Just In
- 38 min ago
మేడ్ ఇన్ ఇండియా 'ప్రాణ' ఈ-బైక్ విడుదల; తయారు చేసింది ఎవరో తెలుసా?
- 1 hr ago
భారత్‌లో కొత్త జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ : ధర & వివరాలు
- 1 hr ago
ప్రజలపై 'గ్రీన్ టాక్స్' మోతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్; ఏప్రిల్ 1 నుండి..
- 1 hr ago
స్కొడా కుషాక్ ప్రీ-ప్రొడక్షన్ ఫొటోలు వెల్లడి; 2021 మార్చ్‌లో విడుదల
Don't Miss
- News
నిమ్మగడ్డ స్పెషల్ ఆఫీసర్‌కు జగన్ సర్కార్ ప్రమోషన్- ఏడీజీగా మారిన ఐజీ సంజయ్
- Finance
బడ్జెట్‌కు ముందు వరుసగా పతనం, సెన్సెక్స్ 600 పాయింట్లు డౌన్: 4 రోజుల్లో 2300
- Sports
ఓయ్ రషీద్ ఖాన్.. ఇది అన్యాయం.. నాది కాపీ కొట్టావ్: డేవిడ్ వార్నర్
- Movies
'ఆచార్య' టీజర్లో ఆ హీరో వాయిస్ ఓవర్.. మరో మీమ్‌తో లీక్ చేసిన వరుణ్ తేజ్!
- Lifestyle
పెరుగులో ఎండుద్రాక్షను నానబెట్టి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు! ఆశ్చర్యం కలిగిస్తుంది!!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జూన్ 19న సరికొత్త ట్రయంప్ టైగర్ 900 బైక్ విడుదల
ట్రయంప్ బైక్ ప్రియులకు ఓ గుడ్ న్యూస్. ట్రయంప్ మోటార్‌సైకిల్ ఇండియా ఈనెల 19వ తేదీన భారత మార్కెట్లో ఓ సరికొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. 'ట్రయంప్ టైగర్ 900' (Triumph Tiger 900) అనే సరికొత్త బైక్‌ను జూన్ 19న విడుదల చేయనున్నారు. వాస్తవానికి ఈ బైక్ గడచిన మే నెలలోనే భారత మార్కెట్లో విడుదల కావల్సి ఉన్నప్పటికీ, కోవిడ్-19 కారణంగా ఆలస్యమైంది.

ఈ సరికొత్త ఆన్-రోడ్/ఆఫ్-రోడ్ అడ్వెంచరస్ బైక్ కోసం ట్రయంప్ ఇప్పటికే రూ.50,000 టోకెన్ అమౌంట్‌తో బుకింగ్‌లను కూడా స్వీకరిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో ట్రయంప్ టైగర్ 900 మోటార్‌సైకిల్ రెండు వెర్షన్లలో (స్టాండర్డ్, ప్రో) లభ్యమవుతోంది. భారత్‌లో లభిస్తున్న ఇతర టైగర్ 800 మోడళ్ల మాదిరిగానే కొత్త టైగర్ 900 కూడా కేవలం స్టాండర్డ్ వేరియంట్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.

సరికొత్త ట్రయంప్ టైగర్ 900 మోటార్‌సైకిల్‌లో కొత్త ఇంజన్‌తో పాటుగా డిజైన్ మరియు ఎలక్ట్రానిక్స్‌లో మార్పులు చేర్పులు ఉండనున్నాయి. కాంటినెంటల్ సంస్థతో కలిసి సంయుక్తంగా అభివృద్ది చేసిన సరికొత్త ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్‌ను ఇందులో ఉపయోగించారు.
MOST READ: మాకొక కొత్త పార్ట్నర్ కావాలి: మహీంద్రా అండ్ మహీంద్రా

ఇంకా ఇందులో బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్, ఆరు రైడింగ్ మోడ్స్ (రెయిన్, రైడర్, రోడ్, స్పోర్ట్, ఆఫ్-రోడ్, ఆఫ్-రోడ్ ప్రో), మై ట్రయంప్ కనెక్టివిటీ మాడ్యూల్ వంటి ఫీచర్లున్నాయి.

ఇక ఇంజన్ విషయానికి వస్తే.. కొత్త ట్రయంప్ టైగర్ 900 బైక్‌లో సరికొత్త 888సీసీ ఇన్-లైన్ త్రీ-సిలిండర్ బిఎస్6 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 94 బిహెచ్‌పిల శక్తిని, 87 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కొత్త ఇంజన్ టార్క్‌ను బాగా ఇంప్రూవ్ చేశారు. మునుపటి వెర్షన్‌తో పోల్చుకుంటే (8050 ఆర్‌పిఎమ్) ఈ కొత్త ఇంజన్ కేవలం 7250 ఆర్‌పిఎమ్ వద్దే గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.
MOST READ: భారత్‌లో లాంచ్ అయిన ఆంపియర్ మాగ్నస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ : ధర & ఇతర వివరాలు

కొత్త 2020 టైగర్ ట్రయంప్ 900 జిటి బైక్‌లో మార్జూఖీ సస్పెన్షన్‌ను ఉపయోగించారు. ర్యాలీ ప్రో వెర్షన్‌లో మాత్రం షోవా సస్పెన్షన్ సెటప్‌ను ఉపయోగించారు. రెండు వెర్షన్లలో కూడా బ్రెమ్బూ స్టైల్‌మా బ్రేకింగ్ సిస్టమ్‌ను ఉపయోగించారు. ముందు చక్రానికి రెండు వైపులా డిస్క్ బ్రేక్స్ మరియు వెనుక వైపు సింగిల్ బ్రేక్ ఉంటాయి. మరిన్ని వివరాలు జూన్ 19న తెలియాల్సి ఉంది.

ఇక వేరే ట్రయంప్ వార్తల్లోకి వెళితే.. ట్రయంప్ ఇంటీవలే తమ పాపులర్ బోన్‌విల్ టి100, టి120 మోడళ్లలో కొత్తగా 'బ్లాక్ ఎడిషన్' పేరిట స్పెషల్ ఎడిషన్ మోడళ్లను విడుదల చేసిన సంగతి తెలిసినదే. మార్కెట్లో ట్రయంప్ బోన్‌విల్ టి100 బ్లాక్ ఎడిషన్ ధర రూ.8.87 లక్షలుగా ఉంటే, ట్రయంప్ బోన్‌విల్ టి120 బ్లాక్ ఎడిషన్ ధర రూ.9.97 లక్షలుగా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
MOST READ: ముంబై పోలీసులకి సెగ్వే ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎందుకో తెలుసా ?

ట్రయంప్ టైగర్ 900 బైక్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
అడ్వెంచరస్ ఆఫ్-రోడింగ్ ప్రీమియం మోటార్‌సైకిళ్లంటే ఇష్టపడే వారికి ట్రయంప్ టైగర్ 900 బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అత్యుత్తమ ఆఫ్-రోడ్ బైకింగ్ సామర్థ్యాలు కలిగిన ఈ బైక్ ఈ సెగ్మెంట్లో కొత్తగా వచ్చిన బిఎమ్‌డబ్ల్యూ ఎఫ్900 ఎక్స్ఆర్, డ్యుకాటి మల్టీస్ట్రాడా 950 మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.