంది. కొత్త హోండా రెబల్ 1100 బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా వాహనదారునికి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది.

MOST READ:కొత్త మాడిఫైడ్ మహీంద్రా థార్.. ఎలా ఉందో చూసారా !

Most Read Articles

English summary
2021 Honda Rebel 1100 Revealed. Read in Telugu.
Story first published: Thursday, November 26, 2020, 9:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X